ఇది ఫిబ్రవరి. మేఘావృతమైన, చల్లనైన, నిరానందకరమైన మరియు నీరసమైన ఫిబ్రవరి. మీరు స్కీయింగ్, మంచు మీద స్కేటింగ్ లేదా వర్షంలో పాడటం చేయకపోతే, మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు బయట పెద్దగా ఏమీ లేనట్లే. ఖచ్చితంగా దేవుని దయ ఉండటం వల్లనే ఇది ఇరవై ఎనిమిది . . . సరే, కొన్నిసార్లు ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే కొనసాగుతుంది. సంవత్సరంలో ఈ సమయంలోనే ఎలుగుబంటులు నిద్రాణ స్థితిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు-సోమవారం రాత్రి ఫుట్‌బాల్ కూడా లేదు!
అయితే వేచి ఉండండి. ఫిబ్రవరి గురించి అదనపు ప్రత్యేకత ఉంది. ప్రేమికుల రోజు. ప్రేమగుర్తులు మరియు పువ్వులు. ప్రియమైన విందులు. మానవ హృదయంలో ప్రేమ గుర్తు యొక్క ఆకారంలో ఉన్న శూన్యత ఇప్పటికీ ఉందనేది నూతనమైన మరియు అవసరమైన జ్ఞాపకం, ఆంగ్ల భాషలోని మూడు అద్భుతమైన పదాలు మాత్రమే ఈ శూన్యతను నింపగలవు.
అలాంటి అంశాలు కేవలం మనోభావాలు అని ఒక్క క్షణం కూడా అనుకోకండి. స్మైలీ బ్లాంటన్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం తన పుస్తకంలో పొందుపరచినట్లుగా, జీవితానికి మూలం ప్రేమించడం లేదా నశించడం:
- ప్రేమ లేకుండా, ఆశలు నశిస్తాయి.
- ప్రేమ లేకుండా, కలలు మరియు సృజనాత్మకత నశిస్తాయి.
- ప్రేమ లేకుండా, కుటుంబాలు మరియు సంఘాలు నశిస్తాయి.
- ప్రేమ లేకుండా, స్నేహములు నశిస్తాయి.
- ప్రేమ లేకుండా, శృంగారం యొక్క సాన్నిహిత్యం నశిస్తుంది.
- ప్రేమ లేకుండా, జీవించాలనే కోరిక నశించిపోతుంది.
- ప్రేమించటం మరియు ప్రేమించబడటం మన ఉనికి యొక్క మూలం.
ప్రేమించటం మరియు ప్రేమించబడటం మన ఉనికి యొక్క గట్టి పునాది. కానీ ప్రేమ కూడా మృదువుగా ఉండాలి, అలాగే రూపాంతరీకరించుకోవాలి. కఠినమైన ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఇది మరుగుచేయబడిన నేర్పరితనము. అంటే, నిరాశచెందినప్పుడు పేలిపోయే షరతులతో కూడిన టైమ్ బాంబ్ వంటిది ఈ కఠినమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఇష్టపూర్వకంగా వేచి ఉంటుంది! ఇది ముందుకు త్రోయదు, అలాగే ఎక్కువ ఆశించదు. దీనికి పరిమితులు ఉన్నప్పటికీ, దీని సరిహద్దులు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఇది గట్టిగా పట్టుకోదు, అంటుకొనియుండదు. నిజమైన ప్రేమ ముందుచూపులేనిదికాదు, స్వార్థం లేదు, స్పందించనిది కాదు. ఇది వేరే వ్యక్తి అవసరాలను గుర్తించి, చెప్పబడకుండానే ఆ వ్యక్తి కొరకు ఉత్తమమైనది చేస్తుంది.
ఈ విషయంపై ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప గ్రంథంలో మనం చదివినప్పుడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును . . . నమ్మును . . . నిరీక్షించును . . . ఓర్చును” (1 కొరింథీ. 13:4–7).
నేను ఈ రోజు స్నేహితుడికి వ్రాస్తున్నానా? మీ స్నేహంలో ప్రేమ ఒక బలమైన శక్తిగా ఉన్నదా. . . లేదా అసూయ, అహంకారం లేదా బహుశా మీ యిద్దరి మధ్య చీలికను తీసుకువచ్చే నిగూఢమైన పోటీతత్వం నడుస్తున్నదా? గుర్తుంచుకోండి, ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు.
నా మాటలు భర్త లేదా భార్య చేత చదువబడుచున్నాయా? మీరు ఆమెను లేదా అతనిని ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారో మీ చెలికత్తెకు లేదా చెలికానికి తెలుసా? మీరు ఆమెకు చెబుతారా. . . ఆమెకు చూపిస్తారా? ఇటీవల అతనికి ప్రేమలేఖను వదిలిపెట్టారా? క్రొవ్వొత్తుల వెలుగులో భోజనం ఎలా ఉంటుంది? “నేను చేస్తున్నాను” అని మీరు ఎప్పుడు చెప్పారో గుర్తుందా? మరో రెండు పదాలను వీటికి జోడించే నెల ఇది: “నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”
ఆ సరళమైన చిన్న పదాలు-మనం చెప్పడం చాలా సులభంగా మరచిపోతాము. మన భావాలు ఏమిటో ఇతరులకు తెలుసని మనము అనుకుంటాము, గనుక మనము వెనక్కి తగ్గుతాము. విచిత్రమేమిటంటే, మనం పెద్దవారమవుతున్నప్పుడు, ఆ మూడు శక్తివంతమైన పదాల విలువను గతంలో కంటే ఎక్కువగా గ్రహించినప్పుడు, మనము వాటిని మరింత తక్కువగా ఉచ్చరిస్తాము!
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” సరళమైన, ఒత్తక్షరములుగల పదాలు, అయినప్పటికీ వాటిని మెరుగుపరచడం సాధ్యం కాదు. ఏదీ వీటి దగ్గరకు రాదు. అవి “మీరు గొప్పవారు” కంటే మెరుగ్గా ఉన్నాయి. “పుట్టినరోజు శుభాకాంక్షలు!” లేదా “అభినందనలు!” లేదా “మీరు ప్రత్యేకమైనవారు” కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాగే మనం ఒకరికొకరము ఎల్లప్పుడూ ఉంటామనే హామీ ఇవ్వలేము గనుక, వీలైనంత తరచుగా వాటిని చెప్పడం మంచిది.
ఇది ఫిబ్రవరి. మేఘావృతమైన, చల్లనైన, నిరానందకరమైన మరియు నీరసమైన ఫిబ్రవరి. కానీ మీరు ప్రేమను జోడించినప్పుడు, దాని గురించి నెల మొత్తం ఒక మెరుపును సేకరిస్తుంది. కాబట్టి – ప్రేమించండి!
Adapted from Charles R. Swindoll, “A Month for Love,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 58–59. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.1 C