చాలా కాలం క్రితం జంతువులు నిద్రిస్తున్న నిశ్శబ్దమైన, మురికి ప్రదేశంలో, మరియ తన మొదటి బిడ్డ యొక్క మృదువైన, మానవ చర్మాన్ని స్పృశిస్తూ జన్మనిచ్చింది. ఈ మానవత్వపు దృశ్యమును దగ్గరగా పరిశీలించుటకు మనలను అది తగిన విధముగా కట్టిపడేస్తుంది.
ఇటువంటి ఆదరించని లోకములోనికి దేవుని కుమారుడు నిశ్శబ్దంగా రావడం గురించి యోసేపు యొక్క గందరగోళంతో, మరియ యొక్క ఆశ్చర్యంతో, మరియు గొర్రెల కాపరుల యొక్క ఆశ్చర్యంతో మనం తాదాత్మ్యం చెందగలము. ఆ ఆలోచనలన్నీ ఆలోచించటానికి అద్భుతమైనవే. కానీ మనము అక్కడితో ఆగిపోలేము. ఇవి చాలా లోతుగా, చాలా ముఖ్యమైన అద్భుతాలకు పరిచయం మాత్రమే. సృష్టి కంటే పాతదియైన ఒక వేదాంత సత్యం యొక్క రూపము ఈ అందమైన కథ యొక్క మృదువైన, క్రొత్తగా జన్మించిన చర్మము క్రింద ఉన్నది: సమయం ఆరంభం కావటానికి చాలా కాలం ముందే దేవుడు రక్షకుడిని పంపాలని ప్రణాళిక వేశాడు.
ప్రధానముగా, క్రిస్మస్ అనేది రక్షకుడిని మరియు రాజును అందించడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం యొక్క వేడుక. ఆ వ్యక్తి అద్భుతంగా గర్భములో పడి, మానవ శరీరాన్ని ధరించి, మన స్థానంలో చనిపోయేలా మన మధ్య జీవించిన దైవమానవుడును, ఆయన కుమారుడునైన యేసే.
మానవ శరీరాన్ని దాల్చిన దేవుని కుమారుని యొక్క కథను చెప్పడంలో, శిష్యుడైన మత్తయి ఈ విధంగా వ్యక్తీకరించాడు:
ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. (మత్తయి 1:20–23)
రక్షకుడిని పంపుతానని దేవుడు ఇచ్చిన వాగ్దానం మొట్టమొదటిగా మనకు రక్షకుడి అవసరం ఉందనే కారణాన్ని గుర్తు చేస్తుంది. మూలపురుషుడైన ఆదాము ఏదెను వనములో అవిధేయత కారణంగా మానవాళి మొత్తాన్ని పాపంలో పడవేసినప్పుడు, చెడు మానవాళి యొక్క రక్తప్రవాహంలోకి ప్రవేశించి, అందులో నివసించే వారందరినీ కలుషితం చేసింది. మన పాపమును అతని పాపముతో చేర్చడం ద్వారా మనలో ప్రతి ఒక్కరూ ఆదాము యొక్క విషాదకరమైన కోరికను ఆమోదించాము. ఫలితంగా ప్రపంచం ఊహించదగిన ప్రతి రీతిలో బాధకు లోనయ్యింది: ఆకలి, దాహం, దుఃఖం, అలసట, శోధన, వ్యాధి, దురభిమానం, విచారము . . . అంతిమ చెడు అయిన మరణముతో ముగియకపోతే ఈ జాబితా అంతులేనిదిగా ఉండిపోతుంది. ఇది, మనం జీవిస్తున్న ప్రపంచం.
ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన జీవితంలో ఇటువంటి అస్పష్టమైన పరిస్థితుల దృష్ట్యా, ఈ క్రింది ప్రశ్నకు ఆశ్చర్యపోవటం పెద్ద విషయమేమీ కాదు: మంచి దేవుడు చెడు కొనసాగుటకు ఎలా అనుమతించగలడు? ఆశ్చర్యకరమైన సమాధానం: ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. నిషేధించబడిన చెట్టు యొక్క ఫలం ఆదాము కడుపులో జీర్ణమయ్యే ముందే ఆయన అన్ని చెడులను అంతం చేసియుండవచ్చు. దేవుడు అంతం చేయాలని మనం కోరుకునే ఆ చెడు నిన్ను నన్ను కలిగియున్నదని మనం మరచిపోకూడదు. మనమే తీసుకువచ్చాము, అలాగే మనపై మరియు ప్రపంచంపై చెడును తెస్తూనే ఉన్నాము మరియు ఆయన సృష్టి పట్ల మనం చేసిన వక్రీకృత మరియు చిక్కుబడ్డ గందరగోళాన్ని అనుభవించడానికి మనల్ని ఖండించడానికి ఆయన పూర్తిగా సమర్థించబడతాడు. కానీ . . . ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనపట్ల ఓపిక కలిగియున్నాడు. ఎందుకు? అపొస్తలుడైన పేతురు మనకు ఇలా చెబుతున్నాడు: “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని ఆయన కోరుచున్నాడు” (2 పేతురు 3:9).
ఒక మానవుడు (ఆదాము) మానవాళిని తిరుగుబాటులోకి ఏలాగు నడిపించెనో, మరొక మానవుడు (యేసు) మనలను దేవునితో సమాధానపరచాలి. పాపం వల్ల వచ్చు మరణశిక్షకు అర్హులు కానివారు మనలో ఎవరున్నారు? పాపము చేయని ఒక వ్యక్తిని కనుగొనగలిగితే, నీవు నేను అర్హమైన మరణమును తాను పొంది పునరుత్థానుడై తద్వారా అతను మనకు ప్రాతినిధ్యం వహించుటకు ఏ మానవుడు శక్తి కలిగి ఉన్నాడు? సమాధానం స్పష్టంగా ఉంది: దేవుడుగా కూడా ఉన్న మానవుడు మాత్రమే అలా చేయగలడు!
రెండువేల సంవత్సరాల క్రితం ఒక చిన్న, గరుకైన బేత్లెహేము పశువుల పాకలో కుమారుడైన దేవుడు ఇమ్మానుయేలు, “దేవుడు మనకు తోడు” అయ్యాడు- దేవుడు మానవ శరీరమెత్తాడు. ఆయన మనము జీవించినట్లుగా జీవించాడు, మనం బాధపడుతున్నట్లుగా బాధపడ్డాడు, మనం చనిపోవునట్లుగా చనిపోయాడు, అయినను పాపము లేనివాడుగా ఉన్నాడు. మరియు ఆయన, దైవమానవుడు అయినందున, మనకు నిత్యజీవము ఇవ్వడానికి మరణం యొక్క శక్తిని జయించాడు.
“అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” (ఫిలిప్పీయులకు 2:9–11) అని యేసును గురించి తప్ప యింకెవరి గూర్చి వ్రాయబడింది? యేసు చేసినట్లుగా బ్రతికియున్నవారు గాని లేదా చనిపోయినవారుగాని ఎవ్వరూ మానవ హృదయాన్ని మరియు మనస్సును రూపాంతరము చేయలేదు లేదా చరిత్రను మార్చలేదు. అంతకుముందు మరియు ఆ తరువాత సాధించడంలో ఎంతోమంది విఫలమైన వాటిని ఆయన ఎలా సాధించగలిగాడు? సమాధానం సరళమైనది మరియు లోతైనది: మనం ఆయనవలె ఉండటానికి మానవ శరీరము దాల్చుటయను అద్భుతము ద్వారా దేవుడు మన రూపమెత్తాడు.
మీరు మొదటి క్రిస్మస్ యొక్క మానవత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, నెమ్మదిగా నడవడానికి మరియు లోతుగా ఆలోచించడానికి ఇది ఆహ్వానం అని గుర్తుంచుకోండి. మీ ఊహతో దైవమానవుని యొక్క శిశు చర్మాన్ని తాకాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గొర్రెల కాపరులు ఆశ్చర్యపోయినట్లు ఆశ్చర్యపోవాలని మరియు జ్ఞానులు చేసినట్లుగా ఆరాధించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరియ మరియు యోసేపు చూసినట్లే, ఒక పరిమిత శిశువు శరీరంలో అనంతమైన దేవుడిని ఊహించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మన దేవుడు మానవ శరీరమెత్తడానికి మీరు నేను కారణమై ఉన్నాము. మనకు లభించిన ఉత్తమ బహుమతి ఆ మొదటి క్రిస్మస్ రోజున వచ్చింది – మనకు . . . తండ్రి అయిన దేవుని నుండి ఒక వ్యక్తిలో అందించబడింది.
“చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము” (2 కొరింథీయులకు 9:15).
Taken from A Promise Kept, 3 Years with Jesus. Copyright © 2010, Insight for Living.