యేసు పుట్టుక గురించి మీకు ఏమైనా కొంచెం తెలిస్తే, దాన్ని మరచిపోయి మొదటి నుండి ప్రారంభించడం మీకు మంచిది.
క్రిస్మస్ కథ శతాబ్దాలుగా చాలా శుభ్రపరచబడింది మరియు శృంగారభరితం చేయబడింది. హాలీవుడ్ కూడా విసుగు పుట్టించే విధంగా చూపించిందే చూపించి-యేసు రాకను చుట్టుముట్టిన ధైర్యముతో కూడిన కరుణారసమును బంధించడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది. నిజం చెప్పాలంటే, కొన్ని సంఘాలు కూడా ఏటా మన రక్షకుడి పుట్టుకను ఆదర్శవంతంగా మార్చేసాయి. అయితే అది ఏదైనా కావచ్చు గాని ఆదర్శవంతం మాత్రం కాదు.
అవశ్యముగా, క్రీ.పూ.6వ సంవత్సరం యూదాలో నివసించడానికి ఒక నీచమైన సమయం. హేరోదు ది గ్రేట్ ఇశ్రాయేలు సింహాసనాన్ని నెత్తుటి కుట్ర ద్వారా మరియు రోమా నుండి రాజకీయ మద్దతుతో స్వాధీనం చేసుకున్నాడు. ఒకసారి, అధికారంలోకి వచ్చినప్పుడు, అతను దొంగిలించిన “యూదుల రాజు” అనే బిరుదును జాగ్రత్తగా కాపాడుకున్నాడు. రాజకీయంగా తనకు ఎవరైనా ప్రధానమైన ముప్పు అవుతారేమోనని భావించినప్పుడు అతను తన సొంత కుమారులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఐదవ శతాబ్దపు రచయిత మాక్రోబియస్ ఇలా రికార్డ్ చేశాడు, “యూదుల రాజు హేరోదు సిరియాలో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలను చంపమని ఆదేశించాడని మరియు చంపబడిన వారిలో రాజు కుమారుడు కూడా ఉన్నాడని [కైసరు ఔగుస్తు] విన్నప్పుడు ‘నేను హేరోదు కొడుకు కంటే హేరోదు పందిని అవుతాను!’ అని అన్నాడు.”1
కైసరు యొక్క వ్యాఖ్య ఇశ్రాయేలు పరిస్థితి యొక్క విచారకరమైన వక్రోక్తిని వివరించింది. హేరోదు, నిజంగా యూదుడు కాకపోయినా, పంది మాంసంను తన ఆహారం నుండి తొలగించడం ద్వారా మంచి భక్తిగల యూదుడిగా నటించాడు, కాని అతను అధికారం కోసం తీరని ఆకలిని కలిగి ఉన్నాడు. అతను ఇశ్రాయేలు దేవుడి కోసం ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు-ఆ రోజులో అది ఒక అద్భుతమైన నిర్మాణం-మరియు దాని పరిపాలనను ఒక అవినీతిపరుడైన ప్రధాన యాజకుని తరువాత మరొకరికి యిస్తూ వచ్చాడు. అతను పాత నిబంధన ధర్మశాస్త్రానికి అనుగుణంగా యూదులకు ఆలయం ద్వారా పన్ను విధించాడు మరియు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి ఆజ్ఞను అతిక్రమించడానికి ఉపయోగించి, చక్రవర్తి మరియు అతని రోమా దేవతల గౌరవార్థం నగరాలు మరియు దేవాలయాలను నిర్మించాడు.
పెద్ద రోమా సామ్రాజ్యం-పశ్చిమాన అట్లాంటిక్ సరిహద్దుగా ఉంది. . . తూర్పున యూఫ్రటీసు చేత. . . ఉత్తరాన రైన్ మరియు డానుబే చేత. . . మరియు దక్షిణాన సహారా ఎడారి చేత-ఇది బాగా విస్తరించి దుర్మార్గంగా ఉంది. రాజకీయ కుట్ర, జాతి ఉద్రిక్తత, పెరిగిన అనైతికత మరియు అపారమైన సైనిక శక్తి ప్రతి ఒక్కరి దృష్టిని మరియు సంభాషణను నియంత్రించుచున్నది. రోమా పాదాల క్రింద యూదయ చితుకద్రొక్కబడి ఉనికిలో ఉంది. ఇది ధనవంతులకు అపూర్వమైన ఆర్థిక మరియు రాజకీయ పురోగతికి సమయం మరియు మిగతావారికి భయంకరమైన అణచివేతకు సమయం. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నాటికి, ఆశ యొక్క కిరణాన్ని అడ్డుకొని, ఇశ్రాయేలు మీద ఒక చీకటి మేఘం నివాసం ఏర్పరచుకుంది.
మొదటి క్రిస్మస్, పన్నులు మరింత పెంచడానికి ఒక కొలతను నిర్ణయించడానికి ఒక జనాభా గణనను కోరిన విరక్త కైసరు-అన్ని కళ్ళు ఔగుస్తు వైపే ఉన్నాయి. ఆ సమయంలో, నజరేతు నుండి దక్షిణాన 80 మైళ్ల యాత్ర చేసే యువ జంటపై ఎవరు ఆసక్తి చూపుతారు? రోమాలో కైసరు తీసుకున్న నిర్ణయాల కంటే . . . లేదా యూదయలో అతని తోలుబొమ్మ హేరోదు శాసనాల కంటే ముఖ్యమైనవి ఏమిటి? బేత్లెహేము పశువుల పాకలో జన్మించిన యూదు శిశువు గురించి ఎవరు పట్టించుకున్నారు?
దేవుడు పట్టించుకున్నాడు. క్రొత్త నిబంధన మనకు గుర్తుచేసినట్లుగా:
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. గలతీయులకు 4:4–5
అది గ్రహించకుండా, శక్తివంతమైన ఔగుస్తు “కాలము యొక్క పరిపూర్ణత” ప్రారంభానికి ఒక పని అబ్బాయి మాత్రమే. అతను దేవుని చేతిలో పావు . . . ప్రవచనం యొక్క పేజీలలో కేవలం మెత్తటి దూది. రోమా చరిత్ర సృష్టించడంలో బిజీగా ఉండగా, దేవుడు వేంచేశాడు. ఆయన తన మాంసపు గుడారాన్ని గడ్డి మీద . . . ఒక తొట్టిలో . . . ఒక నక్షత్రం క్రింద నిశ్శబ్దంగా వేసాడు. ప్రపంచం కనీసం గమనించలేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ . . . హేరోదు ది గ్రేట్ . . . మరియు ఔగుస్తు ది గ్రేట్ యొక్క నేపథ్యం నుండి మేలుకొంటున్నప్పుడు, ప్రపంచం బిడ్డయైన యేసును పట్టించుకోలేదు.
ఇది ఇప్పటికీ అలానే చేస్తున్నది.
యేసు రోజుల్లో ఉన్నట్లుగా, మన కాలాలు నిరాశాపూర్వకముగా ఉన్నాయి. అంతేకాక, అవి తరచుగా ముఖ్యాంశం నుండి ధ్యానభంగం చేస్తాయి. మొదటి శతాబ్దం యొక్క రాజకీయ, ఆర్థిక మరియు ఆత్మీయ సంక్షోభాలు “కాలం యొక్క పరిపూర్ణత” సంభవించడానికి వేదికను ఏర్పాటు చేసినట్లే . . . ఈ రోజు, మన స్వంత క్రూరమైన కాలంలో, మన దేవుడు తన దైవిక చిత్తాన్ని నెరవేర్చడానికి తన సార్వభౌమ వస్త్రాలను నేస్తున్నాడు. ఖచ్చితంగా కష్టకాలాల్లో ఉన్నాము-కానీ అవి ఎప్పుడూ దేవుణ్ణి ఆశ్చర్యపరచవు. ఆయన ఇప్పటికీ సార్వభౌమాధికారే. ఆయన ఇప్పటికీ సింహాసనంపై ఉన్నాడు. కీర్తనాకారుడు మనకు గుర్తుచేస్తున్నట్లుగా: “మా దేవుడు ఆకాశమందున్నాడు; / తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయనచేయుచున్నాడు” (కీర్తన 115:3).
నా 50 సంవత్సరాల పరిచర్యలో, మన తరాన్ని దేవుని వాక్యము వైపు నడిపించడానికి నేను ఈ రోజు కంటే ఎక్కువగా ఎప్పుడూ యింత నిబద్ధతతో లేను. ఈ క్లిష్ట దినాల్లో ఇది బలమునకు మరియు దైవిక దిశకు ఏకైక మూలముగా మిగిలిపోతుంది. నేను చేయగలిగినప్పుడల్లా, పాస్టర్లను మరియు పరిచర్యలోని నాయకులను తమను తాము లేఖనాల నుండి ఆచరణాత్మక, విశదపరచే ఉపదేశమును మరియు బోధనను చేయుమని సవాలు చేస్తున్నాను. అదే ఆవశ్యకతతో, సువార్త, బైబిలు అధ్యయనం మరియు దేవుని వాక్యాన్ని కంఠత చేయడం ద్వారా మీ కుటుంబం మరియు పొరుగువారి ముందు దేవుని వాక్యము యొక్క సత్యాన్ని దేవుడు మిమ్మల్ని ఉంచిన చోట జీవించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
ఈ కష్టతరమైన రోజుల గురించి ఆందోళన చెందుతున్నారా? నేను అర్థం చేసుకున్నాను, యేసు కూడా చేసుకుంటాడు. యేసు జన్మించినప్పుడు కాలాలు భిన్నంగా ఏమీ లేవు. ఒక కారణం లేదా మరొక కారణంతో ఈ సంవత్సరం చాలా జీవితాలు తలక్రిందులుగా చేయబడినందున, మరియ చేసినట్లే-దేవుడు వారి జీవితాల్లో ఏమి చేస్తున్నాడనే దానిపై-ఒక ప్రత్యేక సందేశం లేదా ముఖ్యమైన సత్యం మీద ప్రతిబింబించాలని మన పాఠకులను మరియు శ్రోతలను ప్రోత్సహిస్తున్నాము. ఈ ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి క్రిస్మస్ మంచి సమయం: నేను నా జీవితానికి కేంద్రంగా యేసుపై దృష్టి పెడతానా మరియు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయనను పట్టుకొని ఉంటానా? స్నెడెకర్స్ గ్రహించినది ఇదే: “దేవుని మహిమ చెవిటి, వికలాంగుల మరియు చట్టబద్దమైన అంధ దేవదూతల ద్వారా ప్రకాశిస్తుంది, మరియు ఆయన ఈ ప్రత్యేక వ్యక్తులను మనకు ఇచ్చాడు గనుక మనం ఆయన మహిమను చూడవచ్చు.”
రాజకీయ అవినీతి. . . మతపరమైన రాజీ. . . ఆర్థిక సంక్షోభాలు-ఇవి ఎల్లప్పుడూ మొదటి పేజీలో ఉంటాయి. కానీ మన దేవుడు సింహాసనంపై ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి.మన జీవితాలలో . . . మరియు మన ప్రపంచంలో తన పెద్ద మరియు మంచి ప్రయోజనాలను నెరవేర్చడానికి మన నిరాశాపూర్వక సమయాన్ని ఉపయోగించుకుంటాడని వాగ్దానం చేశాడు.
- Macrobius, The Saturnalia, trans. Percival Vaughan Davies (New York: Columbia University Press, 1969), 171.
Copyright © 2009 by Charles R. Swindoll, Inc.