ఎట్టిపరిస్థితుల్లోను తాను అనుకున్నదే చేయాలనుకునే ప్రపంచంలో, అధికారం పట్ల సరైన వైఖరిని పెంపొందించడం చాలా కష్టం. “అధికారమును ప్రశ్నించు!” మనస్తత్వం మన సమాజంలో ఎంతలా ముడిపడిపోయి ఉందంటే, దానిని నివారించడం అసాధ్యం అనిపిస్తుంది. వాస్తవికంగా, మన గృహములలో మాత్రమే దీనిని అంగీకరించడం మనం నేర్చుకుంటాము. మీరు ఇది చేస్తున్నారా? ఇప్పుడు, నిజాయితీగా ఉండండి. మీరు నివాసముంటున్న గోడల లోపల మీరు నియంత్రణలను నిర్వహిస్తున్నారా? బహుశా ఈ మూడు హెచ్చరికలు దానిని సాధించటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి . . . లేదా ఈ రోజు ప్రారంభింపజేస్తాయి.
1. బాల్యం. తల్లిదండ్రులు నియంత్రణను విడిచిపెట్టిన ఇంట్లో తిరుగుబాటు స్వభావం ఏర్పడుతుంది.
2. కౌమారదశ. నియంత్రణను వ్యతిరేకించే తోటివారిలో తిరుగుబాటు స్ఫూర్తి అలవరుతుంది. మరియు అది అక్కడ అరికట్టకపోతే, అది ఎక్కడ ఉచ్చస్థానం పొందుతుందంటే-
3. యుక్తవయస్సు. దేవుడు తిరిగి నియంత్రణ సాధించినప్పుడు తిరుగుబాటు జీవితాన్ని దేవునిచేత నలగ్గొట్టబడవలసి వస్తుంది.
మరియు దానిని అనుభవించిన మరియు వారం వారం దానితో వ్యవహరించే వారి మాటలను నమ్మండి, సహించడానికి మరేదీ కూడా బాధాకరముగా ఉండదు. . . .
మిమ్మల్ని అణగదొక్కడానికి దేవుడు చేస్తున్న ప్రయత్నాలను మీరు సహించగలరని మీరు అనుకుంటున్నారా? . . . ఒక మాటతో, నేను ముగిస్తాను-లోబడండి.
Taken from Charles R. Swindoll, Strengthening Your Grip: How to Live Confidently in an Aimless World (Dallas: Word, 1982), 249-250.