శిల్పిని సంప్రదిద్దాం

వివాహం కొరకు దేవుని ప్రణాళిక అనేది ఇప్పటివరకు రూపొందించిన అత్యంత అందమైన నమూనా చిత్రాల్లో ఒకటి. లోకంలో ఎటువంటి పాపం లేకముందే ఏర్పరచబడిన వివాహం, సంబంధాల విషయమై దేవుని పరిపూర్ణ రూపకల్పనను వివరిస్తుంది.

వివాహం అని పిలువబడే ఈ అద్భుతమైన ఏర్పాటులో జీవించడానికి మూడు మార్గాల కోసం శిల్పిని సంప్రదించుదాం. సామెతలు 24: 3-4 ను మూల వాక్యముగా మనం ఉపయోగిస్తాము:

జ్ఞానమువలన ఇల్లు కట్టబడును
వివేచనవలన అది స్థిరపరచబడును.
తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ
సంపదలతో నింపబడును.

వివాహం కొరకు దేవుని నమూనా చాలా సరళమైనది: జ్ఞానము, వివేచన మరియు తెలివి.

“జ్ఞానమువలన ఇల్లు కట్టబడును . . .”

మొదట, మనం పునాది వేద్దాం. నిర్మించిన అనే పదం హెబ్రీ పదం నుండి వచ్చింది, దీని అర్థం “పునరుద్ధరించడం.” ఆదాము రొమ్ము నుండి ప్రక్కటెముక తీసుకొని దానిని స్త్రీగా పునర్నిర్మించినప్పుడు దేవుడు ఉపయోగించినది ఇదే పదం. ఈ రకమైన ఇంటిని నిర్మించటానికి జ్ఞానము అవసరమని దేవుడు చెబుతున్నాడు. ఆవశ్యముగా, జ్ఞానము అంటే “సూక్ష్మ పరిశీలన.” ఇది ఒక విషయము యొక్క అతిముఖ్యమైన నిజాలను తెలుసుకోవాలనే ఆలోచన కలిగియుండటమే. స్వల్పమైన వివరాల కంటే అతిముఖ్యమైన విషయాలను చూడటానికి మీరు ఇష్టపడిన్నప్పుడు, మీరు బలమైన పునాదిని నిర్మిస్తారు.

“వివేచనవలన యిల్లు స్థిరపరచబడును . . .”

హెబ్రీ భాషలో స్థాపించబడింది అంటే చిందరవందరగా ఉన్నదాన్ని క్రమంలో ఉంచడం లేదా పడిపోయినదాన్ని నిటారుగా నిలబెట్టడం. జ్ఞానమనగా సూక్ష్మ పరిశీలనతో చూడటమైతే, మీరు పరిజ్ఞానముతో చూసేదానికి ప్రతిస్పందించడమే ఈ రెండవ భాగం. మీరు అది ఎలా చేయగలరు? వివేచనతో.

మరో మాటలో చెప్పాలంటే, నాకు సాధారణంగా మనస్సు నొప్పించు చిరాకును నేను ఇక వ్యక్తిగతంగా తీసుకోను. నాకు జ్ఞానము మరియు వివేచన ఉంటే నా ప్రణాళికను భేదించే సంఘర్షణ నన్ను చికాకు పెట్టదు. ఈ సమయంలో నాకు ఏది మంచిదో లేక ఏది అవసరమో అని దేవుడు చూచునట్లుగా నేను చూస్తాను.

“తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును . . .”

తెలివి ఇక్కడ “అవగాహన”ని సూచిస్తుంది. ఇది అభ్యాసంతో వచ్చే సానుభూతిని కలిగి ఉంటుంది. నేను నా భార్య విషయమైన తెలివిలో ఎదిగేకొద్దీ, ఆమె పట్ల నాకున్న అవగాహన పెరుగుతుంది. నేను నా చర్యలతో చెబుతాను: నేను వింటున్నాను. నేను నేర్చుకుంటున్నాను. నాకు దాపరికం లేదు. తెలివి, ఇది జ్ఞానము మరియు వివేచనతో కలిసినప్పుడు, మీ గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడునని సామెతలు చెబుతున్నది. దాని అర్థం ఏమిటి? మంటలు చెలరేగినను కాలనటువంటి వాటితో మీ సంబంధం నింపబడి ఉంటుందని దీని అర్థం.

మనిషి దానిని వేరే విధంగా మార్చాడు! “మనకు కావలసిందల్లా, ప్రియురాలా, మరిన్ని వస్తువులు” అని ఆలోచిస్తూ చాలా మంది మైమరచిపోతున్నారు. అయితే మన గదులు దేవుని సంపద లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు దురవస్థ పెరుగుతుంది. దేవుడు ఇలా అంటాడు, “జ్ఞానము ద్వారా దాన్ని పునరుద్ధరించవచ్చు. వివేచన ద్వారా దాన్ని సరి చేయవచ్చు. తెలివి ద్వారా ఆ గదులు ఎప్పటికీ కాలనటువంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు.”

ఇప్పుడు, “ప్రియురాలా, నువ్వు ఎలా మారాలో ఇక్కడ ఉన్నది చదువు” అనే సూచనలతో మీరు ఈ వ్యాసాన్ని మీ జీవిత భాగస్వామికి పంపే ముందు, మీ వివాహాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాల్సిన స్థలం మీరేనని గుర్తుంచుకోండి. ఎవరైనా జ్ఞానము, వివేచన మరియు తెలివి కలిగి ఉంటే, లేదా ఆ దిశగా పనిచేస్తుంటే, ఎవరైనా చాలా క్లిష్ట పరిస్థితులలో సంతోషించగలరని నేను కనుగొన్నాను. కానీ సంతోషకరమైన ఇంటికి అవసరమైన వసతులూ, అలాగే పరిపూర్ణమైన అవకాశమూ కలిగి ఉన్న వ్యక్తులను కూడా నేను కనుగొన్నాను. కాని జ్ఞానము, తెలివి మరియు వివేచన లేక వారు దయనీయంగా ఉన్నారు. ఇది ఆశ్చర్యమైనది. మీ చెలికత్తె లేదా చెలికాని పట్ల జ్ఞానము, తెలివి మరియు వివేచన కలిగిన హృదయాన్ని మీలో నిర్మించమని శిల్పిని అడగండి.

Adapted from Charles R. Swindoll, “Let’s Consult the Architect,” Insights (Feb. 2000):1-2 Copyright © 2000. Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Marriage-Telugu, Women-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.