యేసు కొండపై తన ప్రసంగాన్ని బోధించిన రోజున అనేక సమస్యలకు దారితీసే పరిస్థితికి తెర లేపాడు. సూర్యాస్తమయానికల్లా ఆయన అలసిపోవటానికి తమ దగ్గరనున్న సొమ్మంతయు ఇవ్వకుండా ఉండే పరిసయ్యుడు అక్కడ దరిదాపుల్లో ఒక్కడు కూడా లేడు. వారు ఆయనను ద్వేషించారా! వారు ఆయనను అసహ్యించుకున్నారు, ఎందుకంటే ప్రజలను కలుషితం చేసే వారి బూటకపు మతపరమైన వ్యర్థపు మాటలను మరియు వారు తమ అతి-ఆత్మీయతను బలంగా చూపించడాన్ని ఆయన నిరాకరించాడు.
మెస్సీయ పర్వతాన్ని అధిరోహించిన రోజున తన పదునైన సత్య ఖడ్గాన్ని ఒరలోనుండి తీసాడు. ఆ సాయంత్రం ఆయన దిగివచ్చేసరికి, కపటుల రక్తంతో బొట్లు బొట్లుగా కారుచున్నది. ఎప్పుడైనా ఒక వ్యక్తి గర్వాన్ని బయటపెట్టాడంటే, అది యేసే ఆ రోజు చేశాడు. తిమింగలాన్ని పట్టుకునే ఈటెలాగా ఆయన మాటలు వారికి చెప్పకోలేని చోట గ్రుచ్చుకొని ఉంటాయి. గర్వముతో కూడిన వారి ఘోరమైన కెరీర్‌లో ఎన్నడూ ఇంత సూటిగా మాటలు గ్రుచ్చుకొని ఉండవు. లోతునుండి ఉబ్బిన మృగాల వలె వారు అందరికీ కనిపించేలా ఉపరితలంపైకి తేలారు.
యేసు తృణీకరించినది ఏదైనా ఉందంటే, అది ప్రతి పరిసయ్యుడు సెమినరీలో ప్రావీణ్యం సంపాదించిన విషయమే: ప్రదర్శించడం, లేదా, అనుకూలంగా మార్చుకోవడం, స్వనీతి. వారు పాలస్తీనాకు చెందిన పరిశుద్ధులు, వెన్నుపోటుదారుల రాజరిక క్రమంలో విచక్షణ లేని కొత్తగా కొలువు తీరిన వారిని నమోదు చేసిన ప్రప్రథమమైనవారు. వారు విమర్శించే ప్రార్థనల అభ్యాసంలో గతంలో ప్రవీణులు, అలాగే తమ నిస్సత్తువ వ్యక్తీకరణ మరియు విసుగు పుట్టించే, దుర్భరమైన శబ్దముతో ఇతరులను ఆకట్టుకునే మార్గాలపై వారు రోజులు గడిపారు. అన్నింటికంటే ఘోరమైన విషయమేమంటే, క్రియలమూలమైన ముళ్ల యొక్క విత్తనాలను విత్తడం ద్వారా మరియు మత అసహనం యొక్క నిషేధించబడిన తీగెలుగా వాటిని పెంచడం ద్వారా, నిజాయితీగా అన్వేషించేవారిని తమ దేవుడిని చేరుకోకుండా పరిసయ్యులు నిరోధించారు.
నేటికీ, శాస్త్రం యొక్క కాటు క్రీస్తు శరీరంలోకి పక్షవాతం కలిగించే విషాన్ని వ్యాపింపజేస్తుంది. దాని విషం మన కళ్ళకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది, మన తీక్ష్ణతను మందగింపజేస్తుంది మరియు మన హృదయాలలో గర్వాన్ని రేకెత్తిస్తుంది. వెంటనే మన ప్రేమ ఒక పొడవైన చెక్‌లిస్ట్‌తో మానసిక క్లిప్‌బోర్డ్‌గా, ఇతరులు మనకు దగ్గరైయ్యే ముందు వారికి తగిన అర్హతలు ఉన్నాయా లేవాయని పరిశీలించే విధంగా మారిపోతుంది. స్నేహంలో ఉండే ఆనందం తీర్పుతీర్చే వైఖరి మరియు విమర్శనాత్మక దృష్టితో విచ్ఛిన్నమవుతుంది. సహవాసం అనేది “ఆమోదయోగ్యమైన” వస్త్రధారణలో ఉన్న ఊహాజనిత వ్యక్తుల ఇరుకైన క్రమానికే పరిమితం కావడం నాకు మూర్ఖంగా అనిపిస్తుంది. పొట్టిగా జుట్టు కత్తిరించుకోవటం, క్లీన్-షేవ్, టైలర్డ్ సూట్ లుక్ (మ్యాచింగ్ చొక్కా మరియు టైతో) చాలా గుంపుల్లో అవసరం అనిపిస్తుంది. నేను ఒక నిర్దిష్ట శైలి లేదా వేషధారణను ఇష్టపడతాను కాబట్టి అది ఉత్తమమైనదని లేదా ఇది అందరికీ సంబంధించినదని అర్థం కాదు. అలాగని వ్యతిరేకంగా ఉండటం దేవునికి అంతగా నచ్చదని కూడా అర్థం కాదు.
మనలా లేనివారి పట్ల తీవ్ర అసహనమే మన సమస్య-కరుకైన వ్యాఖ్య వలన తెల్లమోహం వేయడంలో ఈ వైఖరి వ్యక్తమవుతుంది. ఇటువంటి శాస్త్రబద్ధమైన మరియు పక్షపాత ప్రతిచర్యలు నేలమాళిగలో మంటలు లేదా బెంచిలో ఫ్లూ కంటే వేగంగా స్థానిక సంఘ క్రమాలను సన్నగిల్లేట్లు చేస్తాయి. మీరు దీనిని ప్రశ్నించదలిస్తే, గలతీయుల పత్రికను జాగ్రత్తగా పరిశీలించండి. వారు క్రీస్తును “విడిచినందుకు” (గలతీయులకు 1:6), “దేవుని కృపను” నిరర్థకము చేసినందుకు (2:21), ధర్మశాస్త్రముచేత “భ్రమపెట్టబడినందుకు” (3:1), మరుయు బలహీనపరచే వ్యాధి యొక్క “దాసత్వంలో” ఉండానికి ఇష్టపడినందుకు (4:9), పౌలు యొక్క కలం వేడిచేసిన సిరాతో ప్రవహించింది.
తప్పకుండా . . . మన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి. మనకు ఇష్టమొచ్చినట్లు ఉండటానికి కృప అనుమతించదు. ప్రేమకు దాని బైబిల్ పరిమితులు ఉన్నాయి. శాస్త్రానికి వ్యతిరేకం “మీ ఇష్టం వచ్చినట్లు చేయండి” కాదు. అయితే వినండి! మనలో చాలామంది గ్రహించిన దానికంటే పరిమితులు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఉదాహరణకు, దేవుడు నవ్వే ఏకైక సంగీతం నాణ్యమైనది లేదా కీర్తనలు అని నేను నమ్మలేకపోతున్నాను. దేశీయ-జానపదం లేదా డిక్సీల్యాండ్ కూడా ఎందుకు కాకూడదు? సంఘములోకి ప్రవేశించడానికి అవసరమైన వస్త్రం సూట్ మరియు టై అని నేను నమ్మను. కటాఫ్‌లు లేదా జీన్స్ మరియు టీ-షర్టులు ఎందుకు కుదరవు? ఆశ్చర్యపోతున్నారా? బాహ్యపరమైన వేషముల పట్ల ఆందోళన చెందేది ఎవరో మనం గుర్తుచేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు అయితే కాదు!
“మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7)
మరియు దేవుడు ఆశీర్వదించే ఏకైక స్వరం ఆదివారం నియమించబడిన పరిచారకుడని ఎవరు నిరూపించగలరు? మంగళవారం మధ్యాహ్నం సేల్స్‌మ్యాన్ లేదా శుక్రవారం ఉదయం హైస్కూల్ టీచర్ ఎలా ఉంటారు?
మన ప్రభువు తన బలమైన మరియు సుదీర్ఘమైన ప్రసంగాన్ని పోరాడుతున్న పాపులకు, నిరుత్సాహపడిన శిష్యులకు లేదా సంపన్న వ్యక్తులకు కాకుండా, కపటులు, డప్పాలు కొట్టుకునేవారు, మనుష్యల పద్ధతులను ఆచరించువారు — ప్రస్తుత-కాలపు పరిసయ్యుల కోసం కేటాయించారని గుర్తుంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
శతాబ్దాల క్రితం ఆ మధ్యాహ్నం పర్వతంపై అందించిన సందేశం సహజమైన శక్తి మరియు స్పష్టతతో లోతైన లోయల కాలమును ప్రతిధ్వనిస్తుంది.
మత్తయి 6:1 చూడండి:
“మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి.”
మరో మాటలో చెప్పాలంటే, ప్రదర్శించడం ఆపండి! మీరు ఊహించినట్లుగా లేనివారిని తక్కువగా చూడటం ఆపండి. మీ స్వంత మంచితనాన్ని ప్రదర్శించడం మానేయండి. మీ నీతిని శ్రద్ధగా చూడాలని చెప్పడం మానేయండి. గమనించబడాలనే ఆశను మానుకోండి. అలాంటి ప్రవర్తనను మానుకోవడానికి నిరాకరించే వారి పట్ల జాగ్రత్త వహించాలనే హెచ్చరిక ఇందులో సూచించబడింది. ఆపై, ఆ హెచ్చరికను వారి జ్ఞాపకాలలోకి జ్వలింపజేసేందుకు, ఇతరులు వారిపై ఓహో, ఆహా అనేలా ప్రజలు తమ స్వనీతిని ఎలా ప్రదర్శిస్తారు అనేదానికి మూడు నిర్దిష్ట ఉదాహరణలను వారికి అందించాడు.
మత్తయి 6:2 “కావున నీవు ధర్మము చేయునప్పుడు” లేదా అవసరమైన ఇతరులకు సహాయం చేసే దాతృత్వ చర్యల గురించి మాట్లాడుతుంది. మీరు దీన్ని చేయునప్పుడు “బూర ఊదింప వద్దు” అని ఆయన చెప్పాడు. ఒక “రహస్యము” ను కూడా (6:4) . . . నిశ్శబ్దంగా ఉంచండి. టార్జాన్ అడవిలో ఊగుతున్నట్లుగా గమనించుట కొరకు అరవకండి. ఎవరికీ చూపించవద్దు, అనామకంగా ఉండండి. మీ పేరు అన్ని చోట్ల ముద్రించబడుతుందని ఆశించవద్దు. పరిసయ్యులు తమ బహుమతులను ఇతరులకు చూపించడానికి ఇష్టపడతారు. వారు తమ స్వరూపాన్ని మార్చుకోవటానికి ఇష్టపడతారు. ఇది, అది ఎవరు చేశారు ఫలానాది ఎవరెవరికి ఎవరు ఇచ్చారు అనేది ఇతరులకు గుర్తు చేయడానికి వారు ఇష్టపడతారు. యేసు ఇలా చెప్పాడు: మీరు ఎవరికైనా సహాయం చేయడానికి మీ డబ్బును ఉపయోగించినప్పుడు చాటింపు వేయవద్దు.
మత్తయి 6:5 “మీరు ప్రార్థన చేయునప్పుడు” ఏమి చేయాలో దాని గురించి మాట్లాడుతుంది. చూడబడాలని మరియు వినబడాలని ప్రముఖ ప్రదేశాలలో నిలబడి అర్థరహితమైన చికాకు పుట్టించే మాటలను ఇష్టపడే ప్రార్థనా ప్రదర్శనాకారులకు వ్యతిరేకంగా ఆయన మనల్ని హెచ్చరించాడు. పరిసయ్యులు కరుణాదిరసముగల పదాలను మరియు పైకి మంచిగా నీరసంగా కనబడి లోపల మోసముతో ఉన్నవారిని ఇష్టపడతారు. ఎంతో గొప్పవారు-పరిశుద్ధులు అనిపించుకోవడానికి కావలసిన మెళకువలు వారికి కొట్టిన పిండే. వారి ప్రార్థనలలో వారు చెప్పే ప్రతిదానికి వినేవారికి ఈ భక్తిగల ఆత్మ పరలోకంలో నివసిస్తుందని మరియు ప్రధాన దేవదూతయైన మిఖాయేలు మరియు కింగ్ జేమ్స్ V యొక్క పాదాల వద్ద బోధించబడిందని భావించేలా చేస్తుంది. గత పద్దెనిమిదేళ్లలో వారికి పిచ్చి ఆలోచనే రాలేదని మీరు విశ్వసిస్తున్నారు . . . . కానీ చాటింపు వేసుకునే వారి నోటి నుండి బయటకు వచ్చేదానికి మరియు మీ బుర్ర ఎక్కడ పెట్టారో అనేదానికి మధ్య పెద్ద అగాధం ఉందని కూడా మీరు నిశ్శబ్దంగా తెలుసుకుంటారు. యేసు ఇలా చెప్పాడు: మీరు మీ తండ్రితో మాట్లాడేటప్పుడు బహిరంగముగా ప్రదర్శించవద్దు.
మత్తయి 6:16 “మీరు ఉపవాసము చేయునప్పుడు” ఏమి చేయాలో దాని గురించి మాట్లాడుతుంది. బహిరంగ ప్రదర్శన చేసేవారు నమ్మకంగా చేస్తున్నట్లు చూపించే సమయం ఇదే. అతను అదే రోజు మధ్యాహ్నం సహారాను దాటడం ముగించిన ఎవరో విచిత్రవ్యక్తిగా ఆకలితో మరియు అలసిపోయినట్లు కనిపించాలనే ఆశతో, వినయంగా మరియు విచారంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ సమయానికి మించి పనిచేస్తాడు. “వేషధారులవలె యుండకుడి!” అని క్రీస్తు ఆజ్ఞాపించుచున్నాడు. బదులుగా, మనం తాజాగా, శుభ్రంగా మరియు పూర్తిగా సహజంగా కనిపించాలి మరియు వినిపించాలి. ఎందుకు? ఎందుకంటే అదే వాస్తవమైనది-అదే నిజమైనది-దానికే ఆయన ప్రతిఫలమిస్తానని వాగ్దానం చేస్తాడు. యేసు ఇలా అంటున్నాడు: మీరు రెండు మూడుసార్లు భోజనం చేయకపోతే దానిగురించి చాటింపు వేయవద్దు.
మనం ఎదుర్కొందాము. యేసు పరిసయ్యులను గూర్చి కఠోరమైన మాటలతో మాట్లాడాడు. ఇరుకైన శాస్త్రవాదం లేదా స్వనీతిని ప్రదర్శించే విషయానికి వస్తే, మన ప్రభువు వ్యతిరేకించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇతర వ్యక్తులను అసహ్యంగా మరియు తృణీకరించే విధంగా ప్రార్థనా స్థలంలోనే తిరిగే వ్యక్తులతో వ్యవహరించడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన కనుగొన్నాడు. ఏడుసార్లకు తక్కువ కాకుండా ఆయన “అయ్యో” అని ప్రకటించాడు-ఎందుకంటే దురదృష్టవశాత్తూ, పరిసయ్యుడు అర్థం చేసుకునే భాష అదే.
రెండు చివరి వ్యాఖ్యలు:
మొదటిది . . . మీరు ఏ రూపంలోనైనా పరిసయ్యుల సిద్ధాంతం వైపు మొగ్గు చూపితే, దాన్ని ఆపండి! మీరు ఇతరులను వేధించడానికి ప్రయత్నించే మరియు ఇతరులను చిన్నచూపు చూసే వ్యక్తి అయితే (దేవుడు మిమ్మల్ని తన జట్టులో కలిగి ఉండడానికి ఎంతగానో ఆకర్షితుడైయ్యాడని ఆలోచిస్తున్నట్లైతే) మీరు ఇరవై ఒకటవ శతాబ్దపు పరిసయ్యులే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పొడవాటి జుట్టును ధరించి మరియు పైప్ ఆర్గాన్ కంటే గిటార్‌ని ఇష్టపడే కొందరు ఇందులో ఉన్నారు. పరిసయ్యులు కూడా “నెమ్మదిగా” కనిపించడంలో ఆనందపడవచ్చు.
రెండవది . . . ఒక ఆధునిక పరిసయ్యుడు మీ జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే, అతన్ని ఆపండి! ఆమెను ఆపండి! మీ కంటిలోని నలుసు మీకు మరియు మీ ప్రభువుకు మధ్య ఉందని మరియు అతని స్వంత కంటిలోని దూలముపై దృష్టి పెట్టాలని మతపరమైన మోసగానికి గుర్తు చేయండి. అయితే, ఒక వ్యక్తికి ఒకసారి వ్యాధి సోకిన తర్వాత, అతను తన స్వంత అహంకారపు ముళ్లచేత ఉక్కిరిబిక్కిరి అయిన తన మిగిలిన నిస్సార జీవితం తప్పులెంచడంతోను మరియు స్వీయ-పొగడ్తలతోను వెళ్ళబుచ్చే అవకాశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, పరిసయ్యులు, వినడం చాలా కష్టం.
Adapted from Charles R. Swindoll, “Pharisaism,” in Devotions for Growing Strong in the Seasons of Life (Grand Rapids: Zondervan, 1983), 390-93.