కోలాహలం మనల్ని ఆత్మ యొక్క స్వరం వినబడకుండా చేస్తుంది, అయితే దేవుడు తరచుగా నిశ్శబ్దంలోనుండే మాట్లాడతాడు. ఇటీవల ఒక అరుదైన సమయంలో, నా ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కాబట్టి నేను కూర్చుని నేను ఉన్న గదిని జాగ్రత్తగా గమనించాను, అప్పుడు అనేకమైన భావోద్వేగాలు నా ఆత్మలో వెల్లువలా పారాయి.
నా కుమార్తె ఐపాడ్, నెట్‌బుక్ మరియు జాకెట్‌తో పాటు ఆమె కాన్వాస్‌పై ఆర్ట్ సామాగ్రి ఉంది. నేను మా గతం గురించి ఆలోచించాను మరియు నేను ఆమెకు తగినంత దయ చూపించలేదని గ్రహించాను. నన్ను క్షమించమని ఆమెను అడగవలసిన అవసరం ఉందని నేను అనుకున్నాను. కుక్కలకు ఆహారం ఇవ్వడం మరియు వాటిని శుభ్రపరిచే బాధ్యత అతనిదే కాబట్టి నా పెద్ద కొడుకు బూట్లు వెనుక తలుపు దగ్గర ఉన్నాయి. నేను అతని “బాధ్యత”పై దృష్టి కేంద్రీకరించాను, కానీ నేను అతనిని మెచ్చుకుంటున్నానని అతనికి చెప్పి చాలాకాలం అయ్యింది. నేను నా భర్త లంచ్ బ్యాగ్‌ని చూశాను మరియు అది అతని స్థిరమైన పని మరియు సంపాదనను నాకు గుర్తు చేసింది. నా చిన్న కొడుకు చిరిగిన సామాను సంచిని వీపున తగిలించుకోవటం నేను గమనించాను, అతను వైకల్యంతో ఉన్నప్పటికీ-ఇతరులు సాధారణంగా చేయగలిగేది చేయడానికి ఎంత కష్టపడుచున్నాడో అది సూచిస్తుంది. చివరగా, మేమిద్దరం ఆనందించే సంగీతంతో అతను నా ప్రపంచంలోకి ఎలా ప్రవేశిస్తాడో నా సవతి కొడుకు యొక్క ఐపాడ్ నాకు గుర్తు చేస్తుంది.
కృప, క్షమాపణ, ప్రేమ, రూఢిపరచుట, సాత్వికము, దయ మరియు కరుణ అనే వాటిని కొనసాగించమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడని గుర్తించలేకపోయాను గనుక నేను తప్పుచేసినట్లుగా భావించాను. ఈ మధ్య నేను విన్న పాట నాతో మాట్లాడినట్లు నాకు గుర్తుకు వచ్చింది. మీరు ఒక నిశ్శబ్ద ప్రదేశాన్ని కనుగొని, ఇతరులలో మీరు వెతుకుతున్న వాటిని మరియు ఆశించే వాటిని ప్రతిబింబించమని నేను అడుగుతున్నాను.
‘ఎందుకంటే మనలోని చెత్తవాళ్ళలో చాలా మంచి ఉంది
మనలోని ఉత్తములలో చాలా చెడు ఉంది
ఇది మనలో ఎవరికీ ఎప్పుడూ అర్థం కాదు
మిగిలిన వారిని విమర్శించడానికి
మనం వెతుకుతున్న దాన్ని మాత్రమే కనుగొంటాము
మనము దానిని అలాగే ఇంకా ఎంతో కనుగొంటాము.1
ప్రభువా, కృప మరియు సత్యంపై దృష్టి పెట్టాలని మాకు గుర్తు చేసే మీ దయ మరియు మీ కరుణగల నమ్మకాలకుగాను మీకు కృతజ్ఞతలు. నిశ్శబ్ద క్షణాలను కోరుకునేవారముగా మారి, మా జీవితాలను మీరు మలచడానికి మరియు మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతించువారముగా మేముందుముగాక. మీ మార్గములను అనుసరించునట్లు నాకు గుర్తు చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. క్రీస్తు నామంలో మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.
- Amy Grant, “Find What You’re Looking For,” in Somewhere Down the Road (Brentwood, Tenn.: Sparrow Records, 2010)