కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి
మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి.
—సామెతలు 4:1
నాన్న, మీరు మీ పనిలో లేదా ఇంటి నుండి దూరంగా ఉండే ప్రాజెక్ట్‌లో లేదా అభిరుచిలో ఎక్కువగా నిమగ్నమై ఉండి, మీ కుటుంబంతో మీరు గడపాల్సిన సమయం మరియు శక్తి హరించుకుపోయే అవకాశం ఉన్నదా? నేను అర్థం చేసుకున్నాను, నన్ను నమ్మండి, నాకు తెలుసు. . . .
తండ్రులు తమ సమయాన్ని మరియు ప్రయాసని ఇతరులకు సహాయం చేయటానికి బదులు, పెరిగిన తమ జీతాల ద్వారా–మెరుగైన విద్య, క్లబ్‌లో సభ్యత్వం, వస్తుపరమైన ఆస్తులు, మంచి ఇళ్లు, అదనపు కార్లు వంటి కొనుగోలు చేయగల వస్తువులను ఇవ్వమని మన సామాజిక వ్యవస్థ వారిని ప్రోత్సహిస్తుంది. . . . కానీ తండ్రి సంగతి ఏమిటి? అలాగే ఆయన సమక్షంలో నేర్చుకున్న ఆ అమూల్యమైన శిష్యరికం సంగతి ఏమిటి? . . . వీటన్నిటి మధ్య అది అంతగా గమనించబడలేదు. . . .
రండి, నాన్నగార్లూ, తిరుగుబాటు ప్రారంభించుదాం! . . . ఇకపై వ్యవస్థ నుండి సూచనలను తీసుకోవడానికి మనం నిరాకరిద్దాం. మనకు అత్యంత అవసరమైన వారి నుండి మనల్ని మరింత దూరం చేసే వాటికి ససేమిరా అని చెప్పడం ప్రారంభిద్దాం. మనం జీవించి ఉన్నప్పుడు మన ఉనికి మరియు ప్రభావం అలాగే మనం చనిపోయిన తర్వాత మన జీవితాల యొక్క అద్భుతమైన జ్ఞాపకం మనం అందించగల గొప్ప భూసంబంధమైన బహుమతులు అని గుర్తుంచుకోండి.
Taken from Charles R. Swindoll, Wisdom for the Way: Wise Words for Busy People (Nashville, Tenn.: J. Countryman, 2001), 191.