దేవుని విధానాలు తరచుగా ఆశ్చర్యకరమైనవిగా ఉంటాయి. అహాబు మరియు యెజెబెలులను నాశనం చేయడానికి దేవుడు సైన్యాన్ని లేవనెత్తలేదు (1 రాజులు 16:29-34). తన వ్యాజ్యమును వాదించడానికి లేదా వారి రాజ్యసంబంధమైన ఘనులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఆయన ఎవరోయొక ప్రకాశమానమైన యువరాజును కూడా పంపలేదు. బదులుగా, ఊహించలేనిది దేవుడు చేసాడు-ఆయన ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే . . . చక్కగా, ఏలీయా లాంటివానిని ఎన్నుకున్నాడు (1 రాజులు 17:1).
ఆ స్వల్పకాలిక పని యొక్క బాధ్యత కోసం వేరొకరు సరైన అర్హత గలవారని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఆ నాయకత్వ శిక్షణ సమూహం కోసం? ఆ సమాజ సేవ కోసం?
దేవుని సేవలో మీ సహకారం గుర్తుంచుకోదగినదిగా లేదని భావించే భార్య మరియు గృహస్థులా మీరు? ఇతర వ్యక్తులను ప్రత్యేకంగా లేదా పిలువబడినట్లుగా లేదా ప్రతిభావంతులుగా మీరు చూస్తున్నారా?
మీ ముందు ఉన్న అవకాశాన్ని మీరు కోల్పోతుండవచ్చు. మీరు పరిచర్య నడుమ ఉండవచ్చు మరియు దానిని గ్రహించకుండా కూడా ఉండియుండవచ్చు. (ఉదాహరణకు, నమ్మకమైన భార్య మరియు ప్రేమగల తల్లి కంటే గొప్ప పరిచర్య ఏముంటుంది?) మీ పరిచర్య కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అయ్యి ఉండవచ్చు. దాన్ని తేలికగా తీసిపారవేయవద్దు. దేవుని విధానాలు తరచుగా ఆశ్చర్యకరమైనవిగా ఉంటాయి.
మనము మన ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు, తుదకు, మనం దేవుని యెదుట నిలబడుచున్నాము. పిలుపు వచ్చినప్పుడు, ఆయన కొరకు నిలువబడుటకు మనం సిద్ధంగా మరియు ఇష్టపూర్వకముగా ఉన్నట్లు దేవుడు కనుగొనునా? ఆయనకు పూర్తిగా సమర్పించబడిన హృదయాలను ఆయన మనలో కనుగొనునా? ఆయన ఈ విధంగా చెప్పగలడా, “ఆహ్, అవును, పూర్తిగా నాకు సంబంధించిన హృదయం అక్కడ ఉంది. అవును, అహాబుతో ఆ జీవితాన్ని ఉపయోగించడానికి నాకు తగినంత సమర్పణ అక్కడ కనబడుచున్నది. నేను వెతుకుతున్న క్రమశిక్షణ కలిగిన భక్తి అలా ఉండాలి.”
మీరు జీవితంలో ఏ పాత్రను పోషించినా, నిజం కోసం ఒంటరిగా నిలబడే విషయంలో మీరు ముఖ్యముకానివారు కాదు.
దేవుడు మీకు ఏ స్థానాన్ని ఇచ్చాడు? ఏది ఏమైనా, దేవుడు ఇలా అంటున్నాడు, “నువ్వు నా ముందు నిలబడ్డావు, నేను నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుత కాలమందు, ప్రస్తుత సమయంలో నేను మిమ్మల్ని నా ఏకైక ప్రతినిధిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను.”
ఏలీయా, ఈ గంభీరమైన, కఠినమైన వ్యక్తి ఎక్కడనుండో దూసుకువచ్చి, అకస్మాత్తుగా చరిత్ర పుటల్లోకి అడుగుపెట్టాడు, దేవునికి పూర్తిగా సమర్పించుకున్న ఒక జీవితం యొక్క విలువకు స్పష్టమైన సాక్షిగా ఉన్నాడు. మారుమూల ప్రదేశం నుండి ఒక అజ్ఞాత వ్యక్తి, అత్యంత అల్లకల్లోలంగా మరియు హింసాత్మకంగా మరియు క్షీణించిన సమయంలో చెడుకి వ్యతిరేకంగా నిలబడటానికి అతను పిలువబడ్డాడు.
చుట్టూ చూడండి. ఇంకా చాలా అవసరం ఉంది, దేవుడు ఇంకా వెదకుచున్నాడు.
Adapted from Charles R. Swindoll, “A Unique Spokesperson,” in Great Days with the Great Lives (Nashville: W Publishing, 2005), 154. Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.