జీవితంలో కొన్ని విషయాలు ఖచ్చితంగా విషాదకరమైనవి. కొన్ని వింతయైన మర్మముగా ఉంటాయి. అయితే, చాలా విషయాలు సాఫీగా సరదాగా ఉంటాయి.
నన్ను నవ్వించేదాన్ని చూడకుండా, వినకుండా లేదా చదవకుండా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు. మరి నవ్వు అటువంటి ప్రభావవంతమైన చికిత్స కాబట్టి, దేవుడు ఈ దైవిక ఔషధాన్ని చాలా తరచుగా పంపిణీ చేస్తున్నందుకు నేను కృతజ్ఞుడను.
ఉదాహరణకు, నియమాలు మరియు శాసనాలు వినోదము కలుగజేయటానికి కాదు ఉన్నవి . . . కానీ కొన్నిసార్లు అవి అలా చేస్తాయి. వాటిలో కొన్ని చాలా ఉల్లాసమైనవిగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. కొన్ని ఉదాహరణలు?
- పెన్సిల్వేనియాలోని డాన్విల్లేలో, అంతా తగలబడిపోయే ఒక గంట ముందు ఫైర్ హైడ్రాంట్లను తనిఖీ చేయాలి.
- ప్రాణాంతక ప్రమాదాల్లో చిక్కుకొన్న డ్రైవర్లు వెంటనే ఆగి, వారి పేర్లు మరియు చిరునామాలను దెబ్బతిన్న వారికి ఇవ్వాలని ఓక్లహోమా చట్టం పేర్కొంది.
- ఒంటారియోలోని లేక్‌ఫీల్డ్‌లో పక్షులు పగటిపూట 30 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు పాడటానికి చట్టం అనుమతిస్తుంది.
మతపరమైన విషయాలు కూడా నా నుండి కొన్ని నవ్వులను బయటకు తీసుకురావచ్చు. కొన్ని సంఘాల కట్టడపు వైఖర్లు అసాధారణమైనవిగా, విపరీతమైనవిగా ఉంటాయి! చాలా గంభీరమైన సమావేశంలో నన్ను నేను కనుగొన్నప్పుడు ఏమి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . . . నిశ్శబ్ద చిరునవ్వు అపవాదు తరంగాలను సృష్టించగలదని నేను తెలుసుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు పెదవి కొరుకుతాను.
ఇంకా, మేము బోధకులం బాగా నవ్వించే గొప్పవాళ్ళం. నేను పూర్వపు ప్రసంగీకుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు, వారిలో చాలామంది క్రూరమైన, వెర్రి స్వభావములు గలవారని తెలుసుకుని నవ్వుకున్నాను.
లేఖనములో నేను నవ్వించే పదార్థాన్ని కూడా కనుగొన్నాను. చాలా సన్నివేశాలు చలోక్తులు విసురుతాయి! దేవుడు ప్రణాళిక వేసినట్లు తప్పక జరుగుతుంది. ఆయన స్తబ్ధముగా, జీవంలేని, ఆసక్తిలేని గ్రంథమును ఎన్నడూ రచించడు. ఆయనే సొలొమోనును వ్రాయడానికి నడిపించెనని మీకు గుర్తుకు వస్తుంది:
సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. (సామెతలు 17:22)
నా జీవితకాలంలో ఎండిపోయిన ఎముకలతో చాలా నలిగిన ఆత్మల చుట్టూ ఉన్నాను గనుక దీనికి నేను హృదయపూర్వకంగా “ఆమేన్!” అని అరుస్తాను.
మనము కామిక్స్ చదవాలని, బుద్ధిలేని సందర్భోచిత కామెడీలను చూడాలని లేదా ఒకరికొకరు చాలా వెర్రి జోకులు చెప్పుకోవాలని నా అభ్యర్ధన కాదు. అది బాహ్యమైనది, బూటకమైనది, మరియు నిస్సారమైనది. సార్వభౌముడైన ప్రభువుపై మన విశ్వాసం పెరిగేకొద్దీ మనం మరింత సంతోషంగా, జీవితాన్ని మరింతగా ఆనందించాలని నేను సూచిస్తున్నాను. చివరకు, ఆయన మనం ఆనందించడానికి హాస్యం మరియు ఆయన బహుమానంలో మనం ఆనందం పొందినప్పుడు నిజమైన చిరునవ్వులు మనకు ఇచ్చారు.
తీవ్రతకు మరియు చింతకు లొంగిపోకుండా మనం సంతోషంగా ఉందాము. విశ్రాంతి పొందుకొని, సంతోషంగా ఉన్న హృదయంలోనుండి నిజమైన సంతుష్ట ముఖం ప్రకాశిస్తుంది.
జీవితంలో కొన్ని విషయాలు ఖచ్చితంగా విషాదకరమైనవే, దాని గురించి వేరే ప్రశ్నే లేదు. కానీ సంతోషంలేని క్రైస్తవుడు. . . ఇది హాస్యాస్పదంగా ఉంది!
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,
మరల చెప్పుదును ఆనందించుడి. (ఫిలిప్పీయులకు 4:4)
Taken from Charles R. Swindoll, “A Joyful Heart . . . It’s Good Medicine!” Insights (March 2001): 1-2. Copyright © 2001, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.