“హృదయం సరిగ్గా ఉన్నప్పుడు, పాదాలు వేగంగా ఉంటాయి.”
చాలా సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ యొక్క మూడవ ప్రెసిడెంట్ థామస్ జెఫెర్సన్ చెప్పిన మాట ఇది. అదే విషయాన్ని అనేక రకాలుగా చెప్పొచ్చు. సంతోషకరమైన స్ఫూర్తితో ఇచ్చేవారు బలవంతముగా ఇవ్వరు. సానుకూల దృక్పథం త్యాగాన్ని ఆనందంగా తయారుచేస్తుంది. నైతికత ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రేరేపణ బలంగా ఉంటుంది. లోపల ఆనందం ఉన్నప్పుడు, ఏ సవాలు కూడా గొప్పగా అనిపించదు. ఉత్సాహం యొక్క గ్రీజు దాతృత్వం యొక్క గేర్లను వదులుగా చేస్తుంది.
మరియు అలాంటి స్ఫూర్పి ఎంత అంటువ్యాధిగా మారుతుందో మీరు గమనించారా? మనం అనుకూల స్థితిలో ఉండటమే కాదు, ఇతరులు కూడా అలాగే ఉంటారు. మరియు మనం ఆ శక్తితో చుట్టుకోబడినప్పుడు, సంకల్పం యొక్క తాజా ఉప్పెన మన మీదుగా పొర్లిపారుతుంది. మీరు దానిని ఆపలేరు!
సర్ విన్‌స్టన్ చర్చిల్ చేసిన అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాల సంకలనమైన గ్రేట్ వార్ స్పీచ్‌లు అనే పేరుతో ఒక చిన్న పుస్తకమును నాకు సన్నిహిత మిత్రుడు అందించాడు. నేను ఇప్పటికే వాటిలో చాలా ప్రసంగాలను చదివాను, కానీ గత కొన్ని రోజులుగా మళ్లీ చదవడం వల్ల, నేను మరోసారి ఉత్తేజితమయ్యాను . . . మరింత మెరుగ్గా పని చేయడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మరియు నన్నునేను ఎక్కువగా సమర్పించుకోవడానికి ప్రోత్సహించబడ్డాను. మా కాలం గురించి చర్చిల్ చెప్పిన మాటలు నన్ను కదిలించకుండా ఉండలేవు. శాశ్వతం ఉండిపోయే ఎంతటి గొప్ప వాక్చాతుర్యం! సాహసోపేతమైన యోధులను గూర్చి వివరిస్తూ, అతను ఇలా వ్రాశాడు:
ప్రతి ఉదయం ఒక ఉదాత్తమైన మార్పును తీసుకొస్తుంది
మరియు ప్రతి మార్పు ఒక ఘనమైన వీరుణ్ణి ముందుకు తెస్తుంది.1
అరౌనా రాజుకు తన పొలానికి వెల యివ్వకుండానే తీసుకోమన్నప్పుడు దావీదు పలికిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. “నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” (2 సమూయేలు 24:24). దావీదు దాన్ని ఉచితంగా తీసుకోవడానికి నిరాకరించాడు.
దివంగత గొప్ప బోధకుడు జాన్ హెన్రీ జోవెట్ దావీదు మాటల నుండి రూపొందించిన అనువర్తనం నాకు చాలా ఇష్టం: “ఏమీ కష్టపడని పరిచర్య, ఏమీ సాధించదు.” చాలా కాలంగా పరిస్థితులు మారాలని దేవుని ప్రజలు కలలు కంటూ నిష్క్రియంగా ఉన్నారు. ఇది పనిచేయడానికి సమయం. ఇది పరిస్థితులను మార్చడానికి సమయం. అలాగే మనము అది చేస్తున్నప్పుడు, మనం సంతోషంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. ఉత్సాహంతో చేద్దాం!
2 కొరింథీయుల పత్రికలో పౌలు ఇవ్వటం గూర్చిన ప్రకటనను మీరు గుర్తుచేసుకోగలరా?
ఆనందాన్ని ఇవ్వడమనే దానితో అనుసంధానించిన ఈ ప్రకటన లేఖనములో మూల వచనం అయ్యుండవచ్చు. “సణుగుకొనకయు (అంటే “అనిష్టంగా”) బలవంతముగా కాకయు (“ఇతరులు ఏమనుకుంటారోననే ఒత్తిడి కారణంగా”) ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” ( 2 కొరింథీయులకు 9:7). ఉత్సాహం అనే పదం హిలారోస్ (hilaros) అనే గ్రీకు పదం నుండి వచ్చింది, దీని నుండి హిల్లేరియస్ (hilarious) అనే పదం వచ్చింది. అలాగే ఆదిమ గ్రీకు భాషలోని ఈ వాక్యంలో ఉత్సాహము (hilaros) అనే పదం ప్రాధాన్యత కోసం వాక్యంలో మొదటి పదంగా వ్రాయబడింది. అస్సలు చెప్పాలంటే, “ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును.” ఎందుకు? ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేవారు వేగవంతమైన పాదాలను కలిగి ఉంటారు. వారు ఆనందంతో ఇస్తారు!
- అరణ్యంలో గుడారాన్ని నిర్మించడానికి ఇశ్రాయేలీయులు తమ్మునుతాము అలాగే తమ వస్తువులను ఇచ్చినప్పుడు, ఇంకేమీ ఇవ్వొద్దు అని చెప్పించుకునే విధంగా వారి ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపించింది (నిర్గమకాండము 36:6-7).
- యెరూషలేములోని ప్రజలు నెహెమ్యా చుట్టూ గుమిగూడి ఆ గోడను పునర్నిర్మించినప్పుడు, వారి ఉత్సాహం రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది (నెహెమ్యా 2:17-18; 4:6; 6:15-16).
- యేసు తన అనుచరులను నిస్వార్థంగా ఉండమని సవాలు చేసినప్పుడు, శాశ్వతమైన వాటిల్లో మన ఆర్థిక పెట్టుబడులతో ఆనందాన్ని అనుసంధానిస్తూ “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని బోధించాడు (అపొస్తలుల కార్యములు 20:35).
ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా? దాతృత్వం యొక్క రౌండ్ టేబుల్ వద్ద “ఉదాత్తమైన యోధుడు” అవ్వాలనుకుంటున్నారా? నాలుగు సాధారణ సూచనలను నన్ను మీకు గుర్తు చేయనివ్వండి. అవి నాకు పని చేసాయి.
1. దేవుడు మీకు ఇచ్చిన వరములను గురించి ఆలోచించండి. ఆయన మంచివాడు కాదా? మన అర్హతకు మించి అనుగ్రహించాడు. తగినంత ఆహారం, దుస్తులు మరియు సురక్షితమైన ఆశ్రయాలు. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన కుటుంబాలు మరియు సన్నిహిత స్నేహితుల మరిన్ని ఆశీర్వాదాలు. . . ఇంకా అనేకమైనవి.
2. దాతృత్వానికి సంబంధించి ఆయన చేసిన వాగ్దానాలను మీరు గుర్తు చేసుకోండి. సమృద్ధిగా విత్తడం వల్ల కలిగే ప్రయోజనాలను వాగ్దానం చేసే కొన్ని బైబిల్ సూత్రాలను గుర్తుచేసుకోండి. విస్తారమైన పంటలు, మర్చిపోవద్దు, అవి దేవుని ప్రత్యేకత.
3. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మీరు తప్ప ఎవరూ దీన్ని చేయలేరు. ఆ వ్యక్తిగత పైకప్పును తెరిచి, అనేక కఠినమైన ప్రశ్నలను అడగండి:
- నా ఆదాయానికి తగ్గట్టుగా నేను ఇస్తున్నానా?
- నేను అపరాధభావంతో ప్రేరేపించబడుతున్నానా? . . . లేదా అందరినీ అంటుకునే ఆనందముచేత ప్రేరేపించబడుతున్నానా?
- దేవుని పనికి నేను ఇచ్చే స్థాయి వేరొకరికి తెలిస్తే, నన్ను అనుసరించునట్లుగా నేను ఒక మాదిరిగా ఉన్నానా?
- నేను ఇవ్వడం గురించి ప్రార్థించానా . . . లేదా నేను కేవలం ఉద్వేగభరితమైన ప్రతిస్పందన ఇచ్చానా?
4. స్థిరమైన దాతృత్వాన్ని ఘనపరచటానికి దేవుణ్ణి విశ్వసించండి. ఇక్కడే అవసరమైన పెద్ద అడుగు ఉంది. సాయశక్తులా ప్రయత్నించి సాధించండి! దేవుడు మిమ్మల్ని గణనీయమైన సహకారం అందించడానికి నడిపిస్తున్నాడని మీరు నిజంగా విశ్వసించినప్పుడు-బిగబట్టడం మానివేసి దాతృత్వం యొక్క అలవాటును పెంపొందించుకోండి. దాతృత్వం ఎప్పుడూ ప్రజలను బాధపెట్టదు!
ఇన్‌సైట్ ఫర్ లివింగ్‌లో, దృఢమైన బైబిల్ బోధనను అందించడం కొనసాగించడానికి మాకు ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. మా ఆత్మలు సంతోషంగా ఉన్నప్పుడు . . . మా మనోబలం ఉన్నతంగా ఉన్నప్పుడు . . . ఈ బాధ్యతలు సాధించవచ్చు. ఈ సంవత్సరం మా ఆల్ టైమ్ బెస్ట్ గా ఉండాలని దయచేసి ప్రార్థించండి. మీరు ఇంతకు ముందెన్నడూ ఇవ్వనటువంటి త్యాగపూరిత స్వభావంతో కూడిన అద్భుతమైన సమర్పణతో, పాతకాలపు గొప్ప యోధుల వలె ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు.
మన హృదయాలు సరిగ్గా ఉంటే, మన పాదాలు వేగంగా ఉంటాయి. మరియు మన పాదాలు వేగంగా ఉంటే, మనము మన బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడమేకాక, మనము వాటిని దాటి వెళ్తాము! ఏమీ కష్టపడని పరిచర్య, గుర్తుంచుకోండి, ఏమీ సాధించదు.
- Sir Winston Churchill, “A Colossal Military Disaster,” a speech to the House of Commons, June 4, 1940, Great War Speeches (London: Corgi Books, a division of Transworld Publishers Ltd., 1957), 22.
Copyright © 2011 by Charles R. Swindoll, Inc.