దాదాపుగా ఎప్పుడూ, అదే సమాధానం. “మీ ఆట ఎలా సాగింది?” అని నేను అడిగేవాడిని. “మంచిగా సాగింది,” అని వాడు జవాబిచ్చేవాడు. “నువ్వు ఎలా ఆడావు?” . . . “మంచిగా ఆడాను.”
ప్రతిస్పందన సంక్షిప్తంగా లేదు, లేక అదేమీ వల్లించి చేసిన ప్రతిక్రియ కాదు. ఇది నిజాయితీగా, అలాగే దాదాపుగా ఎల్లప్పుడూ ఉత్సాహంతోనే వచ్చేది. . . . ఒక పరుగు తీసినా లేక వంద పరుగులు తీసినా అది అంత ముఖ్యం కాదు. వాడు విన్నింగ్ రన్ కొట్టాడా లేదా బ్యాటింగ్‌లో ప్రతిసారీ వాడు ఔట్ అయ్యాడా అనేది ముఖ్యం కాదు. క్రీడలు, లేదా పాఠశాల, లేదా కుటుంబం లేదా మరే విషయమైనా ముఖ్యం కాదు.
“ఎలా ఉన్నావు?” . . . “మంచిగా ఉన్నాను.”
ఒక చిన్నపిల్లవానిగా వాడు ఎంతో గొప్ప దృష్టి కలిగియున్నాడు. . . . మిగిలిన జీవితమంతా ఆటలే అన్నట్లుగా ఉండేవాడు. పాల్గొనడమే గొప్ప విలువ. . . . గస్ పాల్గొనడంలోనే ఆనందాన్ని పొందాడు.
ఇది కేవలం క్రీడలు విషయంలోనే కాదు. ఇది పాఠశాలలో గాయక బృందం మరియు విద్యార్థి మండలి విషయంలోనూ అంతే. అది వయోలిన్ పాఠాల విషయంలోనూ అంతే. అది స్నేహితుని ఇంట్లో పుట్టినరోజు వేడుకలోనూ అంతే. . . . ప్రతి రోజు ఒక క్రొత్త రోజు, ఒక క్రొత్త అనుభవం కోసం సమయం. జీవితం బాగుండేది.
కానీ గత ఆదివారం కొలరాడోలోని సిల్వర్ ప్లూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సానుకూలంగా మరియు ఎటువంటి ఫిర్యాదు లేని మరియు లీనమైపోయిన చిన్న పిల్లవాడి జీవితం ముగిసింది.
చాలా పనులు చేయకుండానే ఆగిపోయాయి. మేము ఇంకా ఈ సంవత్సరం జూనియర్ జెఫిర్స్ కార్డ్‌లను పొందడానికి వెళ్లలేదు. కొలరాడోలోని ఎరీలో డర్ట్-ట్రాక్ రేసులను చూడటానికి మేము ఉత్తరం వైపుకు వెళ్లలేదు. . . . మేము ఏమి చేసామంటే, పది సంవత్సరాల పాటు చెప్పుకుంటూ ఉన్నాము. మేము కలిసివున్న ప్రతి రాత్రిని ఒకే పదాలతో ముగించాము: “నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”
దయచేసి మరొక్కసారి చెప్పనివ్వండి. “గస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”
-టాడ్ ఫిపర్స్, ది డెన్వర్ పోస్ట్
మూడు చిన్న పదాలు. వాటిని చెప్పడం చాలా కష్టం గనుక, మనం చాలా తేలికగా మరచిపోతాం గనుక, మనం ఆచరణలో పెట్టాలి. ఈ రాత్రి గస్‌తో ఈ మాట చెప్పడానికి టాడ్ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు.
Adapted from Charles R. Swindoll, “Week 3 Weekend: Think It Over,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 45. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.