సంపదను అధికంగా ప్రేమించటం ప్రబలంగా ఉన్న ఈ చిన్న సమాజంలో, ప్రత్యేక సందర్భాలలో మన స్నేహితులకు మరియు ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు కొనాలో తెలియని స్థితిలో ఉంటాము. కొంతమంది వ్యక్తులకు (ముఖ్యంగా “అన్నీ ఉన్నవారు”), ప్రామాణిక బహుమతి సరిపోదు. షాపింగ్ మాల్‌లో ఏదీ మనకు నచ్చదు.
నా దగ్గర ఓ సలహా ఉంది. ఇది ఖరీదైనదిగానో లేదా చాలా నూతనమైనదిగానో అనిపించకపోవచ్చు, కాని నన్ను నమ్మండి, ఇది ప్రతిసారీ పనిచేస్తుంది. ఇది గొప్ప విలువను కలిగివున్న బహుమతుల్లో ఒకటి, కాని ధర ఎంతో తెలియదు. ఇది పోగొట్టుకొనబడదు లేదా ఎప్పటికీ మరచిపోబడదు. పరిమాణంతో సమస్య కూడా లేదు. ఇది అన్ని ఆకారాలకు, ఏ వయస్సుకైనా మరియు ప్రతి వ్యక్తిత్వానికి సరిపోతుంది. ఈ ఆదర్శ బహుమానం . . . మీరే. దయాళుత్వము యొక్క అసాధారణ విలువను విస్మరించవద్దు.
ఇది నిజం, మిమ్మల్ని కొంత అప్పగించుకోండి:
- మీ అవసరమున్న వ్యక్తికి మీ సమయంలో ఒక గంట ఇవ్వండి.
- నిరాశకు గురైనవారికి ప్రోత్సాహక లేఖ ఇవ్వండి.
- మీ కుటుంబంలోని ఒకరికి ధైర్యాన్ని యిచ్చే కౌగిలింత ఇవ్వండి.
- ఒంటరిగా ఉన్నవారికి కొంత సమయం ఇవ్వండి.
- అనారోగ్యంతో ఉన్నవారికి భోజనం ఇవ్వండి.
- నష్టపోయిన వ్యక్తికి కరుణించే మాట ఇవ్వండి.
- పడిపోయినవారికి రెండవ అవకాశం ఇవ్వండి.
- తరచుగా పట్టించుకోబడని వ్యక్తిని గూర్చి ఆలోచించే పని చెయ్యండి.
- విసుగు చెందినవారికి సున్నితమైన స్పందన ఇవ్వండి.
ఎఫెసీయులకు 4:32 మాటలలో చెప్పాలంటే, దయగలిగి యుండండి. నా సోదరి లూసీ ఈ వాక్యమును ఇలా వివరిస్తుంది, “మంచిగా ఉండండి అంతే.”
బైబిల్ యొక్క ఒకనికొకరు ఆజ్ఞలను ఆవరించినది (మరియు వాటిలో చాలా ఉన్నాయి!) దయ యొక్క గొడుగుయై ఉన్నది. కనికరము మరియు కృప, తగ్గింపు మరియు సాత్వికము అన్నీ దయాళుత్వముతో పెనవేసుకున్నవి. దయాళుత్వము కృపను యిస్తుంది, అందుకు తగ్గింపు అవసరం, అలాగే మనకంటే ముందు ఇతరులను గూర్చి ఆలోచించమని అడుగుచున్నది.
జీవితం పక్కదారి పట్టినప్పుడు దయాళుత్వము చూపుట ఎంతో మెచ్చుకొనదగినదని ఎప్పుడైనా గమనించారా? “అటువంటి రోజుల్లో ఒకటి” మీకు ఎదురైనప్పుడు, దయాళుత్వము ఆ ఆలోచనాత్మక మాటను పలుకుతుంది మరియు మిమ్మల్ని జీవితపు బాటలోనికి ఆకర్షిస్తుంది.
క్రీస్తు శరీరము వైపు తప్ప దయాళుత్వము యొక్క నమూనాగా ప్రపంచం ఎవరిని చూడాలి? అనుకోకుండా, వీధిలో ఉన్న వ్యక్తిని తనకు తెలిసిన క్రైస్తవులను ఎలా వివరిస్తారో అడగండి. అలాగే దయ అతని మొదటి లేదా అతని రెండవ ప్రతిస్పందన కాదని నేను ధైర్యంగా చెప్పగలను. మనం దానిని మార్చాలని నేనంటున్నాను.
మీరు మరియు నేను ఈ రోజు చేయగలిగేది దయాళుత్వము చూపటమే. సున్నితమైన స్పందన. క్షమించడంలో మొదటి వ్యక్తిగా ఉండటం. సమయం, కనికరము మరియు చిత్తశుద్ధి అనే బహుమతులను ఇవ్వడం. సాధారణంగా, మనల్ని మనం యిచ్చుకోవచ్చు మరియు అలా చేయడం ద్వారా, దేవుని అగాపే ప్రేమను మాదిరిగా చూపించవచ్చు. 1 కొరింథీయులకు 13:4 గుర్తుంచుకోండి– “ప్రేమ దయ చూపించును.”
సాధారణ దయాళుత్వము చూపించడానికి మార్గముల కొరకు ఈ రోజు చూడండి, దాని గురించి సాధారణమైనది ఏమీ లేదని మీరు కనుగొంటారు.
Taken from Charles R. Swindoll, “The Gift for the Person Who Has Everything,” Insights (June 2001): 1-2. Copyright © 2001 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.