1 కొరింథీయులకు 13: 5 లో, పౌలు రెండు వ్యతిరేకార్థక వర్ణనలను ఉపయోగిస్తాడు- “త్వరగా కోపపడదు” మరియు “అపకారమును మనస్సులో ఉంచుకొనదు.” మరో మాటలో చెప్పాలంటే, నిజమైన ప్రేమ దుర్బలమైనది కాదు. అగాపే ఒక సంబంధానికి ఎంతో దయను పూస్తుంది; ఇది అవతలి వ్యక్తికి పొరపాట్లు చేయడానికి చాలా అవకాశాన్ని విడిచిపెడుతుంది. మరియు మీరు జీవితకాలంలో ఎక్కువ కాలం ఎవరితోనైనా నివసిస్తున్నప్పుడు, పట్టించుకోకుండా ఉండటానికి చాలా ఉంటాయి.
తమ సఖులతో నిరంతరం చిరాకు పడే స్త్రీపురుషులను నేను చూశాను. ఒక చిన్న లోపం-వంకర చూపు, తప్పుడు మాటలు, సాధారణ ఏమరుపాటు-రోజంతా చిన్న వైరారోహములకు కారణమవుతాయి. చిరాకు వలన వచ్చే ఈ చిన్న ప్రకోపాలు ఖచ్చితంగా తప్పుల యొక్క సుదీర్ఘ జాబితాను దగ్గరగా ఉంచుకోవడం వల్ల కలిగే ఫలితం. మానసికంగా చెడు పనుల యొక్క ఖాతాను మనస్సులో ఉంచుకోకూడదని హెచ్చరించడానికి పౌలు ఉంచుకొనదు అనే పదాన్ని ఉపయోగించాడు. మనము అలా చేసినప్పుడు, మనము ఓడిపోతాము.
నిజం ఏమిటంటే, మనం ఏదైనా వ్రాయకుండానే లేదా గ్రహించకుండానే జాబితాను ఉంచుకోవచ్చు. చిన్న కారణాలతో మాత్రమే మీ చెలికాడు లేదా చెలికత్తె మీకు చిరాకు తెప్పిస్తున్నట్లు ఒప్పుకోవలసివస్తే, మీ ఖాతాపుస్తకంలో అతనికి లేదా ఆమెకి మీమీద కోపం ఉండటానికే బాగా అవకాశాలు ఉన్నాయి. అయితే మీ కోపాన్ని తగిన విధంగా మరియు తక్షణమే తెలియపరచండి, లేదా వదిలేయండి.
Adapted from Charles R. Swindoll, Marriage: From Surviving to Thriving (Nashville: W Publishing Group, 2006), 116–18. Copyright © 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.