మన గతం ఒక చిత్రవస్తు ప్రదర్శనశాల లాంటిది. మన స్మృతి యొక్క ఆ వసారాల్లో నడవడం ఒక చిత్రవస్తు ప్రదర్శనశాల గుండా నడవడం లాంటిది. గోడలపై గత చిత్రాలన్నీ ఉన్నాయి: మన ఇల్లు, మన బాల్యం, మన తల్లిదండ్రులు, మన పెంపకం, హృదయ వేదనలు, కష్టాలు, సంతోషాలు మరియు విజయాలు అలాగే మన జీవితంలో ఎదుర్కొన్న దూషణలు మరియు అసమానతలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు గనుక, మనం ఈనాటి క్రీస్తుని తీసుకొని, ఆయనతో కలిసి మన గతంలోకి వెళ్లవచ్చు మరియు చెడు లేదా ఓడిపోయే జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే చిత్రాలను తీసివేయమని ఆయనను అడుగవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, యేసు తన గతంపై దండెత్తడానికి క్రైస్తవుడు అనుమతించగలడు మరియు బాధతోకూడిన ఆ సంవత్సరములను–అనగా మిడుతలు తినివేసిన ఆ సంవత్సరములను ఎదుర్కోవచ్చు (యోవేలు 2:25-26) మరియు ఆ దృశ్యాలను మన జీవితాల నుండి తీసివేయవచ్చు. అవి నా జీవితంలో ఉన్నాయి. మీ జీవితంలో ఉన్నాయి. ఆనందాన్ని మరియు విజయాన్ని కలిగించే కుడ్యచిత్రాలను వేయడానికి అలాగే నిరాశ మరియు ఓటమిని కలిగించే వాటిని గోడల నుండి తీసివేయడానికి మనం ఆయనను అనుమతించాలి.
Taken from Charles R. Swindoll, Wisdom for the Way: Wise Words for Busy People (Nashville: J. Countryman, 2001), 377. Copyright © 2001, Charles R. Swindoll, Inc. All rights reserved.