కొంతకాలం క్రితం, చక్ స్విండాల్ USA లోని కొలరాడోలోని డెన్వర్ సెమినరీ అధ్యక్షుడు డాక్టర్ మార్క్ యంగ్‌ని కలిసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మార్క్ డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో వరల్డ్ మిషన్స్ మరియు ఇంటర్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు మరియు డెన్వర్ సెమినరీలో తన పనిని అంగీకరించడానికి ముందు టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చిలో మిషన్‌లకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పాస్టర్‌గా పనిచేశారు. ఈ సంభాషణలో, ఇద్దరు చిరకాల మిత్రులు బైబిల్ యొక్క కాలాతీత నిధి గురించి మరియు సంవత్సరాలుగా చక్ బోధకునిగా ఎదగడం గురించి చర్చించారు.
మార్క్ యంగ్: మీ మొదటి ప్రసంగమును ఎప్పుడు బోధించారో మీకు గుర్తుందా?
చక్ స్విండాల్: సింథియా మరియు నేను డేటింగ్ చేస్తున్నప్పుడు. నేను ఒక చిన్న సువార్త బృందం కోసం సంగీతాన్ని నడిపించేవాడిని మరియు ఆమె పియానో వాయించేది. ఒక సందర్భంలో, బోధకులలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు, అప్పుడు నేను ఆయన స్థానంలో బోధించాను . . . తప్పిపోయిన కుమారుని గూర్చి బోధించాను.
మార్క్: బాగుంది.
చక్: అది చాలా ఘోరమైనది.
మార్క్: అయితే, నేను దీన్ని ప్రేమిస్తున్నాను! అని బోధించడం గురించి మీరు ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు?
చక్: నేను ఒకినావాలో యుఎస్ మెరైన్‌గా సేవలందిస్తున్నాను మరియు నావిగేటర్ మెంటర్ బాబ్ న్యూకర్క్‌తో కలిసి వీధి సువార్త చేస్తున్నాను, మేమిద్దరం ఫ్లాట్‌ఫారమ్ ఉన్న ట్రక్ పై నిలబడి ఉన్నాము. ఈ రోజు నేను ప్రజలకు బోధకునిగా మాత్రమే తెలుసు, కానీ అప్పట్లో నేను మెరైన్‌గా ఉండేవాడిని. నేను నావిగేటర్స్‌తో కలిసి పరిచర్య చేస్తున్నాను, ఇది ప్రధానంగా వ్యక్తిగతీకరించబడిన పరిచర్య, కాబట్టి ఆ సమయంలో నన్ను నేను బోధకునిగా ఎప్పుడూ చూసుకోలేదు. ఒకరోజు బాబ్ నాకు బోధించే అవకాశం ఇచ్చే వరకు నేను పాడడంలో సహాయం చేస్తూ ఉండేవాడిని-ఇది నాకు ఎంతో సంతోషకరమైన సమయం. అంతకు ముందు, నేను బాబ్‌ని అడిగాను, “నువ్వు నన్ను ఇలా చేయమంటావా? నేను ఎన్నడూ బోధించలేను.” మరియు అతను నాతో ఇలా చెప్పాడు (నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను), “నీలో సహజంగానే ఉంది.” తరువాత, నేను దీన్ని చేయగలను అని అనుకున్నాను.
మార్క్: నిజమే. కచ్చితంగా.
చక్: నేను ఇంతకు ముందు హాజరైన ఏ చర్చిలోనూ బాబ్ లాగా ఏ పాస్టరూ లేడు. వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను భావాలను వ్యక్తీకరించరు, మరియు వారు ఏదైనా తప్పు చేసినట్లుగా చెప్పిన సందర్భాన్ని నేను ఎప్పుడూ వినలేదు. అటువంటి ప్రామాణికత ఎన్నడూ మాదిరిగా చూపబడలేదు.
ఒకినావాన్ స్ట్రీట్ మినిస్ట్రీ చక్ తన అద్భుతమైన, నిజాయితీగల శైలిలో బోధించాలనే కోరికను రేకెత్తించినప్పటికీ, బహిరంగంగా మాట్లాడే అతని సామర్థ్యం అంత సులభంగా రాలేదు. ఒక హైస్కూల్ టీచర్ ఈ రోజు మనం తక్షణమే గుర్తించిన స్పష్టత మరియు అభిరుచితో మాట్లాడే చక్‌కు సహాయం చేశాడు.
మార్క్: చక్, మీ ఆరంభ జీవితంలో మాట్లాడే సమస్య గురించి మీరు మాట్లాడటం నేను విన్నాను. బోధకుడవ్వటానికి సంకోచించడంలో అది కారణమా?
చక్: జూనియర్ హై స్కూల్‌కు వచ్చేసరికి, నాకు నిజమైన ప్రసంగ లోపం ఏర్పడింది . . . నేను చాలా స్వీయ స్పృహతో ఉన్నాను. నేను ఈ విధంగా ఆలోచించినట్లు నాకు గుర్తుంది, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటానా? నేను హైస్కూల్‌కి చేరే సమయానికి, డిక్ నీమ్ అనే ఒక నాటక టీచర్ నన్ను ఒకరోజు హాలులో ఆపాడు. ఆయన ఇలా చెప్పాడు, “నా డ్రామా టీమ్‌లో మరియు నా స్పీచ్ క్లాస్‌లో నువ్వు ఉండాలి, మేము వేసే కొన్ని నాటకాల్లో కూడా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను.” నేను అన్నాను, “నే . . . నే . . నేనా?” ఆయన నా ప్రక్క లాకర్ వద్ద ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను. ఆయన చెప్పాడు, “అవును, దానికి కావాల్సిన సత్తా నీ దగ్గర ఉంది.”
మార్క్: వావ్.
చక్: కాబట్టి ఆ వేసవికాలంలో నేను ఆ వ్యక్తితో స్పీచ్ థెరపీ క్లాసు తీసుకున్నాను. ఎంత అద్భుతమో కదా?
మార్క్: అది దాదాపు నన్ను కంటతడి పెట్టిస్తుంది.
చక్: ఎలా మాట్లాడాలో నేర్పించినందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీ మనస్సు నీ నోటికంటే ముందుగా వెళ్లిపోతుంది.” ఈరోజు నాకు దీనికి పూర్తిగా భిన్నమైన సమస్య వచ్చింది. కానీ, నిజంగా . . . నాకు పదాలు అంటే ఇష్టం. నేను పదాల పట్ల అత్యాసక్తి గలవాడనయ్యాను.
మార్క్: నువ్వు అలా అయ్యావని నాకు తెలుసు.
చక్: మరియు నేను పుస్తకాలను ప్రేమిస్తున్నాను! నేను ఒక వాక్యం దగ్గర ఆగి మళ్లీ మళ్లీ చదువుతాను. నేను గొప్ప పదాలను ప్రేమిస్తాను.
చక్‌కు కేవలం మాటలపైనే కాదు, దేవుని వాక్యం పట్ల మరింత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము పట్ల ఈ భక్తి మరియు విశ్వసనీయత తన బోధనా పరిచర్య ద్వారా బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో అతని అంకితభావం మీద ప్రభావం చూపింది.
మార్క్: సంవత్సరాలు గడిచేకొద్దీ జనసమూహాల అంచనాలు మారాయని మీరు అనుకుంటున్నారా?
చక్: తప్పకుండా. నా యాభైకి పైబడిన సంవత్సరాల పరిచర్యలో, శైలులు మారినట్లే, విషయాలు మారాయి . . . కానీ కొన్ని విషయాలు మారవు: దేవుని వాక్యం అలాగే ఉంటుంది; అది నిత్యము నిలకడగా ఉంటుంది.
మార్క్: నేటి పరిస్థితుల్లో మీరు వినేవారిని ఎలా సంపాదిస్తున్నారు?
చక్: మీరు శ్రోతలను గౌరవించాలి. వారు అవమానించబడినప్పుడు లేదా మూర్ఖంగా లేదా అసౌకర్యంగా అనిపించే భావన కలిగించబడినప్పుడు ఎవరూ మంచిగా నేర్చుకోలేరు. కాబట్టి, నేను జాగ్రత్తగా గమనిస్తూ అందరూ ఏదైతే వినాలనుకుంటున్నారో అటువంటి వినపొంపుగా ఉండే మాటలను చెప్పడానికి నేను ప్రయత్నించను. నేను అలా చేయను.
మార్క్: చేయరు.
చక్: అలాగే, బైబిల్ పరంగా వాస్తవంగా నిరక్షరాస్యులైన వారి గురించి నాకు ఎప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అవగాహన ఉంది. చాలామంది నాలుగు సువార్తల పేర్లు చెప్పలేరు. వారు అనుకుంటున్నారు, “ఈ పుస్తకం గురించి నాకు ఎప్పటికీ తెలియదు. . . . ” నా పని ఏమిటంటే, “దీని గురించి మీరు తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం మీరు జీవించాలనుకుంటున్న జీవితం గురించి మాట్లాడుతుంది.”
మార్క్: ఇది చాలా కీలకమైనదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రజలు బైబిల్ ఏమి చెబుతున్నదో తెలుసుకుని వస్తారని లేదా అది వారి జీవితాల్లో ఏమైనా మార్పు తెస్తుందని నమ్ముతారని మీరు ఊహించలేరు.
చక్: అది నిజమే. అంతరాయం కలగకుండా, ప్రసంగాన్ని ఆసక్తికరంగా ఉంచకుండా 30 లేదా 40 నిమిషాలు వారిని శ్రద్ధగా కూర్చుండబెట్టడానికి ఒక పెద్ద జనసమూహము ముందు నిలబడటానికి నేను ఎవరిని?
మార్క్: అక్షరాలా నిజం.
చక్: ఈ రోజుల్లో ప్రజలు స్వతస్సిద్ధంగా ఆసక్తి చూపరు.
మార్క్: నిజం. మీకు తెలుసా, బైబిల్‌కు చాలా మంది మనస్సులలో అధికారం లేదు మరియు పాస్టర్ కార్యాలయానికి అదే అధికారం లేదు గనుక-మనం సమకాలీన సంస్కృతిని చేరుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే వ్యక్తిగతంగా వ్యక్తులతో సంబంధం కలిగియుండే సంసిద్ధత నుండి వస్తుంది.
చక్: అవును. నిజం.
మార్క్: మీరు సంరక్షిస్తారు మరియు మీరు నమ్మకమైనవారుగా ఉంటారు. మీరు కలిగి ఉన్న ప్రసంగ సంభాషణ శైలి. . . అదే మీరు ఎవరనేది చెబుతుంది.
చక్: అవును, అదే చెబుతుంది.
మార్క్: మరియు ఇది నిజంగా చాలా శక్తివంతమైనది, చక్.
చక్: నేను అక్కడికి వెళ్లడానికి అనుమతి తీసుకున్నప్పుడు, అది స్వేచ్ఛను యిచ్చేది. నేను బోధిస్తున్నప్పుడు, నేను ప్రదర్శన చేయడం లేదు.
సంభాషణ యొక్క చివరి భాగంలో, ఒక వరముగా, ఒక పిలుపుగా మరియు ఒక పరిచర్యగా బోధించడం గురించి చక్ మాట్లాడారు. యేసు మాదిరిగా గొర్రెలను కాయుటకు, చక్ తన ప్రసంగంలోని చివరి మాటలు మాట్లాడిన తర్వాత కూడా ప్రజలకు ప్రాధాన్యతనిస్తూనే ఉంటారు. పెద్ద సమూహానికి లేదా చిన్న సభకి బోధించినా, బైబిల్ ఖచ్చితమైన మరియు శ్రద్ధగల రీతిలో బోధించబడుతుందని నిర్ధారించడంపై ఆయన దృష్టి ఉంది
మార్క్: మీరు ప్రతి ఆదివారం ఉదయం రెండు కూడికల్లో బోధిస్తారు. రెండవ సందేశం తర్వాత, మీకు ఎలా అనిపిస్తుంది?
చక్: నేను అలసిపోతాను, అయినా సరే, నేను పాస్టర్‌ని కాబట్టి నేను అందుబాటులో ఉంటాను. నేను అతిథి బోధకుణ్ణి లేదా లెక్చరర్‌ని కాదు. నేను బయటకు వెళ్లే ద్వారము దగ్గర నిలబడతాను, చివరి వ్యక్తి వెళ్లే వరకు నేను అక్కడే ఉంటాను.
మార్క్: నేను చర్చి ముందు సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. “ఆయన ఇంకా ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు చెప్పుకోవడం నేను విన్నాను.
చక్: నేను నిజంగా అక్కడ ఉండాలనుకుంటున్నాను. నేను అలసిపోయి ఉండవచ్చు, కానీ నేను ఇతరులతో ఉండటానికి ఇంకా సమయం తీసుకుంటాను, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపచర్య చేస్తుందని నేను నమ్ముతున్నాను.
మార్క్: ఒక చిన్న సమూహానికి బోధించేటప్పుడు బోధకుడు మరియు ప్రేక్షకుల మధ్యలో ఉండే కదలికలో తేడా ఉందని మీరు అనుకుంటున్నారా?
చక్: ఓహ్, తేడా ఉందనే నేను అనుకుంటున్నాను. కానీ అది ఇప్పటికీ దేవుని వాక్యమే, ఒక సెల్‌లో ఇద్దరు ఖైదీలతో మాట్లాడుతున్నా లేదా వేలాది మంది సంఘ సభ్యులతో మాట్లాడుతున్నా సత్యము ఎప్పటికీ సత్యమే.
మార్క్: ఇప్పుడు ఒక క్షణం అలసిపోయిన పాస్టర్ల గురించి ఆలోచిద్దాం, దేవుడు బోధించడం ద్వారా పని చేస్తున్నాడా? అని వారు ఆశ్చర్యపోతున్నారు. వారికి మీరు ఏమి చెబుతారు?
చక్: “అవును.” నా మాట ఏమిటంటే “అవును.” నేను అలాంటి ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకోగలను. నేను అలాంటి సమయాల గుండా వెళ్తాను. “నేను దాని గురించే ఆలోచించడానికి ఇది సమయమా?” లేదా “నేను వింటున్న వారితో కనెక్ట్ అవుతున్నానా, లేదా నేను సన్నిహితంగా ఉండలేకపోతున్నానా?” అందుకే వచ్చే జనులను నేను తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, “ఈ రోజు నేను చెప్పినది అర్థమైందా?”
మార్క్: నిజమే.
చక్: తన వాక్యమును ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడని మనందరికీ నన్ను గుర్తు చేయనివ్వండి. “మీరు నా వాక్యమును ఎలా అందించారో అది మీకు మంచి అనుభూతిని కలిగించేలా నేను ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తాను,” అని ఆయన చెప్పలేదు. ఆయన ఇలా చెప్పాడు, “నేను నా వాక్యమును ఆశీర్వదిస్తాను.”
మార్క్: అది నిజం.
చక్: అది నిష్ఫలముగా తిరిగి రాదు. యెషయా 55:10-11 ఇలా చెబుతోంది, “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి . . . అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును; నిష్ఫలముగా నాయొద్దకు మరలదు.” ప్రతిసారి ఎవరైనా దేవుని వాక్యాన్ని అందించినప్పుడు, అది గడ్డకట్టుకుపోయిన సరస్సుపై దుంగను విసిరేయడం లాంటిది. మొత్తానికి, వెచ్చని రోజులు వస్తాయి, మంచు కరిగిపోతుంది . . . అలాగే ఆ దుంగ మునిగిపోతుంది.