ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
పుస్తకంలో ఉన్న కొన్ని వ్యక్తిగత వివరాలకు మించి యోవేలు ప్రవక్త గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అతను తనను తాను పెతూయేలు కుమారుడిగా గుర్తించుకొని, యూదా ప్రజలకు బోధించి, యెరూషలేముపై ఎంతో ఆసక్తిని వ్యక్తం చేశాడు. యూదాలోని ప్రార్థనా కేంద్రంతో పరిచయాన్ని సూచిస్తూ యోవేలు యాజకులు మరియు ఆలయముపై అనేక వ్యాఖ్యలు చేశాడు (యోవేలు 1:13-14; 2:14, 17). యోవేలు తరచూ సహజ ప్రకృతిని ప్రతిబింబించే విధముగా, అనగా సూర్యచంద్రులను, గడ్డి మరియు మిడుతలు మొదలగు వాటితో వర్ణించాడు. మరియు సాధారణంగా నిజ ప్రపంచంలో సత్యం మనపై ప్రభావం చూపాలి అనే వాస్తవికతను అతను అర్థం చేసుకున్నట్లు అనిపించింది.
మనమెక్కడ ఉన్నాము?
పాత నిబంధన పండితులకు యోవేలు పుస్తకం యొక్క కాలమును తెలిసికొనుట చాలా కష్టమైన పనిగా మిగిలిపోయింది. ఎందుకంటే చాలామంది ప్రవచనాత్మక రచయితల మాదిరిగా కాకుండా, యోవేలు తన కాల వ్యవధి గురించి స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. ముఖ్యంగా, యోవేలు తన కాలములో పరిపాలించిన రాజులను గురించి ప్రస్తావించలేదు. యూదాను పరిపాలించిన ఒకేఒక్క రాణియైన అతల్యా తరువాత ప్రవచనం వచ్చి ఉండవచ్చు. అందుకనే అతని కాలంలో పరిపాలించిన రాజును గురించి వ్రాయబడలేదని ఒక బలమైన వాదన ఉన్నది. అతల్యా యువ మనవడైన యోవాషు ఆమె మరణించిన తరువాత అధికారములోనికి వచ్చాడు. యోవాషు పాలించటానికి చాలా చిన్నవాడు గనుక, అతను వయస్సు వచ్చేవరకు యాజకుడైన యెహోయాదా అతని స్థానంలో పరిపాలించాడు. కాబట్టి ఈ సంరక్షణ కాలంలో యోవేలు ప్రవచించినట్లయితే, అతను అధికారిక రాజు గురించి ప్రస్తావించలేదని అర్ధమవుతుంది. క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దం చివరిలో ప్రముఖంగా ఉన్న యాజకులు, దేవాలయ ఆచారాలు మరియు ఫెనికయ, ఫిలిష్తీయ, ఐగుప్తు, ఎదోము వంటి దేశాల గురించి కూడా యోవేలు పుస్తకం ప్రస్తావించింది. ఇవన్నీ సుమారు క్రీ.పూ. 835 లేదా అంతకుముందు తేదీని సూచిస్తున్నాయి. యోవేలును తొలి రచనా ప్రవక్తలలో ఒకరిగా, అలాగే ఎలీషా ప్రవక్త యొక్క సమకాలీనుడిగా పేర్కొన్నవచ్చు.
ఈ పుస్తకం దక్షిణ రాజ్యమైన యూదాపై ప్రవచనాత్మక తీర్పును కేంద్రీకరించి, సీయోను మరియు ఆలయ ఆరాధన గురించి తరచుగా ప్రస్తావించింది (యోవేలు 1:13-14; 2:23, 32; 3:16, 21). ఈ ప్రాంతంతోను మరియు ఆలయంలోని ఆరాధనతోను యోవేలుకు ఉన్న పరిచయము అతను యూదాలో బహుశా యెరూషలేము నగరంలోనే నివసించాడని సూచిస్తుంది.
యోవేలు ఎందుకంత ముఖ్యమైనది?
లేఖనాల యొక్క నియమావళికి యోవేలు గ్రంథము యొక్క ప్రాముఖ్యత, చాలా తరచుగా ప్రస్తావించబడిన బైబిల్ ఆలోచనయైన "యెహోవా దినము" ను అభివృద్ధి చేసిన మొట్టమొదటిదిగా పుట్టుకొచ్చినందువల్ల వచ్చింది. ఓబద్యా భయానక సంఘటనను మొదట ప్రస్తావించగా (ఓబద్యా 15), యోవేలు యొక్క పుస్తకం యెహోవా దినమును గురించి అవి అంధకారమును ధరించుకున్న దినములని, దండయాత్ర చేయుచున్న సైన్యాలు దహించు అగ్నియని మరియు చంద్రుడు రక్తవర్ణమగునని లేఖనాల్లోకెల్లా చాలా అద్భుతమైన మరియు నిర్దిష్ట వివరాలను ఇస్తుంది. ఇటువంటి శక్తివంతమైన భౌతిక వర్ణనలలో పాతుకుపోయిన అంతిమ తీర్పు యొక్క సమయం, నేటికీ మనకు రాబోయే దినముగానే ఉన్నప్పటికీ (2 థెస్సలొనీకయులు 2:2; 2 పేతురు 3:10), పాపంపై దేవుని తీర్పు యొక్క తీవ్రతను స్పష్టం చేస్తుంది.
యోవేలు యొక్క ఉద్దేశమేమిటి?
ఆ సమయంలో యూదాలో ప్రసిద్ధ మిడతల తెగులును ఉపయోగించి, యోవేలు తీర్పు విషయమైన దేవుని సందేశాన్ని మరియు పశ్చాత్తాపం వలన లభించే నిరీక్షణను గూర్చి చెప్పటానికి ఈ విషాదవార్తను వాడుకున్నాడు. భయంకరమైన మిడతల తెగులును గురించి ప్రస్తావించడంలో, యోవేలు తన శ్రోతల జీవితాల్లో మాట్లాడగలిగాడు. అలాగే ఒక జంతువుకు వాతవేసినప్పుడు దాని శరీరము కాలిపోయినట్లు తీర్పు యొక్క సందేశాన్ని వారి మనస్సులలో ముద్రించగలిగాడు.
యెహోవా దినము అనేది ఒక దినమును మాత్రమే కాదు, తీర్పు మరియు పునరుద్ధరణ కాలాన్ని సూచిస్తూ మూడు ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నాడు:
- దేవుని ప్రజలను గురించిన తీర్పు
- అన్యజనులను గురించిన తీర్పు
- తీవ్రమైన శ్రమల ద్వారా దేవుని ప్రజల శుద్ధీకరణము మరియు పునరుద్ధరణ1
ఈ అంశాలన్నీ యోవేలు పుస్తకంలో మనము కనుగొంటాము. ఇది లేఖనములో పరిపూర్ణ వర్ణనలతో నిండిన అంతిమ విమోచన సంఘటనను గురించి చెప్పింది (యోవేలు 2:1–11; 2:28–32; 3:1–16).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
యోవేలులో లేక మరింత ముఖ్యమైన ప్రకటన గ్రంథములో భవిష్యత్తును గురించిన దర్శనాలు తరచుగా మన రోజువారీ జీవనం నుండి చాలా దూరముగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే, వారి వినాశనం యొక్క స్పష్టమైన చిత్రాలు మన ఆధ్యాత్మిక మూర్ఖత్వం నుండి మనల్ని మేల్కొల్పడానికి ఉపయోగపడాలి. మీరు ఎప్పుడైనా ఆత్మసంతృప్తి అనుభూతి విషయమై శ్రమపడుతున్నారా? యోవేలులో మనం కనుగొన్నట్లుగా అంత్యదినములను గూర్చిన వర్ణనల యొక్క బలమైన మోతాదు మీ కళ్ళను తెరిపించి మీ జీవితంలోని ప్రతి క్షణం దేవుణ్ణి నమ్మకంగా అనుసరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
- Robert B. Chisholm, Jr., "Joel," in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 1412.