నేను ఒక ముఖ్యమైన వాస్తవాన్ని నొక్కి చెప్పాలి: మీరు సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకోవడం దేవుని లక్ష్యం కాదు. మీరు దీన్ని నమ్మడం ఎంత కష్టమైనప్పటికీ, అలా చెప్పవలసిన సమయం వచ్చింది. జీవితం మీరు సుఖంగా మరియు సంతోషంగా మరియు విజయవంతంగా మరియు నొప్పి లేకుండా ఉండటం కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచిన వ్యక్తిగా మారడమే జీవితం. దురదృష్టవశాత్తూ, ఈరోజు అటువంటి సందేశాన్ని మనం చాలా అరుదుగా ప్రకటించబడటం వింటాము. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను: జీవితం మీ గురించి కాదు! ఇది దేవుని గురించి.
నేను అంత భరోసాతో ఎలా చెప్పగలుగుతున్నాను? 2 కొరింథీయులకు 12:9-10 లో పౌలు ప్రతిస్పందన కారణంగా చెప్పగలుగుతున్నాను:
కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
అంతే! అతను కూడా అర్థం చేసుకున్నాడు. అలాగే అతను తన మిగిలిన జీవితాన్ని దీన్ని అనుసరిస్తూ నడిచాడు.
మీరు మరియు నేను మన బలాల గురించి ప్రగల్భాలు పలికినప్పుడు, మనము కీర్తి పొందుతాము మరియు మనము మన స్వశక్తితో ముందుకు కొనసాగుతాము. కానీ మన క్రుంగిపోయిన స్థితి, అసమర్థత మరియు అసంపూర్ణత మధ్య ఆయన ఏమి చేస్తున్నాడో దానినిబట్టి మనం అతిశయించినప్పుడు, క్రీస్తు ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఉంటాడు. మనకకు అవసరమైనప్పుడు ఆయన శక్తి మనకు సహాయపడుతుంది. ఆయన ఘనపరచబడతాడు.
ఆ సంగతి మరచిపోవద్దు. మన జీవితంలో మనం వేటికి భయపడి పారిపోతామో ఆ విషయాలే పౌలుకు సంతృప్తిని కలిగించాయి. జాబితాను చూడండి: నేను ఓడిపోయినప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. నేను అవమానాలతో సంతృప్తిగా ఉన్నాను. నా మీద అపవాదు వేసినప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. నేను కష్టాలలో సంతృప్తిగా ఉన్నాను. నేను హింసించబడినప్పుడు సంతృప్తిగా ఉన్నాను. మార్చలేని కష్టాలు మరియు ఒత్తిళ్లతో బిగుసుకుపోయినప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. ఎందుకు? “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” (10వ వచనం). అది తెలిసిన అపొస్తలుణ్ణి, జ్వలించే పరలోకపు వాక్యము ప్రకాశించి, తన మోకాళ్లపైకి తెచ్చింది. మానవ బలహీనత స్పష్టంగా కనిపించినప్పుడు దైవిక బలం వస్తుందని తెలుసుకొని-ప్రతిదానిలో సంతృప్తి చెంది-మీ జీవితాన్ని గడపడం ఎంత గొప్ప విషయం.
పౌలు నిస్వార్థమైన వినయం యొక్క వైఖరిని సిఫార్సు చేస్తున్నాడు. చాలా విశేషమేమిటంటే, పౌలు జైలులో ఉన్నప్పుడు తన రోమా కాపలాదారునితో ఎక్కడా కూడా ఈ విధంగా చెప్పినట్లు మీరు ఎప్పుడూ చదువరు: “నువ్వు నాకు సహాయం చేయాలి. ఈసారి నువ్వు చక్రవర్తి సహాయకులలో ఒకరి దగ్గరకు వెళ్లినప్పుడు, నన్ను ఈ చెత్తలోనుండి బయటకు తీసుకురావాలని అతనిని కోరండి. నేను అస్సలు ఇక్కడ ఉండకూడదు. నేను ఇక్కడ ఒక సంవత్సరం, ఏడు నెలలు, నాలుగు రోజులు, ఐదు గంటలు మరియు తొమ్మిది నిమిషాలు ఉన్నాను, ఇప్పటికే చాలా కాలం ఉన్నట్లు నేను.” పౌలు యొక్క నిస్వార్థమైన వినయం, రోమాలో లేదా మరెక్కడైనా అతనికి జరిగిన అన్యాయాల గురించి ఖచ్చితమైన రికార్డులను ఉంచకుండా నిరోధించింది. దైవ నియామకం ద్వారా అతను జైలులో ఉన్నాడు. అతను తన పరిస్థితికి ఇష్టపూర్వకంగా లొంగిపోయాడు.
పౌలు అద్భుతమైన జీవితంలో చొచ్చుకొనిపోయిన రిక్తునిగా చేసికొనుట అనే సూత్రాన్ని క్రీస్తు మాదిరిగా చూపించాడు. మనం సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలనుకుంటే, నిస్వార్థమైన వినయం యొక్క వైఖరిని పెంపొందించుకోవడమే ఆరంభానికి సరైన ప్రదేశం. మీ కుటుంబం లేదా పొరుగువారితో ప్రారంభించండి. మీ ఉద్యోగులు లేదా క్లయింట్‌ల ముందు దీన్ని మాదిరిగా చూపండి. ఆ విధమైన నిస్వార్థ మానసిక వైఖరి అనేది ప్రజలపై చూపే ప్రభావాన్ని చూస్తే మీకు నమ్మశక్యంగా ఉండదు. మీరు సమస్యను ఎత్తి చూపాల్సిన అవసరం లేదు లేదా కరపత్రాలను పంచాల్సిన అవసరం లేదు. కేవలం నిస్వార్థమైన వినయం యొక్క వైఖరిని ప్రదర్శించండి. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సంతోషకరమైన అంగీకార వైఖరిని కలిగి ఉండాలని పౌలు విశ్వాసులను హెచ్చరించాడు. విశ్వాసులు ఒకరితో ఒకరు ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలనే దాని గురించి పౌలు ఎలాంటి మాయమాటలు చెప్పలేదు. “మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి” (ఫిలిప్పీయులకు 2:14-15). అతను చిన్న చిన్న వివాదాలు మరియు గొడవలు లేకుండా సంతోషకరమైన అంగీకార వైఖరిని కోరుకున్నాడు. అతను నిజమైన ఆనందాన్ని కోరుకున్నాడు. దీనిలాగా అంటుకునేది మరేదీ ఉండదు!
Copyright © 2010 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.