ఏదైనా సాధించడానికి పూర్ణబలముతో కృషి చేయండి!

“ముందుకు సాగిపో!” అని చాలా తక్కువ మంది చెప్పడం వలన ఎంత మంది వ్యక్తులు ఆగిపోతున్నారు? తన చక్కటి చిన్న పుస్తకం ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ అలైవ్‌లో, రచయిత జాన్ పావెల్ బహామాస్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడికి జరిగిన అనుభవాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఒక పలకలవంతెన చివర గుమిగూడిన గుంపును గమనించాడు. అతను గొడవను పరిశోధించడానికి ముందుకు కదిలాడు. పావెల్ ఇలా చెప్పాడు: . . . ఇంట్లో తయారు […]

Read More

విజయం యొక్క మరచిపోయిన కోణం

మనది విజయంతో నిండిన సమాజం. చెప్పకనేచెప్పు సంకేతాలు ప్రతిచోటా ఉన్నాయి. ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లు, ఆడియోలు మరియు వీడియో‌లు, మరియు వందలకొద్దీ సెమినార్‌లు ఆలోచనలను, ప్రేరణను, పద్ధతులను, మరియు సమృద్ధి యొక్క వాగ్దానాలను అందిస్తాయి. అయితే, ఆసక్తికరంగా, చాలా మంది వ్యక్తులు తమ విజయాన్ని సాధించడంలో ఏమి కోరుకుంటున్నారో (కానీ చాలా అరుదుగా కనుగొంటారు) కొద్దిమంది మాత్రమే సంబోధించారు: సంతుష్టి, నెరవేర్పు, సంతృప్తి మరియు ఉపశమనం. దీనికి విరుద్ధంగా, విజయానికి నడిపించే […]

Read More

క్షీణత

నా హైస్కూల్ రసాయనశాస్త్రం తరగతి నుండి నాకు రెండు విషయాలు మాత్రమే గుర్తున్నాయి. మొదటిది, వరుసగా ముప్పై మూడు రోజులు నేను సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పూసుకోవడం ద్వారా నా కుడి చేతి వెనుక ఉన్న మొటిమను వదిలించుకున్నాను. రెండవది, మరపురాని ప్రయోగంలో కప్ప నెమ్మదిగా చనిపోవడాన్ని నేను చూశాను. నా గురువు నిస్సహాయ జీవిని చల్లటి నీటి బీకర్‌లో ఉంచారు. బీకర్ క్రింద అతను బన్సెన్ బర్నర్‌ను చాలా తక్కువ మంటతో కదిలించాడు, తద్వారా నీరు చాలా […]

Read More

నా ప్రభువా, నా దేవా!

సంవత్సరంలోని ఈ సీజన్ అందరికీ ఆనందాన్ని కలిగించదు. సూటిగా చెప్పాలంటే, కొందరు భయపడతారు. వారు గడిచిపోయిన బాధాకరమైన రోజుల యొక్క విచారకరమైన జ్ఞాపకాలతో నిండి ఉన్నారు, వారు ఆనందగీతములు పాడటం చాలా కష్టం. “సంతోషమౌ దినం భువికి”-కాదు. “మన ఆనందం ఎంత గొప్పది!”-సరే, మీకవ్వచ్చు కానీ అందరికీ కాదు. ఇప్పుడు, మీరు నన్ను “స్క్రూజ్” అని పిలవడానికి ముందు, మీరు మొదటి శతాబ్దానికి వెళ్ళి ఈ వర్గానికి సరిపోయే క్రీస్తు శిష్యుణ్ణి కలవాలని నేను సూచిస్తున్నాను. ఈ […]

Read More

ఏడాది పొడవునా క్రిస్మస్

మత్తయి 1-2 చదవండి. క్రిస్మస్‌ వచ్చేంత వరకు సంవత్సరం పొడవునా ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజుకు ఒకటిచొప్పున క్రిస్మస్ వరకు ప్రతిరోజూ ఈ రోజువారీ బహుమతులను మన “క్రిస్మస్ ప్రాజెక్టులు” అని పిలువవచ్చు. జులైలో “మెర్రీ క్రిస్మస్” అని చెబితే ఉండే సరదా గురించి ఆలోచించండి! ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి: గొడవను పరిష్కరించండి. మరచిపోయిన స్నేహితుడిని వెతకండి. ఎప్పుడో వ్రాయవలసిన ప్రేమ పత్రాన్ని రాయండి. ఒకరిని గట్టిగా కౌగిలించుకుని, […]

Read More

మీరు ప్రాముఖ్యమైన ప్రభావమును చూపించగలరు

ఒక పరిస్థితిలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది మనందరినీ పిరికివారిగా చేస్తుంది. చేయవలసినది ఎంతో ఉన్నది గనుక, మనం చాలా తేలికగా అధైర్యపడిపోతాము మరియు ఏమీ చేయలేము. మనం చేరుకోవలసినవారు చాలామంది ఉన్నారు గనుక, మన బాధ్యత యొక్క పరిధిలోని ఆ కొద్దిమందిని ప్రభావితం చేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడని మరచిపోవటం తేలిక. విశాలమైన ప్రదేశంలో పరిచర్య గురించి నేను మొదటిసారి ఇబ్బందిపడింది నాకు గుర్తుంది. నా జీవితం ప్రశాంతంగా మరియు నెగ్గుకొని రాగలిగినదిగా ఉంది. దక్షిణ టెక్సాస్ […]

Read More

దేవుడు మీ నుండి ఏమి కోరుకుంటున్నాడు

నూతన సంవత్సరంలో అప్పుడే ఒక నెల అయిపోయింది, ఇప్పటికే జీవిత ఒత్తిళ్లు మళ్లీ మొదలైపోయాయి. ప్రతి నెలా చెక్‌బుక్‌లో చాలా తక్కువ ద్రవ్యము ఉండటం. పిల్లలు మరియు/లేదా మనవళ్లు అంతులేని, అపరిమితమైన శక్తిని కోరుకోవటం. ఎక్కడో వినినట్లుగా చూసినట్లుగా అనిపిస్తుందా? మనము పరిశుద్ధ గ్రంథములో తొంగిచూసినప్పుడు, ఈ రోజుల్లో ఒత్తిడికి ఆచరణాత్మక దిశానిర్దేశం చేసే మూడు లక్షణాలను, పాత నిబంధన చివరలో దాగియుండటం మనం కనుగొంటాము. తన ప్రజలు మూడు పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నట్లు ప్రవక్తయైన […]

Read More

మన సమస్యాత్మక సమయాలను గ్రహించుట

మీరు కొన్నిసార్లు తలలూచుచు విస్మయమునొంది, ఈ లోకంలో ఏమి జరుగుతుందోనని ఆశ్చర్యపోతున్నారా? నా జీవిత కాలంలో, విస్తృత సంస్కృతిలో నేను అనేక మార్పులను చూశాను. దౌర్భాగ్యంగా, అన్నీ మంచి కోసం కాదు. క్రైస్తవులు ఈ ప్రపంచంలో ప్రభావం చూపాలనుకుంటే, ముందుగా మార్పులను అర్థం చేసుకోవడం తప్పనిసరి. కాబట్టి మన ప్రపంచంలో నేను చూసిన మూడు ముఖ్యమైన సమస్యాత్మక మార్పులను చూద్దాం. మొదట, నేను తప్పొప్పుల మధ్యనున్న రేఖ యొక్క అస్పష్టతను చూశాను. నా జీవితకాలంలో, నైతికత యొక్క […]

Read More

ఏకాంతము: దేవునికి సన్నిహితులవటంలో కీలకమైన అంశం

మార్కు సువార్తను చదువుచున్నప్పుడు నేను తరచుగా నవ్వుతాను. వెంటనే అనే పదాన్ని అతడు ఇష్టపడ్డాడు. ఇది మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. యేసు యొక్క జీవితం మీరు నేను ఎన్నడూ యెరుగని ఒత్తిడితో మరియు జనులతో నిండిపోయిందని మార్కు మనకు గుర్తు చేస్తున్నాడు. కానీ అతను ఇంకొకటి కూడా పొందుపరచాడు, “ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు 1:35). ఆయన ఎందుకు అలా చేశాడు? ఆయన […]

Read More

మృదువైన హృదయాన్ని మరియు బలమైన స్వభావాన్ని అలవరచుకొనుట

నేను పరిచర్యలో ఉన్నంత కాలం నేను మృదువైన హృదయానికి మరియు బలమైన స్వభావానికి మధ్య సమతుల్యత కోసం ప్రభువును వేడుకున్నాను. ఇది సులభముగా సమానీకరించలేనిది. వాస్తవానికి, రెండోది మొదటిదాని కంటే అలవరచుకోవడం చాలా కష్టం. పరిచర్యలో పూర్తిగా నిమగ్నమవ్వాలంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మృదువైన హృదయాన్ని కలిగి ఉండాలి. బలమైన స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవటమే ఒక సవాలు. పరిచర్యలో ఉన్నవారు ముఖ్యంగా నిందలు భరించువారిగా ఉంటారు; మనం విమర్శలకు పెద్ద లక్ష్యాలుగా ఉంటాము. నాకు తెలిసిన ప్రతి […]

Read More