ఫిలిప్పీయులకు 2:1-4 చదవండి.
క్రీస్తు చెప్పినట్లుగా “దీనమనస్సు” కలిగియుండటమంటే, ఏమాత్రం చంచలంగా లేకుండా లోబడియుండటమే. ఇది ఒకరి స్వంత అవసరాలను తీర్చుకోవడం కంటే ఇతరుల అవసరాలను తీర్చడంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటుంది.
నిజంగా నిస్స్వార్థంగా ఉన్న వ్యక్తి తన సమయం మరియు వస్తువులు, శక్తి మరియు ధనముతో ఉదారంగా ఉంటాడు. అది ఆ వ్యక్తిలోనుండి ప్రవహించినప్పుడు, అది ఆలోచనాత్మకత మరియు సాత్వికము, అనుకవగల మనస్సు మరియు పరిచారకుని హృదయంతో కూడిన నాయకత్వం వంటి వివిధ మార్గాల్లో ప్రత్యక్షపరచబడుతుంది.
స్వీయ ప్రచారం, మన స్వంత హక్కులను కాపాడుకోవడం, మొదట మనల్ని మనం సంరక్షించుకోవడం, బెదిరించి గెలుపొందడం, త్రోసుకుంటూ మొదటి స్థానానికి వెళ్ళడం, ఇంకా అనేకమైన ఇతర స్వయంసేవ అజెండాలు కలిగియున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. మరేదీ చేయని విధంగా ఈ ఒక్క దృక్పథం మన ఆనందాన్ని అణచివేస్తుంది. సమర్థించుకోవడంలో, కాపాడుకోవడంలో, మోసపుచ్చడంలో బిజీగా ఉన్నట్లైతే, మనము భయంకరమైన, తీవ్రమైన ఉనికి కోసం మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లే.
మన స్వార్థపూరితమైన, దొరికింది-దోచుకో అనే సమాజంలో, నిస్స్వార్థ, సేవకుడి-హృదయ వైఖరిని పెంపొందించుకోవడం అనే భావన చాలామందికి దాదాపు హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ, సంతోషకరమైన విషయమేమిటంటే, అలాంటి దృక్పథాన్ని పెంపొందించుకోవాలని నిజంగా కోరుకునే కొందరు ఉన్నారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఆ కోరికను అమలు చేస్తే, సంతోషకరమైన జీవిత రహస్యం మీరు తెలుసుకుంటారు.
క్రీస్తు సారూప్యత అనేది నిస్స్వార్థమనే పదార్థముతో రూపించబడింది!
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000). Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.