అనవసరంగా విద్యావిషయకంగా మారకుండా, నేను తర్కించుచున్న పదాన్ని నిర్వచించాలనుకుంటున్నాను. క్రైస్తవునికి స్వేచ్ఛ ఉందని నేను ప్రకటించడంలో నా ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్యంగా, స్వేచ్ఛ అంటే స్వాతంత్ర్యము . . . ఏదోయొకదాని నుండి స్వాతంత్ర్యము మరియు ఏదైనా చేయడానికి స్వాతంత్ర్యము.
స్వేచ్ఛ అంటే బానిసత్వం లేదా దాసత్వం నుండి విముక్తి. ఇది ప్రధమంగా పాపం యొక్క శక్తి మరియు అపరాధం నుండి విమోచనము. దేవుని ఉగ్రత నుండి విముక్తి. సాతాను మరియు దయ్యముల సంబంధమైన అధికారం నుండి విముక్తి. అంతే ముఖ్యమైనది ఏమిటంటే, నన్ను సులభంగా బంధించగల సిగ్గు నుండి విముక్తి, అలాగే ఇతరుల అభిప్రాయాలు, బాధ్యతలు మరియు అంచనాల నిరంకుశత్వము నుండి విముక్తియే ఈ స్వేచ్ఛ.
క్రీస్తు లేని నా జీవితంలో నాలోని కోరికలు మరియు ప్రేరేపణల నుండి నాకు స్వాతంత్ర్యములేని సమయం ఉండేది. నేను నా యజమానుడైన సాతాను శక్తి క్రింద ఉన్నాను మరియు పాపం నా జీవనశైలిగా ఉండేది. నాలో కోరికలు పెరిగినప్పుడు, నన్ను నేను అదుపులో ఉంచుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, నన్ను నిరోధించేది ఏదీ లేదు. ఇది భయంకరమైన బానిసత్వము.
ఉదాహరణకు, నా వ్యక్తిగత జీవితంలో నేను చాలా దుర్భరమైన సంవత్సరాలు అసూయ చేత నడిపించబడ్డాను. అది దహించివేసింది. నేను దాదాపుగా బానిస యజమానుని సేవించినట్లుగా సేవ చేశాను. దేవుని మనోహరమైన దయచేత నేను ఆత్మీయంగా మేల్కొన్న ఒక రోజు వచ్చింది మరియు అది పూర్తిగా నియంత్రించడానికి అనుమతించాను, మరియు నేను గ్రహించేలోపు అసూయ చనిపోయింది. మరియు నేను మొదటిసారిగా, బహుశా నా జీవితం మొత్తంలో, నిజమైన ప్రేమను గ్రహించాను; ఏదియేమైనా నన్ను ప్రేమించుచు, తన జీవితమంతా నాపట్ల నమ్మకంగా ఉండటానికి సమర్పించుకున్న నమ్మకమైన భార్య యొక్క దయ ద్వారా వచ్చిన ఆనందం, శృంగారం, సహజత్వం, స్వేచ్ఛగా ప్రవహించే సృజనాత్మకతను గ్రహించాను. ఆ ప్రేమ మరియు ఆ నిబద్ధత గతంలో కంటే స్వేచ్ఛగా ప్రేమించేలా నన్ను ప్రేరేపించాయి. నేను ఆమెను కోల్పోతాననే భయంతో నేను ఇకపై ప్రేమించలేదు, కానీ బేషరతుగా మరియు నిర్బంధం లేకుండా ప్రేమించబడటంతో సంబంధం కలిగియున్న సంతోషం మరియు ఆశీర్వాదము వలన నేను ప్రేమించాను.
ఇప్పుడు క్రీస్తు నా జీవితంలోకి వచ్చాడు మరియు నేను ఆయన కృపకు మేల్కొన్నాను గనుక, ఆయన అటువంటి పాపము యొక్క బానిసత్వం నుండి స్వాతంత్ర్యమును అందించాడు. మరియు దానితో పాటుగా ఒక నిర్భయతను, కష్టాల సమక్షంలో దాదాపుగా అజేయమైన అనుభూతిని కలిగించే స్వాతంత్ర్యము వస్తుంది. ఈ శక్తి, గుర్తుంచుకోండి, నాలో నివసించే క్రీస్తు వల్లనే వచ్చింది.
అలాగే, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి కూడా అద్భుతమైన స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. దేవుడు మరియు/లేదా ఇతరులను ప్రసన్నం చేసుకోవడానికి దాని నిరంతర డిమాండ్ల నుండి స్వాతంత్ర్యము వచ్చిందని నా ఉద్దేశ్యం. ఇది దేవుని ముందు నిందారోపణ యొక్క భయం నుండి అలాగే నిందించు మనస్సాక్షి నుండి స్వాతంత్ర్యము. ఇది చేయాలి అది చేయాలి అని చెప్పే సమాజము నుండి, ఇతర ప్రజల డిమాండ్ల నుండి స్వాతంత్ర్యము.
అలాంటి స్వాతంత్ర్యం ప్రేరేపించబడింది--నిర్బంధంలేని ప్రేమ ద్వారా ప్రేరేపించబడింది. మీ జీవితంలో క్రీస్తు కృప పూర్తిగా మేల్కొన్నప్పుడు, మీరు ఇకపై భయం వల్ల లేదా సిగ్గుతో లేదా అపరాధం కారణంగా ఏదీ చేయరు, కానీ మీరు దానిని ప్రేమతో చేస్తారు. ఒకరిని సంతోషపెట్టడం కోసం ప్రదర్శించే భయంకరమైన నిరంకుశత్వము ముగిసింది . . . ఎప్పటికీ.
కృప ఏదోయొకటి చేయడానికి కూడా స్వాతంత్ర్యమును ఇస్తుంది-హక్కులను ఆస్వాదిస్తూ బానిసత్వం నుండి బయటపడే స్వాతంత్ర్యము అలాగే ఇతరులకు అలాంటి స్వాతంత్ర్యమును అనుమతించడం చేస్తుంది. క్రీస్తు మాత్రమే తీసుకురాగల క్రొత్త రకమైన శక్తిని అనుభవించడానికి మరియు ఆస్వాదించడానికి ఇది స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ఆయన ఇతరులను ఎలా నడిపిస్తున్నాడనే దానితో సంబంధం లేకుండా, నేను ఎలా ఉండాలనేది ఆయన ఉద్దేశమో అలా మారటమే ఈ స్వాతంత్ర్యము. నేను నేనుగా ఉండవచ్చు–పూర్తిగా మరియు స్వేచ్ఛగా. ఆయనను స్వతంత్ర మరియు వ్యక్తిగత విధానంలో తెలుసుకునే స్వాతంత్ర్యము ఇది. వారు ఎవరై ఉండాలని ఉద్దేశించబడ్డారో , అలా ఉండుటకు ఈ స్వాతంత్ర్యము ఇతరులకు ఇవ్వబడుతుంది-నాకు భిన్నముగా!
చూడండి, దేవుడు ప్రపంచవ్యాప్తంగా మనమందరం ఒకేలా ఆలోచిస్తూ మరియు ఒకేలా కనిపిస్తూ మరియు ఒకేలా మాట్లాడుచూ మరియు ఒకేలా వ్యవహరిస్తూ ఒకేలా ఉండే క్రైస్తవులను ముద్రించడంలేదు. శరీరం వైవిధ్యంగా ఉంటుంది. మనము ఎప్పుడూ ఒకే స్వభావాన్ని కలిగి ఉండాలని మరియు ఒకే పదజాలం ఉపయోగించాలని మరియు అదే తియ్యని చిరునవ్వు చిందించాలని మరియు అదే విధంగా దుస్తులు ధరించాలని మరియు ఒకే పరిచర్యను కొనసాగించాలని ఉద్దేశించబడలేదు. నేను మరలా చెప్పుచున్నాను: దేవుడు వైవిధ్యంతో సంతోషిస్తాడు. మనం ఎవరై ఉండాలనుకుంటున్నామో ఆ స్వాతంత్ర్యము చాలా అద్భుతమైనది. ఇది నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం, ఆయన చిత్తాన్ని తెలుసుకునే స్వాతంత్ర్యం, దానిలో నడిచే స్వాతంత్ర్యం, నా జీవితంలో నేను మరియు మీ జీవితంలో మీరు ఆయన నడిపింపుకు లోబడే స్వాతంత్ర్యం. మీరు అలాంటి స్వాతంత్ర్యమును రుచి చూచిన తర్వాత, మరేదీ సంతృప్తిని ఇవ్వదు.
బహుశా మీరు స్వేచ్ఛ కొరకు పోరాడాలని నేను పునరుద్ఘాటించాలి. ఎందుకు? క్రైస్తవ నాయకత్వంలో ఒకరినొకరు పోల్చుకుంటూ మీరు వారిలాగే దయనీయంగా మారునట్లుగా మిమ్మల్ని నియంత్రించడానికి మరియు మోసపుచ్చడానికి ఇష్టపడేవారితో నిండియున్నది. ఏది ఏమైనా, వారు “ఇరుకుగా, నిబ్బరంగా, నీరసంగా మరియు నిర్లక్ష్యంగా” ఉండాలని నిశ్చయించుకుంటే, మీరు కూడా ఆ విధంగా ఉండాలని వారు ఆశిస్తారు. వారు దానిని ఒప్పుకొననప్పటికీ, “దుర్దశ తోడును ఇష్టపడుతుంది” అనేది ఆచార క్రైస్తవుల అవ్యక్త నినాదం.
Adapted by permission. The Grace Awakening Devotional, Charles R. Swindoll, © 2003, Thomas Nelson, Inc., Nashville, Tennessee. All rights reserved. Copying or using this material without written permission from the publisher is strictly prohibited and in direct violation of copyright law.