మత్తయి 1-2 చదవండి.
క్రిస్మస్ వచ్చేంత వరకు సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజుకు ఒకటిచొప్పున క్రిస్మస్ వరకు ప్రతిరోజూ ఈ రోజువారీ బహుమతులను మన “క్రిస్మస్ ప్రాజెక్టులు” అని పిలువవచ్చు. జులైలో “మెర్రీ క్రిస్మస్” అని చెబితే ఉండే సరదా గురించి ఆలోచించండి!
ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:
- గొడవను పరిష్కరించండి.
- మరచిపోయిన స్నేహితుడిని వెతకండి.
- ఎప్పుడో వ్రాయవలసిన ప్రేమ పత్రాన్ని రాయండి.
- ఒకరిని గట్టిగా కౌగిలించుకుని, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెవిలో చెప్పండి.
- శత్రువును క్షమించండి.
- కోపంతో ఉన్న వ్యక్తితో నెమ్మదిగా మరియు సహనంగా ఉండండి.
- పిల్లల హృదయాన్ని సంతోషపరచండి.
- వాగ్దానం నెరవేర్చడానికి సమయాన్ని వెచ్చించండి.
- వేరొకరి కోసం ఏదైనా తయారు చేయండి. అనామకంగా.
- పగను విడిచిపెట్టండి.
- వినండి.
- అపరిచితుడితో దయగా మాట్లాడండి.
- మరొకరి దుఃఖంలోకి ప్రవేశించండి.
- చిరునవ్వు చిందించండి.
- కొంచెం నవ్వండి.
- కొంచెం ఎక్కువ నవ్వండి.
- స్నేహితుడితో కలిసి నడవండి.
- ఇతరులపై మీ డిమాండ్లను తగ్గించండి.
- సాయంత్రం భోజన సమయంలో కొన్ని అందమైన సంగీతాన్ని ప్లే చేయండి.
- మీ తప్పు ఉంటే క్షమాపణ కోరండి.
- టెలివిజన్ ఆఫ్ చేసి మాట్లాడుకోండి.
- ఎవరికో ఒకరికి ఐస్ క్రీమ్ కోన్‌తో విందు చేయండి (పెరుగు బాగానే ఉంటుంది).
- కుటుంబం కోసం అంట్లు కడగండి.
- మీరు బాధపడినప్పుడు మీకు సహాయం చేసిన వ్యక్తి కోసం ప్రార్థించండి.
- శనివారం ఉదయం అల్పాహారం సిద్ధం చేయండి.
- మీకు కటువుగా అనిపించినప్పటికీ మృదువైన సమాధానం ఇవ్వండి.
- వృద్ధ వ్యక్తిని ప్రోత్సహించండి.
- మీరు పని చేసే లేదా సమీపంలో నివసించే వారి గురించి మీరు ఎక్కువగా అభినందించే ఒక విషయాన్ని చెప్పండి.
- అలసిపోయిన తల్లి కోసం ఆమె శిశువును కొంత సమయం సంరక్షించండి.
- మనల్ని మనం ఇతరులకు సుదీర్ఘమైన, విస్తరించిన బహుమతిగా ఇచ్చుకునేదిగా క్రిస్మస్‌ని చేసుకుందాం. నిస్వార్థంగా. ముందస్తు ప్రకటన లేకుండా. లేదా భారం లేకుండా. లేదా మినహాయింపు లేకుండా. లేదా కపటము లేకుండా.
ఇది క్రైస్తవ్యం అంటే, కాదంటారా?
మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు, బహుమతిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000) 346. Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.