తన జీవన ప్రగతి యొక్క అత్యున్నత దశలో, యేసు ఫిలిప్పుదైన కైసరయ యొక్క ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన మనస్సులో ఆయన శిష్యులకు మరియు మనకు కూడా ఒక కీలకమైన ప్రశ్న ఉంది. సన్నివేశం తెరుచుకొనుచుండగా నాతో తిరిగి ప్రయాణించండి.
పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రవహించే బుగ్గలు. దట్టమైన తోటలు. గ్రీకు దేవుడు పాన్ యొక్క ఆరాధనకు అంకితం చేసిన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలు వరుసగా మార్గాల్లో ఉన్నాయి. కైసరుకు ఒక భారీ, తెలుపు పాలరాయి ఆలయం ఎత్తుగా ఉంది. ఆయన గౌరవార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించలేదని, ఒక భవనం కూడా ఆయన మహిమకు నిలుపలేదని తెలిసి, బహుశా స్మారక చిహ్నాలు, భవనాలు, దేవతలకు నిర్మించిన దేవాలయాల మధ్యలో నిలబడి, యేసు ముందుకు వంగి, కొద్దిమంది మనుష్యులతో నిశ్శబ్దంగా చెప్పాడు- “మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?” (మత్తయి 16:13).
ఆయన తన గురించి ఒక అభిప్రాయ సేకరణ ప్రశ్న వేస్తున్నాడు. “ఏమి గుసగుసలాడుకొంటున్నారు?” అని అడిగాడు. 14 వ వచనం ప్రకారం, శిష్యులు యధేచ్చగా స్పందిస్తూ, “కొందరు బాప్తస్మమిచ్చు యోహాను అంటున్నారు.” యోహాను మరణమును జ్ఞాపకము చేసుకోండి. ఆయన హేరోదు అంతిప చేత శిరచ్ఛేదం చేయబడ్డాడు. కొంతమంది యేసు మృతులలోనుండి లేచిన బాప్తిస్మమిచ్చు యోహానని చెప్పుచున్నారు. అందుకే ఆయనకు అద్భుత శక్తులు ఉన్నాయి.
“కొందరు ఏలీయా. . . అని అనుకొంటున్నారు” అని శిష్యులు కొనసాగించారు. ఏలీయా వందల సంవత్సరాల క్రితం పరిచర్య చేశాడు. శతాబ్దాలుగా యూదులు ఏలీయాను ప్రవక్తల యువరాజుగా చూశారు, ఆయన ముందుగా వచ్చువాడేగాని మెస్సీయ కాదు. “యిర్మీయా, లేదా ప్రవక్తలలో ఒకరని. . . కొందరు అంటున్నారు” అని మూడవ సమాధానం వచ్చింది. బ్రిటీష్ పండితుడు ఆల్ఫ్రెడ్ ప్లమ్మర్ ఈ వీధి అభిప్రాయాలను “అనాలోచిత మరియు ఒడిదుడుకుల అంచనాలు”1 గా అభివర్ణించాడు. అయితే “ఆయన ఒక మానవుడు” అనే దానికి ఇవన్నీ ముఖ్యంగా కలిగి ఉంటాయి.
అప్పుడు యేసు తన చూపులను తగ్గించి, తన మనుష్యుల కొరకు ప్రశ్నను వ్యక్తిగతీకరించాడు: “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?” (16:15, ప్రాముఖ్యత జోడించబడింది). మత్తయి యొక్క మూల వాక్యంలో, యేసు “మీరు” అనే పదాన్ని నొక్కిచెప్పాడు-మరియు అది బహువచనంలో ఉన్నది. తాను ఎవడనని అనుకుంటున్నారని ఆయన ప్రతి మనిషిని అడుగుచున్నాడు.
15 మరియు 16 వ వచనాల మధ్య ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియదు, కాని పేతురు ఇక మౌనంగా నిలబడలేకపోయాడు. ఈ ప్రశ్న గుంపుకు సంబోధించినప్పటికీ, పేతురు వారందరి కోసం మాట్లాడుచున్నాడు. అది పేతురంటే, కాదా? నేను అతని జవాబును యిష్టపడుచున్నాను.
“నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (16:16).
మేము కొన్ని సార్లు సీమోను పేతురును చూచి నవ్వాము. అయితే మనము ఆయనకు నమస్కరించాల్సిన సందర్భం ఇక్కడ ఉంది. అతనికి ఇంతకంటే గొప్ప క్షణం ఎప్పుడూ రాలేదు. క్రీస్తు మాంసం మరియు ఎముక ఉన్న దేవుడు, అంతేగాని రాతితో కూడిన దేవుడు కాదు. ఉపపదములను [definite articles] గమనించండి. ఇది సాధారణ అనాలోచిత అంచనాల క్రమము కాదు. ఇది ఇక్కడ మాట్లాడే ప్రజల అభిప్రాయం కాదు. ఇది జీవముగల దేవుని కుమారుడైన మెస్సీయాను గురించిన ఒక నిర్దిష్ట సమాధానం.
మీరు ఆ సన్నివేశాన్ని చిత్రించగలరా? పేతురు ఎల్లప్పుడూ సరిగ్గా చేయలేదు, కానీ అతను ఈసారి దీన్ని సంపూర్ణంగా చేశాడు! అది ఎంత గొప్పది!
యేసు పేతురు మరియు శిష్యుల నుండి తన చూపులను ఇప్పుడు మీవైపు తిప్పుతున్నాడని ఒక్క క్షణం ఊహించుకోండి. ఆయనయొద్ద మీ కోసం కూడా ఒక ప్రశ్న ఉన్నది: “నేను మీకు ఎవరు?” అని అడుగుచున్నాడు.
మీరు సమాధానం చెప్పే గొప్ప ప్రశ్న మరొకటి ఉండదు. “మీకు యేసుక్రీస్తు ఎవరు?” “జీవముగల దేవుని కుమారుడు, నా రక్షకుడు మరియు నా దేవుడు,” అని మీ సమాధానం ఉండాలి.
ఆయన మరెవరు కావచ్చు? యేసు తప్ప క్షమాపణ ఇవ్వడానికి అర్హత ఉన్నవారు మరెవరూ లేరు. ప్రతి ఒక్కరూ లేదా ప్రతిదీ మీ నుండి తీసివేయబడినప్పుడు క్రీస్తు తప్ప మరెవరూ మీకు దగ్గరగా ఉండరు. మీ చేదును ఉపశమనమునకు లేదా మీ దుఃఖాన్ని ఆనందమునకు మార్చగలవారు మరొకరు లేరు. మీ లోతైన మరియు అత్యంత అవమానకరమైన రహస్యంతో ఉన్న మీరు విశ్వసించగలవాడు యేసు తప్ప మరొకరు లేరు. ఆయన మాత్రమే నింద నుండి ఉపశమనం కలిగించగలడు. ఆయన మాత్రమే చేదును తుడిచివేయగలడు మరియు మచ్చలను తొలగించగలడు. మిగతా సలహాదారులు మరియు స్నేహితులు మీకు అండదండగా ఉండవచ్చు, మీతో ఏడువవచ్చు మరియు మిమ్మల్ని ఆయనకు సూచించవచ్చు. కానీ ఆయన మాత్రమే మిమ్మల్ని మార్చగలడు!
మరియు ఈ జీవితంలో ఆయన చేయగలిగింది మాత్రం యిదే. మీరు మీ చివరి శ్వాస తీసుకొని, నిత్యత్వంలోకి అడుగుపెట్టినప్పుడు, యేసు ప్రశ్నకు విశ్వాసంతో సమాధానమిచ్చిన తరువాత, మీతో పాటు యేసు తప్ప జీవించియున్న ఏ ఒక్క ఆత్మయు మీ పక్షమున ఉండదు. ఆయన మాత్రమే మిమ్మల్ని సమాధి నుండి మహిమలోనికి తీసుకెళ్లడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడు.
యేసునొద్ద మీ కోసం ఒక ప్రశ్న ఉంది. మీకు సమాధానం లభించినందుకు మీకు సంతోషం లేదా?
- Alfred Plummer, An Exegetical Commentary on the Gospel According to S. Matthew (Grand Rapids: Eerdmans, 1960), 225.
Taken from Charles R. Swindoll, “Jesus Has a Question for You,” Insights (April 2007): 1-2. Copyright © 2007 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.