సంవత్సరంలోని ఈ సీజన్ అందరికీ ఆనందాన్ని కలిగించదు. సూటిగా చెప్పాలంటే, కొందరు భయపడతారు. వారు గడిచిపోయిన బాధాకరమైన రోజుల యొక్క విచారకరమైన జ్ఞాపకాలతో నిండి ఉన్నారు, వారు ఆనందగీతములు పాడటం చాలా కష్టం. “సంతోషమౌ దినం భువికి”-కాదు. “మన ఆనందం ఎంత గొప్పది!”-సరే, మీకవ్వచ్చు కానీ అందరికీ కాదు.
ఇప్పుడు, మీరు నన్ను “స్క్రూజ్” అని పిలవడానికి ముందు, మీరు మొదటి శతాబ్దానికి వెళ్ళి ఈ వర్గానికి సరిపోయే క్రీస్తు శిష్యుణ్ణి కలవాలని నేను సూచిస్తున్నాను. ఈ శిష్యుడు ఎప్పుడూ నిరాశావాదే. యేసు తనతో పాటు బేతనియకు రావాలని పన్నెండు మందిని ఆహ్వానించి, “మీరు నమ్మునట్లు,” అక్కడ ఆయన తన స్నేహితుడైన లాజరును మరణం నుండి లేపాలని అనుకున్నప్పుడు, ఈ దిగులుగా ఉన్న ప్రాణము లక్ష్యపెట్టలేదు, “ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదము” (యోహాను 11:14-16). తరువాత, యేసు ఈ లోకమును విడిచిపెట్టి, మహిమలోనికి ప్రవేశించి, తనను వెంబడించువారి కోసం తిరిగి రావడానికి ముందు వారి కోసం “స్థలమును సిద్ధం” చేయాలన్న తన ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు, అదే, విచారకరమైన వ్యక్తి దానిని గ్రహించడంలో విఫలమయ్యాడు. అందుకే అతను భయంకరంగా వెక్కిరించాడు, “ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియును?” (14:5).
అతని పేరు? మీరు బహుశా ఊహించినట్లుగా, నేను తోమాను గూర్చి మాట్లాడుచున్నాను. అతని సహచరులు ఎంతో శ్రద్ధగా కుర్చొని, యేసు యొక్క మాటలను గ్రుడ్డిగా అంగీకరించాలనుకొంటుంటే, తోమా ముఖం చిట్లించి వెనక్కి వాలిపోయాడు. వట్టి మాటలు అతనిని కదిలించలేదు. అతని యొక్క బాగా ఆలోచించే స్వభావం తన ప్రతిఘటనను వదిలిపెట్టలేదు. అలాగే అది మీకు తెలియదా? యేసు మృతులలోనుండి లేచి, వారి ముందు నిలబడి, సమాధానము మరియు అభయమిచ్చే మాటలను తీసుకొచ్చినప్పుడు, తోమా సమావేశానికి దూరమయ్యాడు! తర్వాత తక్కిన శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూచితిమి!” అని చెప్పినప్పుడు. . . . తోమా దానిని నమ్మలేదు. బదులుగా, అతను నిర్లక్ష్యముగా మాట్లాడాడు, “నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను” (20:25).
ఆ వ్యక్తిని ఒప్పించడానికి యేసు హుటాహుటిన వెనుదిరగలేదు. ఎనిమిది రోజులు, ప్రభువు ఓపికగా వేచి ఉన్నాడు. తోమాను ఒప్పించడానికి ఇతరులు ఎన్నిసార్లు ప్రయత్నించారో ఎవరికి తెలుసు? వారి ఆనందం అతని సందేహాలను మరింత పెంచింది. అకస్మాత్తుగా, చెప్పకుండా, యేసు వచ్చి, మూసివున్న తలుపు గుండా వెళ్ళి (!), నేరుగా తోమా ముందు నిలబడ్డాడు. మందలింపు లేదా సిగ్గుపరిచే మాటలేమీ అనకుండా, ఆయన తన అరచేతులను అతనికి చూపించాడు, ఆపై తన పైవస్త్రాన్ని తీసి, తనను నమ్మమని కోరుచూ, మేకులు మరియు ఈటె వలన కలిగిన తన మచ్చలను తాకడానికి అవిశ్వాసిని మెల్లగా ఆహ్వానించాడు.
అది చేసింది! సంకోచం లేకుండా, తోమా వంగి ఇలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు, “నా ప్రభువా, నా దేవా!” (20:27–28).
కథ అక్కడితో ముగిసిపోలేదు. అది ఈ క్రిస్మస్ సీజన్‌లోనూ కొనసాగుతుంది. నేనెందుకు ఇలా చెబుతున్నాను? ఎందుకంటే యేసు తనను మొత్తానికి నమ్మిన తోమాకు యిచ్చిన సమాధానమునుబట్టి: “నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు” (20:29). క్రీస్తు ప్రభువును విశ్వసించడం అసాధ్యం అని భావించేవారు చాలా మంది ఉన్నారు. మరికొందరు ఆయనను విశ్వసిస్తారు, కానీ క్రైస్తవులుగా కూడా, ఆ విచారకరమైన, ఆలోచించే శిష్యునితో గుర్తింపబడతారు–మరియు యేసు స్పష్టంగా వాగ్దానం చేసిన దానిని విశ్వసించడానికి కష్టపడతారు.
ఎక్కడో విన్నట్లుగా ఉందా? గొప్ప ఆనందాన్ని ప్రకటించే ఆనందగీతముల మాటలతో మీరు పోరాడుతున్నారా? సెలవులు అనేవి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రతిబింబించడానికి మరియు సంతోషించడానికి ఇవ్వబడిన సమయం కంటే భరించాల్సిన బరువుగా అనిపిస్తుందా?
ధైర్యంగా ఉండు, నా మిత్రమా! కాదనలేని సాక్ష్యాలను విశ్వాస నేత్రాలతో పరిగణించు. రక్షకుని పుట్టుకకు సంబంధించిన ఉత్తేజపరచు కథనాన్ని మళ్లీ చదువు. ఒక వాగ్దానానికి సమాధానంగా-యేసు వచ్చినట్లే-ఆయన మన కోసం మళ్లీ వస్తానని వాగ్దానం చేసారని గుర్తుంచుకోండి. “నా ప్రభువా, నా దేవా!” అని ప్రకటిస్తూ, తనను చూడక నమ్మినవారి కోసం ఆయన తిరిగి రాబోవుచున్నాడు.