ఆమె మరణానికి కొంతకాలం ముందు, కొర్రీ టెన్ బూమ్ మా సంఘానికి హాజరయ్యారు. ఆమె నమ్మకమైన ఉదాహరణ పట్ల నా భార్య యొక్కయు మరియు నా యొక్కయు ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తపరచాలనే ఆత్రుతతో, కూడిక అయిపోయిన తర్వాత నేను ఆమెను కలిసి క్లుప్తంగా మాట్లాడాను. ఆమె నా కుటుంబం గురించి ఆరా తీసింది . . . ఎంత మంది పిల్లలు, వారి వయస్సు ఎంత అనే విషయాలు. ప్రతి ఒక్కరి పట్ల నాకున్న లోతైన ప్రేమను ఆమె గుర్తించింది మరియు చాలా గట్టిగా పట్టుకోకుండా జాగ్రత్త వహించాలని చాలా మృదువుగా నాకు సలహా ఇచ్చింది. ఆమె ముడతలు పడిన చేతులను నా ముందు కప్పుతూ, నేను ఎప్పటికీ మర్చిపోలేని సలహా ఇచ్చింది. ఆ బలమైన డచ్ ఉచ్చారణను నేను ఇప్పటికీ గుర్తుచేసుకుంటాను: “పాస్టర్ స్వెండహ్ల్, మీరు ప్రతిదాన్ని వదులుగా పట్టుకోవడం నేర్చుకోవాలి . . . ప్రతిదీ. మీ ప్రియమైన కుటుంబం కూడా. ఎందుకు? ఎందుకంటే తండ్రి తన వద్దకు తిరిగి రావాలని ఒకరిని కోరుకోవచ్చు, మరియు ఆయన అది చేసినప్పుడు, ఆయన మీ వేళ్లను వదులుగా చేయటానికి పరిశీలిస్తే అది మిమ్మల్ని బాధపెడుతుంది.” ఆపై, అన్నీ చెప్పేటప్పుడు ఆమె చేతులను బిగించి, ఆమె నెమ్మదిగా వాటిని తెరిచి, ఆమె చాలా దయగా నవ్వి ఈ మాటలు జోడించింది, “గుర్తుంచుకో . . . ప్రతిదాన్ని వదులుగా పట్టుకో . . . ప్రతిదీ.”
మన ప్రభువు సార్వభౌమాధికారి కాబట్టి, మన కాలాలు మాత్రమేగాక, మనం కలిగియున్నవన్నీ, మనం ప్రేమించే ప్రజలందరూ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నారు. మన హక్కులను ఆయనకు వదిలిపెడితే, ప్రతిదానిపై మరియు ప్రతి ఒక్కరిపై మన పట్టును ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టడం ఇముడ్చుతుంది. అది సులభమా? ఎన్నడూ కాదు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గెట్టిస్‌బర్గ్‌లోని తోటి పాస్టర్ డేనియల్ హన్స్ ఈ విషయాన్ని కష్టమైన మార్గంలో కనుగొన్నారు. గాడ్ ఆన్ ద విట్నెస్ స్టాండ్ అనే తన ప్రభావవంతమైన పుస్తకంలో, అతను ఇలా వివరించాడు:
రెండు రోజుల క్రితం, నా కుమార్తె చనిపోవడాన్ని నేను చూశాను. ఒకరి బిడ్డ నెమ్మదిగా చనిపోవడాన్ని చూడటం, పవిత్రంగా ఉన్నదానిని పునఃపరిశీలించమని బలవంతం చేస్తుంది, అయినను నిర్లక్ష్యం చేస్తుంది- జీవితం, ప్రేమ, దేవుడు. . . .
రెండు వారాలకు పైగా నా కుమార్తె నెమ్మదిగా సన్నగా అయిపోవడాన్ని నేను చూశాను. మొదట ఆమె కూర్చునే సామర్థ్యాన్ని, తరువాత మింగే సామర్థ్యాన్ని, తరువాత మాట్లాడే సామర్థ్యాన్ని, తరువాత ఆమె కళ్ళు మరియు నాలుక మినహా దేనినైనా కదిలించే సామర్థ్యాన్ని, తరువాత ఆమె చూడగల సామర్థ్యాన్ని కోల్పోయింది. ఆమె ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని నేను అన్నిచోట్లను ప్రార్థించాను. ఈ సమయంలో, ఒక చిత్రం నా మనస్సును నింపింది, అనివార్యమైన చిత్రం. ఇది ఒక గొప్ప అన్యాయం యొక్క చిక్కుముడులను విప్పుటకు ప్రయత్నిస్తున్న నేను ఒక వేటాడే విచారణకర్తగా ఉండగా, న్యాయస్థానంలో సాక్షి బోనులో దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ చిత్రం నాతో ఉద్భవించలేదు. . . . సాక్షి బోనులో నా దేవుని స్వరూపాన్ని పూర్తిగా అవతరింపజేసినది యోబు. “నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను” అని యోబు విన్నవించుకున్నాడు.
తరువాత జరిగేదంతా ఊహాత్మక సంభాషణ . . . న్యాయవాది పాస్టర్ హన్స్, న్యాయస్థానంలో తన కేసును వాదించడం మరియు సాక్షి బోనులో దేవుడు, వీరిద్దరి మధ్య నడుస్తూ అసంపూర్తిగా ఉన్న వాదోపవాదములు. పరిమిత స్థలం ఉన్నందున, నేను సారాంశాలను మాత్రమే ఇవ్వాలి, కానీ మీరు త్వరగా వేగాన్ని పొందుతారు.
న్యాయవాది: దేవా, నేను ఇప్పుడు నా మనస్సు నుండి కాకుండా నా హృదయం నుండి మాట్లాడుతున్నాను. నేను మనస్సు యొక్క వాదనలను దూరంగా ఉంచాను మరియు నా హృదయం, “ఇది ఎలా ఉందో నీకు తెలియదు! నీ బిడ్డ నెమ్మదిగా చనిపోవడాన్ని చూడటం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నేను ఎలా ఫీల్ అవుతున్నానో, ఎలా బాధపడుతున్నానో నీకు తెలియదు.”
దేవుడు: ఒక బిడ్డను, ఒకే బిడ్డను కోల్పోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని నువ్వు మర్చిపోయావు. . . . ఆయన బాధ నిజమని నువ్వు అనుకోలేదా? ఆయన మరణం నాకు వేదన కలిగించలేదని అనుమానమా?
న్యాయవాది: నేను ఆయన మరణం యొక్క వాస్తవికతను తిరస్కరించను. అయినప్పటికీ, ఆయన కొరకు పునరుత్థానం ఎదురుచూసింది. ఆయనకు నిరీక్షణ అందుబాటులో ఉన్నది.
దేవుడు: అదే నిరీక్షణ నీకు అందుబాటులో లేదా? ఈ క్షణం జీవితాన్ని కాపాడగల సృష్టికర్త మరియు భరించేవాడు కంటే మీకు ఎక్కువ అవసరం ఉన్నది. మీకు విమోచకుడు అవసరం. . . . నేను విచ్ఛిన్నమైనదాన్ని పునరుద్ధరించగలను, పోగొట్టుకున్నదాన్ని రక్షింపవచ్చు, చనిపోయినదాన్ని పునరుత్థానం చేయవచ్చు. . . . నేను కొత్త జీవితాన్ని ఇస్తాను.
న్యాయవాది: నేను నమ్ముతున్నాను, కాని నా కుమార్తె ఎందుకు సిద్ధాంతానికి ప్రయోగమైనదో నాకు అర్థం కాలేదు. ఇది మూడేళ్ల వయస్సులో ఉన్నవారిపై పరీక్షించబడటమైమిటో అర్ధం కాలేదు. . . . ఇలాంటి సంఘటనలు నాకు అర్థం కావట్లేదు.
దేవుడు: నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేవు. . . . నీ మనస్సు వివరణలు మరియు సమాధానాలను కోరుతుంది. నీ హృదయానికే ఇంకా ఎక్కువ అవసరం. విషాదాన్ని అర్థం చేసుకోవడం కంటే విషాదంలో నీకు అర్థం అవసరం. శూన్యతను పూరించడానికి నీకు ప్రేమ అవసరం. బాధాకరమైన ప్రపంచంలో నీకు నిరీక్షణ అవసరం. నా కారణాలను మీరు అడగండి. అవి మీకు మించినవి. బదులుగా, నేను మీకు ఉపయోగకరమైనదాన్ని ఇస్తాను. . . . నన్ను నేనే మీకు ఇస్తాను. నేను సమస్త జీవమునకు కేంద్రంలో ఉన్నాను. నేను చాలా కలవరపెట్టే రహస్యాలకు అర్థాన్ని తీసుకురాగలను. నన్ను విశ్వసించాలనే ఒక్క విషయాన్ని నేను నిన్ను అడుగుతున్నాను. ఎంత గందరగోళంగా, బాధాకరంగా ఉన్నా. . . నన్ను నమ్ము. నేను నీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగియుండేవాడిని; కానీ సమాధానాలు వ్యత్యాసమును తెచ్చి ఉండకపోవచ్చు. నీకు నా సమాధానాలు అవసరం లేదు. నీకు అవసరమైనది నేను.1
ఒక మనిషి నిజంగా ప్రారంభించని దానిపై తన పట్టును వదులుకోవడానికి చేస్తున్న పోరాటం యొక్క కదిలే వైనము యిది. నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే తప్ప నువ్వు నేను ఊహించినదానికంటే ఎంతో బాధాకరంగా అది ఉండి ఉండవచ్చు. తరువాత ఎవరు అక్కడ ఉంటారో మనకు తెలియదు కాబట్టి, సంవత్సరాల క్రితం నాకు ఇవ్వబడిన కొర్రీ టెన్ బూమ్ యొక్క సమయోచిత సలహాలను అభ్యాసం చేయడం ప్రారంభించడం తెలివైన పనేనని నేను భావిస్తున్నాను. నువ్వు కలిగి ఉన్నదంతా నీకు ఎక్కువ విలువైనది కావచ్చు లేదా మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారో, వదిలిపెట్టండి. “గుర్తుంచుకో. . . ప్రతిదాన్ని వదులుగా పట్టుకో. . . ప్రతిదీ.”
- Daniel T. Hans, God on the Witness Stand: Questions Christians Ask in Personal Tragedy (Grand Rapids: Baker, 1989), as quoted from Preaching.com, http://www.preaching.com/sermons/11565500 (accessed Feb. 13, 2013).
Copyright © 2013 by Charles R. Swindoll, Inc.