నాన్నకు ఒక బహుమతి

సమాన హక్కులు మరియు సమాన సమయం ఉన్న యుగంలో, తండ్రులకు సమాన శ్రద్ధ ఇవ్వడం న్యాయంగానే అనిపిస్తుంది.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల్లో తల్లులు సింహభాగం ప్రశంసలు పొందుతారు. నిజం చెప్పాలంటే, వారు పొందుతున్న ప్రశంసలకు వారు అర్హులు. అయితే చాలాసార్లు, తండ్రులను ఎవరూ పట్టించుకోరు. స్త్రీలారా, ఇక కొంచెంసేపు ప్రక్కకు జరగండి . . . పురుషులకు దారి ఇవ్వండి; నిజానికి, ఈ పురుషులు ప్రత్యేకమైనవారు: తండ్రులు.

కుటుంబాలు సంప్రదాయబద్ధంగా నాన్నలను గౌరవించే ఆ సమయాల్లో-ఆయన పుట్టినరోజు, క్రిస్మస్ లేదా మరేదైనా ప్రత్యేక రోజున, పిల్లలు మరియు జీవిత భాగస్వాముల కళ్ళు మరియు చెవులు ఉత్సాహంగా ఉంటాయి. వారు కొట్లను సందర్శిస్తారు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలను చూస్తారు, వార్తాపత్రిక ప్రకటనలను చూస్తారు మరియు తీక్షణంగా ఇంటర్నెట్‌ను శోధిస్తారు. మమ్మల్ని వస్త్రాలతో చుట్టాలా, ఆహారంతో నింపాలా, స్కిస్‌తో (మంచుపై జారడానికి ఉపయోగించే సాధనం) ఆశ్చర్యపరచాలా, ఏవైనా వస్తువులతో మమ్మల్ని గిలిగింతలు పెట్టాలా, లేక ముద్దులతో ముంచెత్తాలా అని మా కుటుంబాలు ఆశ్చర్యపడేవారు. తండ్రల గురించి నాకు తెలిసినంతవరకు, మీరు ఏమి చేసినా చాలా మంది సిగ్గుపడతారు. పోషించడానికి వారు ఎంతలా అలవాటు పడ్డారంటే, స్వీకరించడం కొంచెం విచిత్రంగా ఉంటుంది. అప్పుడప్పుడు, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది! చాలా మంది తండ్రులు తమ కుటుంబ సభ్యులకు (క్షమించదగిన గర్వంతో) వెంటనే ఇలా చెబుతారు:

“చూడండి, హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోండి . . . ప్రయాసపడటాన్ని మాకు వదిలివేయండి!”

తర్వాత కొన్ని నిమిషాలు, మీ నాన్న గురించి ఆలోచించండి, సరేనా? ఆ ఒక్క వ్యక్తి ఏమి అందించాడో ధ్యానించండి. మీపై ఆయన ప్రభావం, మీపై ఆయన పెట్టుబడి, మీ పట్ల ఆయన సూక్ష్మబుద్ధి గురించి ఆలోచించండి. ఆయన ముఖాన్ని . . . మీ మదిలో ఇప్పుడు చెరగని రేఖలను అధ్యయనం చేయండి. ఆయన స్వరం యొక్క ప్రతిధ్వనిని మళ్ళీ వినండి. . . ఆ మరచిపోలేని నవ్వు . . . అద్భుతమైన జ్ఞాపకశక్తి ద్వారా ఉద్భవించే ప్రత్యేక వ్యక్తీకరణలు. మీ చేయి చుట్టూ ఆయన చేయి ఉన్నట్లు . . . ఆయన బలమైన, సురక్షితమైన చేయి మీ భుజాలపై ఉన్నట్లు ఊహించుకోండి. ఒకప్పుడు సౌమ్యత మరియు సంకల్పం, కరుణ మరియు మగతనం యొక్క సమతుల్య మిశ్రమాన్ని కమ్యూనికేట్ చేసిన ఆయన పట్టును గుర్తుంచుకోండి. . . ఆయన, “నాకు అర్థమైంది,” అని, అలాగే, “ఇప్పుడు, కుదురుగా ఉండు!” ఆయన నడకను గమనించండి. తనలాంటి నడక మరొకటి లేదు కదా? ఆ ఖచ్చితమైన అడుగులు. ఆ అసమానమైన ఠీవి. చేతులు ఊపుతూ వెనుకకు మడచుకొని ఉండటం . . . తల అలా వంచడం.

అన్నింటికంటే ఉత్తమమైనది ఏమిటంటే, ఆయన ఆదర్శప్రాయమైన స్వభావమును గుర్తుకు తెచ్చుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఆ మాట ఏమిటంటే చిత్తశుద్ధి. మీరు దీన్ని చదువుతున్నప్పుడు, కొంచెం ఆగి, మీ గతంలో ఆయన ఒంటరిగా నిలబడినప్పుడు, ఆయన మీ ప్రక్కన నిలబడినప్పుడు . . . అధిగమించలేని అసమానతలకు వ్యతిరేకంగా ఆయన నిలబడినప్పుడు . . . మీ తుఫాను సమయంలో ఆయన ఆ ఆశ్రయాన్ని అందించినప్పుడు, అటువంటి ఒకటి లేదా రెండు యెంచదగిన క్షణాలను గుర్తు చేసుకోండి. జీవితం యొక్క కఠినమైన నాశనముచేయు చేదైన పరిణామాల నుండి ఆయన మిమ్మల్ని రక్షించిన క్షణమును గుర్తుకు తెచ్చుకోండి. ఆయన “నువ్వు ఇది చేసినందుకు సిగ్గుపడాలి!” అని అనడానికి బదులు, “బిడ్డా, నేను నిన్ను క్షమించాను” అని చెప్పడానికి ఎంచుకున్న క్షణమును గుర్తుకు తెచ్చుకోండి. ఎంత అద్భుతమైన జ్ఞాపకాలు!

కాలం ఎప్పటికీ చెరిపివేయలేని అటువంటి వారసత్వం నేపథ్యంలో, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. మీ స్వభావముపై మీ తండ్రి ముద్ర వేసిన అర్థవంతమైన ముద్రలకు . . . ఆయన మీ శరీరము యొక్క అణువు అణువులో అల్లిన ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఇచ్చిన వానికి కృతజ్ఞతలు చెప్పండి. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఈ అడవి గుండా తిరుగుతున్నప్పుడు, సామెతలు అనే గొప్ప చెట్టు వద్ద ఆగి, 29 శతాబ్దాల క్రితం తెలివైన వ్యక్తి దాని బెరడులో చెక్కిన మాటలను శ్రద్ధతో ఆలోచించండి:

యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు
వాని తదనంతరము ధన్యులగుదురు. (సామెతలు 20:7)

ఎంత నిజం! మీరు ఎంత ధన్యులు!

శాశ్వతమైన, పితృ విధానంలో మీరు లబ్ధిదారులని మన ప్రభువు ప్రకటిస్తున్నాడు. మీ మిగిలిన జీవితమంతా, “చిత్తశుద్ధి”లో మీ తండ్రి యొక్క తెలివైన మరియు త్యాగపూరిత పెట్టుబడుల నుండి లాభాలను మీరు అందుకుంటారు. మీరు పెద్దయ్యాక మరియు మీ వారసత్వం గురించి తెలుసుకునే వరకు ఆ లాభా‌లు చాలా వరకు తెలియవు మరియు క్లెయిమ్ చేయబడవు. మీరు నిజంగా ఎంత సమృద్ధిగా ఉన్నారో ఇప్పటివరకు మీరు గ్రహించి ఉండకపోవచ్చు!

మీ నాన్న పరిపూర్ణుడు కాదు; ఇది బాధాకరమైనది అయినప్పటికీ, దానిని అంగీకరించే మొదటి వ్యక్తి ఆయనే. లేదా ఆయన తప్పుపట్టలేనివాడు కాదు, ఆయనే నిరాశకు గురైయుంటాడు. లేదా పూర్తిగా న్యాయమైనది చేయలేదు. . . లేదా ఎల్లప్పుడూ సరైనది చేయలేదు. కానీ ఆయన ఒక్కటి మాత్రం అయి ఉంటాడు-ఎల్లప్పుడూ మరియు పూర్తిగా-ఆయన మీ నాన్న . . . మీరు ఎప్పటికీ కలిగి ఉండే ఒకేఒక్క వ్యక్తి. నేను ఖచ్చితంగా చెప్పగలను, బహుమతి ఇచ్చే సమయం వచ్చినప్పుడు, ఆయనకు కావాల్సింది ఒక్కటే. సాదాసీదాగా మరియు సరళంగా, ఆయన మీరు చెప్పేది వినాలి,

“నాన్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”

అదే మీరు ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమతి. మీరు ఆయనకు మీ ప్రేమను అందించినప్పుడు, డబ్బుపెట్టి కొనే ఇతర వస్తువులను మీరు మరచిపోవచ్చు. ఆయనకు నాలుగు పదాల బహుమతి అందించే సంతృప్తిని మీరు కొనుగోలు చేయగలిగినదేదీ ఇవ్వలేదు.

తండ్రికి ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడు మీరు ఆయన కోసం బహుమతిని తీసుకోవాలనుకున్నప్పుడు, ఆయన కళ్లలోకి చూడండి లేదా ఫోన్‌లో ఆయనకు కాల్ చేయండి మరియు ఆయనకు అన్నింటికంటే ఎక్కువ అవసరమైన బహుమతిని ఇవ్వండి.

ఆయనకు మీ ప్రేమను ఇవ్వండి.

Copyright © 2010 by Charles R. Swindoll, Inc.

Posted in Parenting-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.