“పాపా, పాపా,” అని బాలుడు తన తాత యొక్క వస్త్రమును లాగుతూ పన్నెండు రాళ్ల కుప్పను చూపించాడు. “ఈ రాళ్ళు యొక్క అర్థం ఏమిటి?”
“ఓహ్ జాకబ్, మన ప్రభువు విమోచన హస్తం గురించి ఒక కథ చెప్పనివ్వు. . . .”
నలభై సంవత్సరాలు గుడారాలు వేసుకొని మరియు సమాధులు త్రవ్విన తరువాత, ఇశ్రాయేలీయులు చివరకు యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. మన్నాకు బదులుగా ద్రాక్షలు అలాగే గోరువెచ్చని నీటికి బదులుగా పాలు మరియు తేనె భర్తీచేయడానికి దేవుడు వారిని విడుదల చేసే ముందు, పన్నెండు రాళ్ళలో నుండి ఒక ఆసక్తికరమైన స్మారక చిహ్నాన్ని నిర్మించమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు:
జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను–ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము. (యెహోషువ 4:1-3)
పురుషులు నది రాళ్లను నియమించబడిన ప్రదేశానికి లాగిన తర్వాత, దేవుడు ఇలా కొనసాగించాడు:
ఇకమీదట మీ కుమారులు–ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు– యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దానునీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలమువరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగానుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును. (యెహోషువ 4:6-7)
నన్ను నమ్మండి; ఏ పిల్లవాడు కూడా ఈ రాళ్ల కుప్పను జంగిల్ జిమ్ (పిల్లల ఆట) లాగా పరిగణించలేదు. ఇవి దేవుని శాశ్వత విశ్వాస్యతకు కనిపించే స్మారకంగా ఏర్పడ్డాయి. అవి వారసత్వపు రాళ్ళు. ఆ రోజు యొర్దాను నది ఒడ్డున కూర్చుని, ఇశ్రాయేలీయులు వారసత్వాన్ని ఎలా సృష్టించాలో ఒక వస్తువు ద్వారా పాఠం నేర్చుకున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి, మీ జీవితంలో దేవుని వారసత్వం గురించి మీ భౌతిక గుర్తులు ఎక్కడ ఉన్నాయి?
యెహోషువలోని ఈ భాగం నన్ను మూడు పదాలను గూర్చి ఆలోచించమని ప్రేరేపించింది. మొదటిది, సృష్టించండి. చారిత్రాత్మక గుర్తులను స్థాపించే ఇబ్బందులకు మనం వెళ్లాలని దేవుడు కోరుకుంటాడు. “ఇబ్బందులకు వెళ్ళాలి” అని నేను చెప్పినట్లు గుర్తించండి. వారసత్వపు గుర్తులను సృష్టించడం అంత సులభం కాదు. ఇవి పెద్ద రాళ్ళు. అవి దేవుని విశ్వాస్యతకు శాశ్వత గుర్తుగా ఎన్నుకోబడాలి, లాగబడాలి, పేర్చబడాలి, ఆపై నిర్వహించబడాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు, మీ చారిత్రాత్మక గుర్తులు రాళ్ళు కాకపోవచ్చు. బహుశా మీరు ఆయన స్వభావమును గురించి ఒక ప్రకటనతోకూడిన ఒక ఫలకాన్ని సృష్టించవచ్చు లేదా ఆయన సమాధానాలతో శాశ్వతంగా సిరాతో వ్రాయబడిన ప్రార్థన పత్రికను ప్రారంభించవచ్చు లేదా మీ రక్షణ అనుభవాన్ని చేతితో వ్రాసి ఆ కాపీని ఫ్రేమ్ చేయవచ్చు. మీరు ఏది నిర్ణయించుకున్నా, ఉద్దేశపూర్వక మరియు ఆలోచనాపూర్వక క్రియల తరువాత సృజనాత్మక ఆలోచన వస్తుంది.
రెండవది, గుర్తుంచుకోండి. మనము ఆయనను మరియు ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకోవడం దేవుడు లక్ష్యముంచుతాడు. జ్ఞాపకశక్తి ఒక అద్భుతమైన విషయం, కానీ సమయం గడిచేకొద్దీ అది మసకబారుతుంది. మనం చాలా త్వరగా ముసలివాళ్ళమవుతాము. నా స్నేహితుడు జిమ్ డాబ్సన్, “మీ ముఖవైఖరి అర్థమయ్యే సమయానికి, మీ మనస్సు మసకబారుతుంది” అని చెప్పడం నాకు గుర్తుంది.
మీరు ఎప్పుడైనా నేమ్ గేమ్ ఆడారా? సింథియా మరియు నేను మా సమయాన్ని గడుపుతూ ఇలా అనుకుంటాము, “గుర్తుందా, ఆహ్, ఆహ్. . . ” అప్పుడు తను అంటుంది, “అవును, ఆమె పేరు మేరీ.” అప్పుడు నేను అంటాను, “అవును. అవును.” నాకు గుర్తుంది అప్పుడు ఆమె . . . ” “అవును, ఆమె అలా చేసింది.” “అవును, అది నిజమే. అది నిజమే.” ఎక్కువ కాలం కలిసి జీవించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో ఒకటి, మీ జీవితభాగస్వామి మీ వాక్యాలను పూర్తిచేయగలుగుతారు.
కానీ దేవుడు తాను చేసినదానిని, లేదా ఆయన ఎవరో మరచిపోవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. దురదృష్టవశాత్తు, దేవుని విశ్వాస్యత కంటే మన వైఫల్యాలను మనం గుర్తుంచుకుంటాము. మనం విషాదాలను గుర్తుంచుకుంటాము కానీ విజయాల గురించి మరచిపోతాము. మనం ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఆర్థిక మాంద్యానికి గురైనప్పుడు ఆయనపై మన ఆలోచనలను కేంద్రీకరించడానికి ఆయన చేసిన మేళ్ళు మనకు భౌతిక గుర్తులుగా సహాయపడతాయి. మన పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన దయ యొక్క స్మారక చిహ్నాలు మనకు ఓదార్పునిస్తాయి. ఆయన స్వభావమును గురించి తలపోసుకున్నప్పుడు భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుంది.
మూడవది, నేర్పించండి. మన పిల్లలు ఆయనను, ఆయన చేసిన పనులను గుర్తుంచుకోవాలని దేవుడు జాగ్రత్త వహించుచున్నాడు. జీవితాన్ని గురించిన నిర్ణయాన్ని తీసుకునేది, అలాగే అది రూపుదిద్దుకోవడం జరిగేది ఇంట్లోనే. తరువాతి తరం తన గురించి తెలుసుకోవాలని దేవుడు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. అది మన ద్వారానే ఉత్తమంగా జరుగుతుంది. ఈ వార్తాలేఖలోని నా మనవడు మరియు అతని ఐదు రాళ్లను గురించిన కథ అనేది స్పష్టమైన జ్ఞాపకాల ద్వారా సత్యాన్ని అందించటం గూర్చి ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
సుదీర్ఘ పర్యటనలు లేదా కుటుంబ సెలవులకు బయలుదేరే ముందు, సింథియా మరియు నేను సాధారణంగా పిల్లలతో కారులో ప్రార్థన చేస్తాము. మేము ఆతురుతలో బయలుదేరితే, పిల్లలలో ఒకరు, “మనం ప్రార్థన చేయడం మర్చిపోయాము!” మేము వెంటనే ప్రక్కన ఆగి సమస్యను పరిష్కరిస్తాము. నిజానికి, “ఆమేన్” అని మేము చెప్పిన వెంటనే, నలుగురిలో ఒకరు హఠాత్తుగా ఇలా అడుగుతారు, “మనము దాదాపు వచ్చేసామా?”
పిల్లలు పునరావృత్తి ద్వారా నేర్చుకుంటారు. మా యుక్తవయస్సు వచ్చిన పిల్లలు, ఇప్పుడు వారి స్వంత పిల్లలతో, “వారు దేనినైనా సరే నేర్చుకోవడానికి మీరు ఎన్నిసార్లు ఒకే మాటను చెప్పాలి?” నా సమాధానం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, “మీరు అనుకున్నదానికన్నా ఎక్కువసార్లు.” అలవాటు అయ్యేవరకు మీరు దీన్ని పదే పదే చేయాలి. ఒక చిత్రం వెయ్యి పదాల విలువైనది అయితే, శాశ్వత వారసత్వం ఒక మిలియన్ అంత విలువైనది.
సృష్టించండి. గుర్తుంచుకోండి. నేర్పించండి. మీకు ప్రస్తుతం మీ జీవితంలో ఏవైనా వారసత్వపు రాళ్ళు ఉన్నాయా? లేకపోతే, కొన్నింటిని సృష్టించే సమయం ఇదే. అందుకే ఈ సంవత్సరం మా వార్తాలేఖ అంశం గురించి నేను చాలా సంతోషిస్తున్నాను: వారసత్వమును సృష్టించండి.
ఈ సంవత్సరం ప్రతి నెల మీ జీవితంలోని ఒక ప్రదేశంలో వారసత్వాన్ని సృష్టించడానికి మేము మీకు సహాయం చేస్తాము. మరియు మేము ప్రతి నెలా అందుబాటులో బుక్‌మార్క్‌తో మీకు సహాయం చేయబోతున్నాము. ఇది దేనికి భౌతిక గుర్తు అంటే:
- సృష్టించండి-నెలవారీ అంశంతో కలిపి వారసత్వపు రాయిని నెలకొల్పండి.
- గుర్తుంచుకోండి-దేవుని స్వభావము మరియు ఆయన క్రియలను గూర్చి శ్రద్ధతో ఆలోచించుటకు సహాయపడటానికి మేము కొన్ని వాక్యాలను మరియు ఉదాహరణలను అందిస్తాము.
- నేర్పించండి-మీ కుటుంబానికి లేదా మీ సన్నిహితులకు మీ వారసత్వాన్ని ఇవ్వండి.
Taken from Charles R. Swindoll, “Creating a Legacy: Preparing the Stones,” Insights (January 2004): 1-2. Copyright © 2004 Insight for Living. All rights reserved worldwide.