ఆదికాండము

ఈ పుస్తకము వాుసినదెవరు?

పాత నిబంధన పుస్తకాల్లో రచయితను గూర్చిన ప్రస్తావన అరుదుగా ఉంటుంది. కాబట్టి గ్రంథకర్త ఎవరో కనిపెట్టడానికి మనంపరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన వేరే ఆధారాలను పరిశీలించాలి. ఇశ్రాయేలీయులను విమోచించినవాడును, ప్రవక్తయునైన మోషేయే ఈ పంచకాండాలకు, అనగా పాత నిబంధనలోని మెుదటి అయిదు పుస్తకాలకు రచయిత అని యూదాసాంప్రదాయం మరియు ఇతర బైబిల్ గ్రంథకర్తలు పేర్కొన్నారు. ఐగుప్తు ఆస్థాన మంటపంలో అతడు అభ్యసించిన విద్య (అ.కా. 7:22) మరియు యెహోవాతో (హెబ్రీ భాషలో దేవుని పేరు) అతనికున్న సన్నిహిత సహవాసము అతనే గ్రంథకర్త అనటానికిఆధారము. వెూషే లేఖనాలను స్వయంగా యేసే ధృవీకరించారు (యెూహౕను 5: 45-47). యేసు కాలంనాటి శాస్త్రులుపరిసయ్యులు కూడా యిదే విషయాన్ని ధృవీకరించారు (మత్తయి 19: 7; 22: 24).

టోలెడోత్ అనే హెబ్రీ పదం నుండి, బైబిల్ యొక్క మొదటి పుస్తకానికి సెప్టువాజింట్‌లో “జెనెసిస్” అనే పేరు పెట్టబడింది. యూదుల లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమ చేయటాన్ని సెప్టువాజింట్‌ అని అంటారు. “బెరషీత్” అను హెబ్రీ పదము నుండిపరిశుద్ధ గ్రంథము యెుక్క మెుదటి పుస్తకానికి “ఆదికాండము” అని తెలుగులో పేరు పెట్టబడింది. “ఆది” అనగా “మూలం” లేక”మెుదలు”1 అని అర్థము. ఈ పుస్తకమంతటిలోను మూలాంశము ఈ పదమే.

వెూషే ఆదికాండమును ఇశ్రాయేలీయుల కొరకు వ్రాశాడు. వీరిని వెూషే ఐగుప్తు బానిసత్వమునుండి విడిపించి వారి పితరులు నివసించిన ప్రాంతానికి నడిపించాడు. ఆదికాండము ఈ పితరుల యెుక్క చరిత్రను, అనగా వీరి మూలాలను, ప్రయాణాలను మరియు దేవుడు వీరితో చేసిన నిబంధనలను గూర్చిన విషయాలను సమకూర్చింది. మిగిలిన పంచకాండములోని సంఘటనలు ఆదికాండములో కనిపించే దేవుని వాగ్దానాలకు సమాధానాలు కాబట్టి, వారి పితరుల పట్ల దేవుడు ఎలా వ్యవహరించాడనే చరిత్ర, వాగ్దాన దేశంలో స్వేచ్ఛ మరియు శ్రేయస్సు కోరుకునే బానిసలైన ఇశ్రాయేలీయులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.

మనమెక్కడ ఉన్నాము?

ఆదికాండము యెుక్క మెుదటి పదకొండు అధ్యాయాలు మానవజాతి యెుక్క ప్రారంభ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను మాత్రమే పొందుపరచాయి. జలప్రళయము తర్వాత దేవుని పనంతా కూడ మెసపొతొమియలో నివసిస్తున్న ఒకే ఒక్క కుటుంబముపై కేంద్రీకృతమై ఉన్నది. ఈ కుటుంబానికి అధిపతి అబ్రాము అని పిలువబడిన అబ్రాహాము. యూఫ్రటీసు నది (ఆధునిక ఇరాకులో) మొదలుకొని ప్రస్తుతపు సిరియ మీదుగా దక్షిణాన ఉన్న కనాను (ఆధునిక ఇశ్రాయేలు) మరియు ఐగుప్తుకు సంఘటనలు కదలుచున్నవి.

పరిశుద్ధ గ్రంథములోని మిగిలిన పుస్తకాల యెుక్క చరిత్ర నడిచిన కాలముకంటే ఆదికాండములోలి చరిత్ర ఒక్కటే చాలా ఎక్కువ కాలం నడిచింది. మొదటి పదకొండు అధ్యాయాల్లో ప్రాచీన చరిత్రను గూర్చిన కాల పరిమితి యెుక్క ఆనవాళ్ళు లేవు. అబ్రాము యెుక్క కథ సుమారు క్రీ.పూ. 2091లో ప్రారంభమవుతుంది. ఈ పుస్తకం సుమారు క్రీ.పూ.1805లో ఐగుప్తులో యోసేపు మరణముతో ముగిసింది.

ఆదికాండము ఎందుకంత ముఖ్యమైనది?

ఈ పుస్తకం ఇశ్రాయేలు ప్రజల యెుక్క చరిత్ర గనుక, ఆదికాండము యొక్క మూల పాఠకులకు యిది ఎంతో విలువైనది. దేవుడు వారి పితరుడైన అబ్రాహాముతో వ్యక్తిగత సంబంధాన్ని ప్రారంభించే వరకు దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో మరియు మానవాళితో ఎలా వ్యవహరించాడో అనే కథను వీరికి ఈ పుస్తకం చెప్పింది. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన నిత్యమైన వాగ్దానాలను వారి తర్వాత వారి సంతతివారికి కూడ విస్తరించిన సంగతిని ఆదికాండము వీరికి వెల్లడించింది. ఈ పుస్తకము “వాగ్దాన దేశానికి” తిరిగివెళ్లటానికి ఎదురుచూస్తున్న అణగారిన హెబ్రీయులకు ఆదరణ మరియు నిరీక్షణను అందించింది.

భావి పాఠకుల కోసం ఈ పుస్తకం మిగిలిన బైబిలునకు అవసరమైన సమగ్ర నేపథ్యాన్ని అందించింది. ఈ పుస్తకంలో మనము ప్రాచీన చరిత్రను మరియు భౌగోళిక శాస్త్రమును నేర్చుకుంటాము. తరువాత బైబిల్లో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు, సంఘటనలు ఈ పుస్తకములో పరిచయం చేయబడ్డాయి. దేవుడు తన స్వభావం యొక్క అనేక కోణాలను ప్రజలతో తన వ్యవహారాల ద్వారా బయలుపరచాడు. మనము పాపం యొక్క మూలం, మానవజాతిపై దాని వినాశక ప్రభావం మరియు ఇశ్రాయేలీయుల భవిష్యత్ కుమారుని ద్వారా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలనే దేవుని ప్రణాళిక గురించి మనం ఈ ఆదికాండములో నేర్చుకుంటాము (ఆదికాండము 3:15; 22:18; 49:10).

ఆదికాండము యొక్క ఉద్దేశమేమిటి?

పరిశుద్ధ గ్రంథము పాత మరియు క్రొత్త నిబంధనలనే రెండు ప్రధానమైన భాగాలుగా విభజించబడింది. ఒప్పందమునకు మరో పదము నిబంధన. ఒప్పందములు ఆదికాండపు చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి నానా సమయాల్లో దేవుని ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని నిర్వచించడంలో తోడ్పడతాయి. పాపం దేవునికి మానవునికి మధ్య సంపూర్ణ సమాధానమును భంగము చేసింది (ఆదికాండము 3). దీనివల్ల దేవుడు ఉద్ధేశించిన ఆశీర్వాదమును అనుభవించటానికి బదులు మానవజాతి శాపముతో భారభరితమైంది. అయితే దేవుడు ఒప్పందాల ద్వారా విమోచన మరియు ఆశీర్వాదముకై తన ప్రణాళికను స్థాపించాడు. మొదట అబ్రాహాముతో ఒప్పందము చేసి (ఆదికాండము 12: 1–5), తర్వాత ఇస్సాకుతో (26: 1–35), ఆ తరువాత యాకోబుతో (28: 1–22) పునరుద్ఘాటించాడు. ఈ వాగ్దానములు ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులకు అలాగే వారి తరువాతి తరాలకు వర్తించబడ్డాయి. ఈ లోకమును తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షించే దేవుని ప్రణాళిక కొరకు ఆదికాండము రంగం సిద్ధం చేసింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ప్రధానమైన అంశమును చూడకుండా ఆదికాండములోని వంశావళుల్లోను వృత్తాంతముల్లోను పడి తప్పిపోవటం చాలా సులభం. మీరు ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మనుష్యులను మాత్రమే కాకుండా దేవుణ్ణి మీ మనస్సుల్లో గుర్తుంచుకోండి. ఆయన స్వభావ లక్షణాలను పరిశీలించండి. మీరు ఇశ్రాయేలీయులైతే ఇప్పుడే బానిసత్వం నుండి విడుదల చేయబడి, ఈ పుస్తకాన్ని మొదటిసారిగా చదువుతుంటే, సృష్టిపై దేవుని శక్తిని బట్టి మీరు ఆశ్చర్యపడతారా? లేక పాపంపై ఆయన ఉగ్రతను బట్టి ఆశ్చర్యపడతారా? లేక అందరికీ ఆయన వాగ్దానాలను ఇచ్చి వాటిని నెరవేర్చిన తీరును బట్టి ఆశ్చర్యపడతారా? ఈ లక్షణాల యొక్క ప్రతి అవగాహన ఆరాధనను . . . నిరీక్షణను ప్రేరేపించాలి. ప్రభువు బలవంతుడు, నమ్మకమైనవాడు, నీతిమంతుడు అని గుర్తుంచుకోండి. అలాగే తన సృష్టిని ఆశీర్వదించాలనే తన కోరిక ఒక రోజు పూర్తిగా సాకారం అవుతుంది.

  1. Walter Bauer and others, eds., A Greek-English Lexicon of the New Testament and Other Early Christian Literature, 2d rev. ed. (Chicago: University of Chicago Press, 1979), 154.