క్షమాపణ అనే విషయాన్ని నా మనసులోంచి బయటకు తీయలేకపోవుచున్నాను.
బహుశా మన ప్రపంచంలో చాలా క్షమించరానితనం ఒక కారణం కావచ్చు. హింస అనేది ఈ క్రింది ప్రతీకార సందేశంతో ముఖ్యాంశాలుగా మన వార్తల్లో ఉంటుంది: “నువ్వు నన్ను బాధపెట్టావు, కాబట్టి నేను నిన్ను బాధపెడతాను.”
విషాదకరమైనది, కాదా? సంఘర్షణకు నివారణ పొందతగినదే. అయినప్పటికీ ప్రజలు సమాధానపడటం కంటే పగను కలిగి ఉంటారు, క్షమించడం కంటే “పగతీర్చుకుంటారు.”
ఇది ప్రతి సంస్కృతిలోనూ వ్యాపించిన సమస్యే. ఒక అనుభవం గుర్తుకు వస్తుంది. నేను వేరే దేశంలో, నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఆ దేశానికి చెందిన వ్యక్తి నడుపుతున్న కారులో ప్రయాణిస్తున్నాను. మేము ప్రయాణిస్తున్నప్పుడు, అతను అసహ్యించుకునే జాతికి చెందిన ఒక వ్యక్తిపై దురభిప్రాయంతో దూషించడం నేను విన్నాను. ఆశ్చర్యపోయిన నేను, “మిమ్మల్ని నమ్మించునట్లుగా ఈ వ్యక్తులను క్షమించడానికి ఏమి జరగాలి?” అని అడిగాను.
అతను కోపంగా నా వైపు చూసి, “మా నిఘంటువులో క్షమాపణ అనే పదం కూడా లేదు.”
మీ ప్రపంచంలో క్షమాపణకు ఏ స్థానం ఉంది? క్షమించకపోవటం గురించి ఏమిటి? మీరు క్షమించాల్సినవారు . . . లేక మీరు క్షమాపణ అడుగవలసినవారు ఎవరైనా ఉన్నారా? మీరు గాయపడినవారైనా లేదా గాయముచేసినవారైనా, నివారణ ఒకటే.
ఆరాధించుటకు క్షమించడం అవసరమని యేసు సూచించారు. ప్రజలు తమ బలులను విడిచిపెట్టి, వారికి వ్యతిరేకంగా ఏదైనా కలిగివున్న వారితో సమాధానపడుమని ఆయన ప్రజలకు సూచించినట్లు గుర్తుందా (మత్తయి 5:23-24)? ఒకరి ఆరాధనకు అంతరాయం కలిగించేంత పెద్ద సమస్యగా క్షమించబడవలసిన అవసరాన్ని యేసు చూశాడు!
యేసు నాణేనికి మరో వైపు కూడా బోధించాడు. తనకు “కోట్ల రూపాయలు” బాకీ ఉన్న తన సేవకుడిని క్షమించిన రాజును గురించిన ఉపమానము ద్వారా ఆయన క్షమించకపోవడం యొక్క పరిణామాల గురించి హెచ్చరించాడు . . . అయితే, నమ్మశక్యం కాని విధంగా, క్షమించబడిన వ్యక్తి రెండువేల రూపాయల కంటే తక్కువ ఉన్న మరొకరి రుణాన్ని క్షమించటానికి నిరాకరించాడు (మత్తయి 18:24).
దేవుడు మనలను క్షమించడం మరియు మనం ఇతరులను క్షమించడం మధ్యనున్న పరస్పర భేదమును గూర్చి యేసు యొక్క ఉపమానము తెలియజేయుచున్నది. ఆయన చెప్పేదేమిటి? ఇతరులపట్ల పిసినారిగా ఉంటూ, దేవుని విస్తారమైన కృపానిధి నుండి తీసుకోవడం కపటముగా వ్యవహరించడమే. అలా చేయవద్దు!
అటువంటి కపటధోరణి యొక్క పరిణామం? క్షమించడానికి నిరాకరించే వ్యక్తి “బాధపరచువారికి” అప్పగించబడతాడు (మత్తయి 18:34). దాని గురించి ఆలోచించండి. మీరు బాధపరిచే ఆలోచనలు మరియు వేదన కలిగించే అశాంతి యొక్క దుఃఖం వైపు మళ్లించబడతారు.
మీరు పగ కలిగి ఉంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు-ఆ స్థిరమైన, మథన భావన. మీరు సెలవులో ఉన్నా సరే, మీ అపరాధి యొక్క చిత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఒడ్డున అలలు ఎగిసిపడడం మీకు చాలా అరుదుగా వినబడతాయి, ఎందుకంటే మీ తలలో ఆ వ్యక్తి గొంతుక యొక్క శబ్దాన్ని మీరు నిశ్శబ్దం చేయలేరు.
ఈ పగను మీతోపాటు తీసుకువెళ్లటం ఆపే సమయం ఆసన్నమైంది. గతాన్ని వదిలేయండి! క్షమించడం వల్ల బాధపరిచేవారి నుండి విముక్తి లభిస్తుంది . . . అలాగే మీ హృదయాన్ని పాడటానికి సిద్ధం చేస్తుంది! నిజంగా, అది జరుగుతుంది. లేఖనము దానిని రుజువు చేస్తుంది!
బైబిల్ అంతటా స్వాతంత్ర్య గీతాన్ని పాడే స్వరాలను మనం వింటాము. యోసేపు గుర్తున్నాడా? అతని సహోదరులు అతన్ని బానిసత్వానికి విక్రయించారు, అక్కడ అతనిపై తప్పుడు ఆరోపణలు వేయబడ్డాయి మరియు అలా విడిచివేయబడ్డాడు, జైలులో మరచిపోబడ్డాడు. తప్పుల రికార్డును ఉంచడానికి ఎవరికైనా ఏదైనా కారణం ఉందంటే, అది యోసేపుకు మాత్రమే ఉన్నది! కానీ ఆ నేరాలను చెరిపేయడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. యోసేపు తన మొదటి బిడ్డతో ఆ స్వేచ్ఛను జ్ఞాపకం చేసుకున్నాడు.
అప్పుడు యోసేపు–దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే [అంటే మరచిపోవుట] అను పేరు పెట్టెను. (ఆదికాండము 41:51)
మనష్షే పేరును పిలిచిన ప్రతిసారీ యోసేపు తప్పక నవ్వి ఉండాలి.
యెషయా యొక్క నిరీక్షణతో కూడిన భావి కథనం స్వేచ్ఛ యొక్క మరొక స్వరమై ఉన్నది:
నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు
నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు. (యెషయా 54:4-5)
మానసికంగా మీ అవమానాన్ని, దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా? మీ బాధను సిలువ చెంతకు తీసుకురండి మరియు లోతుగా స్వస్థత పొందుకోండి. మరెక్కడా ఇలాంటి స్వస్థత అందుబాటులో లేదు. సిలువ యొద్ద, యేసు మన బాధలలో మనతో కలిసి ఉంటాడు. ఆయన కన్నీళ్లు మన కన్నీళ్లతో కలిసిపోతాయి. ఆయన నిందింపబడటం, ద్రోహం చేయబడటం, తిరస్కరింపబడటం మరియు దెబ్బలు తినడం గురించి మనం బాధపడతాము . . . అలాగే ఆయన కూడా మన విషయమై బాధపడతాడు. యేసుతో ఈ స్వస్థత సంబంధం నుండి, క్షమాపణ పుట్టింది. ఆయన మనల్ని క్షమిస్తాడు, అలాగే ఇతరులను క్షమించేలా మనల్ని విడుదల చేస్తాడు. క్షమించబడి మరియు విడుదలపొంది, మన ఆత్మలు పాడతాయి!
మీరు మరచిపోలేని నేరం ఏదైనా ఉందా? ఆ బాధను వ్రాసి, ఆ కాగితాన్ని సిలువ దగ్గరకు తీసుకురండి మరియు దాని మీద క్షమించబడెను అని చెక్కండి. మీ హృదయంలోని గుంటలను పూరించమని అలాగే మీరు “పరుగెత్తుటకు” మీకు సహాయం చేయుమని మీ దేవుని అడగండి (ఫిలిప్పీయులకు 3:13-14).
మీరు ఎవరితోనైనా రాజీపడాల్సిన అవసరం ఉందా? మీ నేరాలను నమోదు చేయండి. వ్యక్తి వద్దకు కాగితాన్ని మీతోపాటు తీసుకురండి, ఒప్పుకోండి మరియు వినయంగా క్షమించమని అడగండి.
వదిలేయండి.
ఇది నిజం కావడం చాలా సులభం అనిపిస్తుంది, కానీ క్షమాపణ చాలా శక్తివంతమైనది. ఇది సులభం కాదు, కానీ ఇది అద్భుతమైన నిజం.
క్షమించండి . . . మరియు విమోచింపబడిన ఆత్మ యొక్క పాట పాడండి!
Copyright © 2017 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.