మీరు కొన్నిసార్లు తలలూచుచు విస్మయమునొంది, ఈ లోకంలో ఏమి జరుగుతుందోనని ఆశ్చర్యపోతున్నారా? నా జీవిత కాలంలో, విస్తృత సంస్కృతిలో నేను అనేక మార్పులను చూశాను. దౌర్భాగ్యంగా, అన్నీ మంచి కోసం కాదు. క్రైస్తవులు ఈ ప్రపంచంలో ప్రభావం చూపాలనుకుంటే, ముందుగా మార్పులను అర్థం చేసుకోవడం తప్పనిసరి. కాబట్టి మన ప్రపంచంలో నేను చూసిన మూడు ముఖ్యమైన సమస్యాత్మక మార్పులను చూద్దాం.
మొదట, నేను తప్పొప్పుల మధ్యనున్న రేఖ యొక్క అస్పష్టతను చూశాను. నా జీవితకాలంలో, నైతికత యొక్క సంపూర్ణ ప్రమాణం నుండి సహనానం మీద మొత్తానికి మరియు అనాలోచిత ప్రాధాన్యతకు మారడాన్ని నేను చూశాను. మన ప్రపంచంలో చాలా మంది ఇంగితజ్ఞానాన్ని రాజకీయ సవ్యతతో భర్తీ చేశారు. మనము బాధితుల కంటే నేరస్తులను ఎంతో యిష్టంగా కాపాడతాము. స్వలింగ వివాహానికి వ్యతిరేకంగా నిలబడటం ఒక వ్యక్తిని “స్వలింగ సంపర్కం పట్ల అసహనం” గలవానిగా మరియు “వాస్తవికతతో సంబంధం లేనివానిగా” ముద్ర వేస్తుంది. లేఖనము ఫలానా ప్రవర్తన లేదా వైఖరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బోధిస్తుందని పేర్కొనడం వలన అది ఇంతకుమునుపు చూపిన ప్రభావం ఇప్పుడు చూపడంలేదు. ఈ వాతావరణంలో, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ఒక వ్యక్తిని అవివేకిగా చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే తప్పొప్పుల మధ్య రేఖ అస్పష్టంగా ఉంది.
ఈ రోజుల్లో రెండవ సమస్యాత్మకమైన మార్పు సంభవిస్తోంది: బైబిల్ జ్ఞానం పట్ల పెరుగుతున్న అజ్ఞానాన్ని నేను చూస్తున్నాను. ఇటీవలి సంవత్సరాలలో కూడా, వేదాంతపరమైన ఆలోచన, బైబిల్ అవగాహన మరియు సిద్ధాంత సత్యం మన సంస్కృతి యొక్క జీవన ప్రమాణ మార్గదర్శకాలుగా ఉండేవి. రాజకీయ నాయకులు మరియు విద్యావేత్తలు తరచుగా లేఖనాల నుండి ఉదాహరించేవారు. నా ప్రాథమిక-పాఠశాల వయస్సులో ప్రతి తరగతి గది అనుభవంలో ప్రార్థన ఒక భాగంగా ఉండేది. పాస్టర్లు లేఖనాలను ఎంతో శక్తివంతంగా బోధించేవారు. ఇప్పుడు? దౌర్భాగ్యంగా, మన కాలంలో మనకు “దేశములో క్షామము-అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును” (ఆమోసు 8:11).
మూడవది, పోస్ట్‌మోడర్నిజాన్ని ఎంతో తీవ్రంగా ఆలింగనం చేసుకోవటాన్ని నేను చూస్తున్నాను. మనము స్పష్టంగా క్రైస్తవ యుగం నుండి క్రైస్తవ అనంతర యుగానికి మారాము. అందుకుగాను కృతజ్ఞతలు చెప్పడానికి మనకు పోస్ట్‌మోడర్నిజం ఉంది.
మన ప్రపంచంలో పోస్ట్ మోడరనిజం ఉనికిని గుర్తించడంలో మీకు సహాయపడటానికి మీకు 10 శీఘ్ర సంకేతాలను నన్ను ఇవ్వనివ్వండి.1
- ఏ అధికారం చెల్లదు. ఈ సిద్ధాంతమును కలిగి ఉన్నవారు అధికారాన్ని సవాలు చేస్తారు, “ఏది నమ్మాలో చెప్పడానికి మీరు ఎవరు?” అధికారం పట్ల గౌరవం వాస్తవంగా లేదు.
- ఏ నియమాలు చెల్లుబాటు కావు. దీని అర్థం మనం తప్పొప్పులను గురించి మన స్వంత నిర్ణయం తీసుకోవాలి, మనకు సరిగ్గా అనిపించే నియమాలను మాత్రమే పాటించాలి.
- సారము కంటే శైలి ముఖ్యం. వాస్తవికత అనేది సారము కాకుండా ప్రతిబింబం లేదా రూపాన్ని మాత్రమే కలిగి ఉంటుందనే ఆలోచన ఇక్కడ మనకు వస్తుంది.
- నైతికత అనేది వ్యక్తిగత అభిప్రాయము. మనం కోరుకున్నట్లు జీవించడం సరైనదేనని ఈ మనస్తత్వం సూచిస్తుంది.
- ప్రధానమైన గుణమేమిటంటే సహనం. ఈ విధమైన సహనం మనం ప్రతి ఒక్కరి నమ్మకాలను ధృవీకరించాలి అని చెబుతుంది . . . సహనం లేని వారి నమ్మకాలను తప్ప. వ్యంగ్యంగా ఉంది, కదూ?
- పదాలకు స్వాభావిక అర్ధం లేదు, కాబట్టి నిజమైన సంభాషణ అసాధ్యం. పదాలు ప్రభావం కలిగి ఉంటాయి లేదా ఉండవు, కాని మన ప్రపంచంలో పదాల ప్రాముఖ్యత క్షీణిస్తూనే ఉంది.
- పాశ్చాత్య సంస్కృతి అణచివేస్తుంది. పాశ్చాత్యుల సమాధానాల కంటే ఎక్కడో ఒకచేట ఎవరో ఒకరి దగ్గర సంస్కృతిని మెరుగుపరచడానికి మెరుగైన సమాధానం ఉంటుందని ఈ ఆలోచనా విధానం చెబుతుంది.
- సత్యము మరియు వినోదం మధ్య రేఖ తొలగించబడింది. కాబట్టి అంచనా వేయండి? బైబిల్ కంటే హాలివుడ్డే సత్యానికి మూలం అవుతుంది.
- చిత్రాలు మరియు ఊహానుభూతి వాస్తవికతను వివరిస్తాయి. వీడియో గేమ్‌లు లేదా టెలివిజన్‌లోని అసహ్యకరమైన చిత్రాలు వాటి ప్రభావంతో పెరుగుతున్న పిల్లలకు వాస్తవంగా మారతాయి.
- ప్రజలు ఏది నమ్ముతారో అదే సరైనది, కాబట్టి వారు లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా చేయవచ్చు. పోస్ట్ మోడరన్ ఆలోచనాపరులు తాము తప్పుగా భావిస్తే ఏ విధంగానైనా స్పందించడం ఆమోదయోగ్యమైనదని నమ్ముతారు, ఎందుకంటే వారు ఏది నమ్ముతారో అదే సరైనది.
పోస్ట్ మోడరనిజం క్రీస్తునందు విశ్వాసముంచినవారికి అనేక సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు బాగా జీవించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉండటం తప్పనిసరి. మొదట, మీకు వివేచన అవసరం. మీరు మోసగించబడకుండా, వంచింపబడకుండా మరియు మాయలో పడకుండా వివేచన మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. వివేచన మీకు చెబుతుంది, “ఈ పరిస్థితి చెడు ముగింపుకు దారితీస్తోంది, కాబట్టి నేను అక్కడికి వెళ్లడం లేదు.” వివేచన గల వ్యక్తులు ఈ ప్రపంచంలో ప్రమాదాలను నివారించవచ్చు.
రెండవది, మీకు దిశానిర్దేశం అవసరం. మీరు వెంబడించాల్సిన లక్ష్యాన్ని దిశానిర్దేశం అందిస్తుంది, మీరు ఏమి చేయాలో మీకు చూపుతుంది. కానీ దిశానిర్దేశం కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. వ్యతిరేకత మరియు నిరుత్సాహం నేపథ్యంలో సరైన పని చేయడానికి ధైర్యాన్ని ప్రదర్శించండి.
గంభీరమైన మాటలు . . . చాలా ఆలోచించాలి. మీరు జాగ్రత్త వహిస్తారని నాకు తెలుసు. కానీ మన కాలపు తరంగాలతో కొట్టుకుపోవడం చాలా సులభం. లేఖనముల యొక్క గంభీరమైన విద్యార్థిగా మారాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని వాక్యం మీకు మార్గదర్శకంగా ఉండనివ్వండి. బైబిల్ యొక్క కాలాతీత జ్ఞానంపై ఆధారపడే ఈ అలవాటును అనుసరించడం అద్భుతమైన పనులను చేస్తుంది, ఎందుకంటే ఇది వివేచనను పెంపొందించడానికి మరియు దారి తప్పిన ప్రపంచంలో దిశను అభివృద్ధి చేయడానికి మీకు సహాయపడుతుంది.
- బ్యాక్ టు ది బైబిల్: దేవుని వాక్యంతో మీ జీవితాన్ని మలుపు త్రిప్పుకోవడం అనే వుడ్రో క్రోల్ యొక్క పుస్తకం ద్వారా మన పోస్ట్‌మోడరన్ ప్రపంచాన్ని అర్థం చేసుకునే విషయంలో నేను ప్రత్యేకంగా ప్రభావితమయ్యాను. మీరు మన కాలాలపై మీ అవగాహనను పెంచుకునేందుకు నేను దానిని చదవమని ప్రోత్సహిస్తాను.
Copyright © 2016 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.