ఒక పరిస్థితిలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది మనందరినీ పిరికివారిగా చేస్తుంది.
చేయవలసినది ఎంతో ఉన్నది గనుక, మనం చాలా తేలికగా అధైర్యపడిపోతాము మరియు ఏమీ చేయలేము. మనం చేరుకోవలసినవారు చాలామంది ఉన్నారు గనుక, మన బాధ్యత యొక్క పరిధిలోని ఆ కొద్దిమందిని ప్రభావితం చేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడని మరచిపోవటం తేలిక.
విశాలమైన ప్రదేశంలో పరిచర్య గురించి నేను మొదటిసారి ఇబ్బందిపడింది నాకు గుర్తుంది. నా జీవితం ప్రశాంతంగా మరియు నెగ్గుకొని రాగలిగినదిగా ఉంది. దక్షిణ టెక్సాస్ యొక్క చిన్న టౌన్‌లోని నా జన్మస్థలం నుండి నేను నా కుటుంబంతో కలిసి హ్యూస్టన్‌కు వెళ్లాను, అక్కడ నేను నా హైస్కూల్ సంవత్సరాల్లో నివసించాను. మా ఇల్లు చిన్నది మరియు సురక్షితమైనది. నా వివాహం తరువాత, మెరైన్ కార్ప్స్ మరియు సెమినరీలో అవరోధం ఏర్పడింది, సింథియా మరియు నేను మేము గతంలో పాల్గొన్నటువంటి పరిచర్యలలో పాల్గొన్నాము . . . చిన్న, ఆహ్లాదకరమైన మరియు సంతృప్తికరమైన పరిచర్యల్లో పాల్గొన్నాము. మా పిల్లలు చిన్నవారు, మా జీవితాలు హాయిగా మరియు నిరాడంబరంగా ఉన్నాయి, మరియు దేవుని పని యొక్క మా పరిధి చాలా సౌకర్యంగా ఉంది.
1971 లో కాలిఫోర్నియాలోని ఫుల్లర్‌టన్‌కు వెళ్లాలన్న పిలుపు అన్నింటినీ మార్చివేసింది. వాస్తవానికి, మేము ఎన్నుకోబడుటకు వస్తున్నప్పుడు విమానం లాస్ ఏంజిల్స్ మీదుగా క్రిందకు దిగినప్పుడు నాకు ఈ విపరీతమైన అనుభూతి కలిగింది. నేను చిన్న కిటికీలోంచి చూసాను మరియు అనేకమైన పెద్ద రోడ్లు మరియు భవనాలు మా క్రింద దాటినట్లు చూసాను. అంతం లేని మనుష్యులను కలిగిన ఈ మహానగరానికి పరిచర్య చేయడాన్ని నేను ఊహించడానికి ప్రయత్నించాను. నేను అనుకున్నాను, ఈ బ్రహ్మాండమైన పనిని నేను ఎలా నెగ్గుకు రాగలను? దక్షిణ కాలిఫోర్నియాలోని అనేక లక్షల మందిని చేరుకోవడానికి నేను ఏమి చేయగలను?
అకస్మాత్తుగా, దేవుడు ఎప్పటిలాగే నాకు మెల్లగా గుర్తుచేశాడు: నేను వారినందరినీ ఎన్నటికీ చేరుకోలేను-అది మానవీయంగా అసాధ్యం. కానీ నాకు పరిచయమైన వారి విషయమై నేను బాధ్యత కలిగియున్నాను మరియు దేవుని సహాయంతో, నేను వారి జీవితాల్లో మార్పు తెస్తాను.
నేను ఎంతో అసాధ్యమైన దానిమీద దృష్టి పెట్టడం మానేశాను మరియు దేవుడు నన్ను మరియు నా కుటుంబాన్ని ఏ వ్యక్తులు మరియు ప్రదేశం దగ్గరకు పిలిచాడో-అటువంటి సాధ్యమైన వాటిపై నా సమయం మరియు శక్తిని ధారపోయడం మొదలుపెట్టాను. మీకిష్టమైనతే నా దర్శనం పరిమితం అని పిలవండి, కానీ అది నా మనశ్శాంతి విషయంలో ఎంతో ప్రధానమైనది. నేను ఇదంతా చేయలేను. . . నేను మా ప్రాంతంలోని విస్తారమైన సరిహద్దులను పూర్తిగా అర్థం చేసుకోలేను(ఎవరూ చేసుకోలేరు!), కానీ నా “కనుచూపు మేర” పరిధిలోకి వచ్చే వారిని నేను స్పృశించగలను. ఇక్కడ ఒకరిని, అక్కడ మరొకరిని, కనీసం వారి జీవితాలలో, నా స్పర్శ తేడాను కలిగిస్తుందని తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతి వస్తుంది.
నేను ఇటీవల చదివిన కథలో ఆ రకమైన ఆలోచన స్పష్టంగా వర్ణించబడింది. ఒక వ్యాపారవేత్త మరియు అతని భార్య అలసిపోయేంత బిజీ అయిపోయారు. వారు ఒకరికొకరు, వారి కుటుంబం, వారి సంఘము, వారి పని, వారి స్నేహితులకు కట్టుబడి ఉన్నారు.
కొంత విరామం అవసరమై, వారు సముద్రతీరమందలి హోటల్‌లో కొన్ని రోజులు విశ్రాంతి కోసం విముక్తి పొందారు. ఒక రాత్రి బీచ్‌లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించింది మరియు భారీ కెరటాలు ఒడ్డుకు హోరెత్తుతూ వచ్చాయి. ఈ మనిషి మంచం మీద పడుకుని, అంతులేని డిమాండ్లు మరియు ఒత్తిళ్ల యొక్క తన స్వంత తుఫానులాంటి జీవితం గురించి ఆలోచిస్తున్నాడు.
చివరకు గాలి అణగిపోయింది మరియు తెల్లవారటానికి కొంచెం ముందు ఆ వ్యక్తి మంచం నుండి మెల్లగా లేచి, బీచ్ వెంట నడిచి, ఏమి నష్టం జరిగిందో చూడటానికి వెళ్లాడు. అతను షికారు చేస్తున్నప్పుడు, ఒడ్డుకు విసిరివేయబడి నిస్సహాయంగా గొప్ప అలలతో చిక్కుకుపోయిన స్టార్ ఫిష్‌తో ఒడ్డు అంతా కప్పబడి ఉండటం అతను చూశాడు. ఒక్కసారి ఉదయకాల సూర్యుడు మేఘాల గుండా మండిన తర్వాత, స్టార్ ఫిష్ ఎండిపోయి చనిపోతుంది.
అకస్మాత్తుగా ఆ వ్యక్తి ఒక ఆసక్తికరమైన దృశ్యాన్ని చూశాడు. స్టార్ ఫిష్‌ల దుస్థితిని గమనించిన ఒక చిన్న పిల్లవాడు వాటిని ఒక్కొక్కటిగా ఎత్తుకుంటూ తిరిగి సముద్రంలోకి విసరివేయుచున్నాడు.
“ఎందుకు అలా చేస్తున్నావు?” అని అతను వినగలిగేంత దగ్గరగా వచ్చి ఆ వ్యక్తి ఆ కుర్రాడిని అడిగాడు. “ఒక వ్యక్తి ఎన్నటికీ తేడా చూపలేడని నువ్వు చూడలేకపోతున్నావా-నువ్వు ఆ స్టార్ ఫిష్‌లన్నింటినీ తిరిగి నీటిలోకి పంపించలేవు. అవి చాలా ఎక్కువ ఉన్నాయి.”
“అవును, అది నిజమే,” అని బాలుడు నిట్టూర్పు విడిచి వంగి మరొకదాన్ని తీసుకుని నీటిలో పడేశాడు. అప్పుడు అది మునిగిపోతున్నట్లు అతను గమనించినప్పుడు, అతను ఆ వ్యక్తిని చూసి, నవ్వుతూ, “కానీ నేను ఖచ్చితంగా ఆ ఒక్కదాని విషయంలో ప్రభావం చూపించాను” అని చెప్పాడు.
ఒక్క వ్యక్తి అన్నిటినీ అధిగమించి విజయం సాధించలేడు. సమయం లేదా శక్తి లేదా నిబద్ధత అందించే దానికంటే ఎప్పుడూ చేరుకోవడానికి చాలా ఎక్కువే ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే మనలో ప్రతి ఒక్కరం కొందరినే స్పృశిస్తుంది. మనము ప్రతి ఒక్కరికీ సహాయం చేయలేము కాబట్టి మనం ఎవరికో ఒకరికి సహాయం చేయడం మానేస్తే ఎంత పొరపాటు.
భయపడవద్దు. మీ చిన్న ప్రయత్నాలను కూడా ఘనపరచి విస్తరింపజేయడానికి దేవునిపై ఆధారపడండి. చివరిసారిగా నేను సరిగ్గా చూసినప్పుడు, ఆయన ఇప్పటికీ విశ్వాస్యతకు ప్రతిఫలమిస్తున్నాడు.
Taken from Charles R. Swindoll, “You Can Make a Difference,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 186-87.