ఆరుగురు సమూహముగా, మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక మొద్దుగా వుండే నారింజ కొవ్వొత్తి వెలుగుతోంది, మా ముఖాలు అంతటా మినుకుమినుకుమనే వింతైన నీడలు అలుముకున్నాయి. ఒకరు మాట్లాడుచున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో మృదువుగా, అప్రయత్నంగా తేలికగా నిర్వహించబడింది. ప్రతి సమాధానం లోతైన జ్ఞానము యొక్క బావుల నుండి తీసుకోబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపొందించబడింది మరియు కాలానుగుణంగా పోషించబడింది. మరియు బాధ. తప్పులు మరియు ఆదరణ లేకపోవటం. ఒకే సంఘములో నలభై సంవత్సరాలు ఉన్నట్లుగా. మరియు అనుభవపూర్వకంగా ప్రయాణించాడు. ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేసినట్లుగా. అలాగే పరీక్షలు, ప్రమాదాలు, హృదయ విదారకాలు మరియు వైఫల్యాల ద్వారా మెరుగుపరచబడ్డాడు. కానీ శ్రేష్టమైన ద్రాక్షారసము మాదిరిగానే, అదే దశాబ్దాల మూస ఆయన ఆలోచనను అమూల్యమైనదిగా చేసింది. ఆ సంవత్సరాలన్నీ మిలిటరీలో గడిపినట్లయితే, ఆయనకు ఛాతీ నిండా పతకాలు ఉండేవి.
ఆయన వయస్సు? డెభ్బై రెండు. ఆయన ముఖం? యాభై మైళ్ల పాడైన రహదారి వలె కఠినముగా ఉన్నది. ఆయన కళ్ళు? ఆహ్, ఆ కళ్ళు. అవి మీ కపాలం వెనుక భాగంలోకి చొచ్చుకుపోయినట్లు, గుచ్చుకున్నట్లుగా ఉన్నవి. మంద యొక్క వృద్ధిని మరియు ఆనందాన్ని-ఆయన అన్నింటినీ చూశాడు, అన్నింటినీ ఎదుర్కొన్నాడు. మోసపూరిత మరియు అత్యాశ తరాల యొక్క అన్ని మోసాలు మరియు జిమ్మిక్కులను సహించాడు, జీవితాలు విప్లవాత్మకంగా మారడం చూచి తన్మయత్వం చెంది, నాశనమైన జీవితాల వేదనను మరియు మార్పులేని జీవితాల యొక్క విసుగును గ్రహించాడు. ఆయన కష్టపడ్డాడు-దాన్ని నిరూపించడానికి గుర్తులు ఉన్నాయి.
ఆయన బాగా వయస్సు పైబడినవాడని దీని అర్థం కాదు. లేదా ఆయన జీవించడానికి తన అభిరుచిని, తన ఆలోచనలను వ్యక్తీకరించే సామర్థ్యం లేదా తన చురుకైన హాస్య భావనను కోల్పోయాడని సూచించడంలేదు. ఆయన కథలు వింటూ, ఆయన సూత్రాలను గూర్చి ఆలోచిస్తూ, ఆయన అభిప్రాయాలను ప్రశ్నిస్తూ, ఆయన ఆలోచనలకు ప్రతిస్పందిస్తూ, అక్కడే మేము మూడు గంటల పాటు కూర్చున్నాము. ఆ సాయంత్రం నవ్వుకుంటూ మధ్యలో విరామం తీసుకొని నిశ్శబ్దంగా సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది.
నేను పాల్గొన్నప్పుడు, నేను అకస్మాత్తుగా ఇరవై ఆరు సంవత్సరాల వయస్సువాడనైపోయాను. ఒక యువ సెమినారియన్‌గా మరియు పాస్టోరల్ ఇంటర్న్‌గా, కోరికతో నిండిన హృదయం మరియు కలలతో నిండిన తల మధ్య ఎవరూ లేని ప్రదేశంలో ఉన్నాను. వేదాంత సిద్ధాంతాలపై ఎక్కువసేపు గడిపాను కానీ ఆచరణాత్మక అనుభవం తక్కువగా ఉంది. ఎవరూ అడగని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి కానీ నిజంగా ముఖ్యమైన విషయాలపై అవగాహన లోపించింది. ఒక్క క్షణం గతంలోనికి వెళితే, ముప్పై సంవత్సరాల క్రితం ఈ వ్యక్తితో అదే గదిలో, అదే బావి యొద్ద త్రాగుచూ, అదే స్ఫూర్తిని ఆస్వాదిస్తూ, నన్ను నేను చూసుకున్నాను. అయితే, అప్పుడు, నేను కేవలం ప్రభావితంచేయబడ్డాను . . . ఈసారి నేను ఎంతో భావోద్వేగానికి గురైయ్యాను. ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ఒక మాదిరి; ఇప్పుడు ఆయన ఒక ఉపదేశకుడయ్యాడు. పూర్తిగా మానవుడు మరియు పూర్తిగా నమ్మదగినవాడు, ఆయన ప్రభువు యొక్క ఉపయోగమునకు బాగా వాడబడిన ఘనమైన పాత్రగా ఉద్భవించాడు. రే స్టెడ్‌మన్ యొక్క నీడ నా జీవితాన్ని తాకినందుకు నేను చాలా కృతజ్ఞుడను.
చెడిపోయిన నాయకులు, పడిపోయిన హీరోలు, బిజీగా ఉన్న తల్లిదండ్రులు, ఉన్మాద కోచ్‌లు, అహంకార అధికార రూపాలు మరియు చదువుల మేధావులు ఉన్న రోజుల్లో, మనకు మునుపెన్నడూ లేని విధంగా ఉపదేశకులు కావాలి–మనకు దేవుళ్లు కాదు, మార్గదర్శకులు కావాలి. జీవిత చిక్కుల గుండా జాగ్రత్తగా దాటి చర్చలు జరపడానికి సహాయపడే అందుబాటులో ఉండే, సంరక్షించే ఆత్మలు మనకు కావాలి. అదృశ్య భాగస్వాములు, లంగరువలెనుండు నిరీక్షణ మరియు శ్రేష్ఠత వైపు ప్రయాణంలో నిందలు.
ఆ సాయంత్రం మేము రేకి వీడ్కోలు చెప్పినప్పుడు, నేను కొంచెం నెమ్మదిగా నడిచాను. నాకు నేరుగా బోధించకుండా ఆయన నాకు నేర్పించిన విషయాల గురించి, ఉద్దేశపూర్వకంగా నన్ను హెచ్చరించకుండా ఆయన నాకు ఇచ్చిన ధైర్యం గురించి ఆలోచించాను. ఇది ఎలా జరిగిందోనని నేను ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు ఇంత ఆధిక్యతను పొందానోనని ఆశ్చర్యపోయాను.
డెభ్బై రెండేళ్ల వయసులో, ఆయనకు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో సంవత్సరాలు లేవని నేను గ్రహించవలసి వచ్చినప్పుడు నా గొంతులో ఒక జ్ఞాపకపు ముడి ఏర్పడింది. నేను ఆయన కారు వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి, నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మరియు మెచ్చుకొనుచున్నానో మళ్లీ చెప్పాలనుకుంటున్నాను.
కానీ అది ఆలస్యమైపోయింది. మొత్తానికి, నేను యాభై ఐదు సంవత్సరాల మనిషిని. ఒక భర్తని. ఒక తండ్రిని. ఒక తాతని. ఒక పాస్టర్‌ని. కొందరికి, ఒక నాయకుణ్ణి.
కానీ నేను చల్లని రాత్రి గాలిలో ఒంటరిగా నిలబడినప్పుడు, నేను పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నానో అకస్మాత్తుగా నాకు గ్రహింపు కలిగింది.
Taken from Charles R. Swindoll, “A Mentor,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 488-89. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide. Used by permission.