తన కుమారుడైన యేసు స్వరూపములో మనలను రక్షించడానికి వచ్చుట ద్వారా దేవుని కృపను గూర్చి యోసేపు జీవితం అద్భుతంగా వర్ణించింది. దేవుడి నుండి దూరమవుతున్నామన్న భావన మరియు భయంకరమైన భయం కలిగియుండి, యోసేపు యొక్క అపరాధభావం కలిగిన సహోదరుల మాదిరిగా, చాలా మంది ఆయన దగ్గరకు వచ్చుచున్నారు, ఆయన ఎంతో సునాయాసంగా అద్భుతమైన దాతృత్వాన్ని మరియు దయను చూపించుచున్నాడు. నిందించబడటానికి బదులుగా, మనం క్షమించబడ్డాము. అపరాధులముగా ఎంచబడటానికి బదులుగా, మనం విడుదల పొందాము. మరియు మనం ఖచ్చితంగా అర్హమగు శిక్షను అనుభవించడానికి బదులుగా, మనము ఆయన బల్ల యొద్ద కూర్చుని, మనం ఎన్నడూ గ్రహించలేనంత పరిచర్యను అందుకుంటున్నాము.
కొంతమందికి ఇది చాలా అవాస్తవంగా అనిపించవచ్చు. అందుకే మనము మన విషయమై నిర్విరామంగా మనవి చేసుకుంటాము, అయితే ఆయన ఎంతో స్పష్టంగా మనతో దయతో మాట్లాడుచున్నాడు-మనకు శాంతిని అనుగ్రహిస్తానని మన భాషలోనే మనకు వాగ్దానం చేశాడు. మనము ఆయనతో బేరసారాలు చేయడం ద్వారా ఆయన కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము, మనం దోషిగా ఉన్న ఆ చెడు పనులన్నింటికీ మన కృషి మరియు నిజాయితీతో కూడిన ప్రయత్నాలు తిరిగి చెల్లించేస్తాయని అనుకుంటాము. కానీ ఆశ్చర్యకరముగా, మన ప్రయత్నాలు ప్రస్తావించాల్సినంత ముఖ్యమైనవని ఆయన ఎన్నడూ పరిగణించలేదు. మన అపరాధమును పోగొట్టుకొనుటకు మనం తగినంత సంపాదించాలని మన మనస్సులో ఉంది, అయితే మనం ఎన్నటికీ, ఎప్పటికీ తిరిగి చెల్లించలేనంత సమృద్ధితో మనలను నింపాలని ఆయన మనస్సులో ఉంది.
మనం చేసిన పాపాలను భరిస్తూ, ఈ క్రమంలో మనల్ని క్షమిస్తూ, సిలువ మీద క్రీస్తు యొక్క చిత్రం ఎంత అందమైనది. అటువంటి కృప అద్భుతమైనది కాదా? ఎవరైతే తృణీకరింపబడ్డాడో అదే వ్యక్తి మనల్ని ఆయనతో తిరిగి ఏకం చేయడానికి తాను చేయగలిగినదంతా చేశాడు.
కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యమువేయుచున్నాడు
మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు
యెహోవా న్యాయముతీర్చు దేవుడు
ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. (యెషయా 30:18)
మీరు ఆయన కొరకు ఆరాటపడుతున్నారా? నా దగ్గర అద్భుతమైన వార్త ఉన్నది! ఇంకా ఎంతో గొప్పగా, మీరు ఊహించినదానికంటే ఎంతో గొప్పగా-ఆయన మీపై దయ చూపాలని ఎంతో ఆశ కలిగియున్నాడు. మీరు వేటికొరకైతే ఆకలిగొనియున్నారో వాటన్నిటినీ ఆయన మీకు అందించుచున్నాడు. బల్ల నిండుగా ఉన్నది, ఆయన చిరునవ్వు చిందించుచున్నాడు, మీరు కూర్చుని మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సిద్ధపరచిన విందును మీరు ఆస్వాదించాలని ఆయన ఎదురుచూచుచున్నాడు. కూర్చోండి-కృప ఇవ్వబడుచున్నది.
Adapted from Charles R. Swindoll, “A Reflection of Christ,” in Great Days with the Great Lives (Nashville: W Publishing Group, 2005), 29. Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.