మనది విజయంతో నిండిన సమాజం. చెప్పకనేచెప్పు సంకేతాలు ప్రతిచోటా ఉన్నాయి. ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ పుస్తకాలు మరియు మ్యాగజైన్‌లు, ఆడియోలు మరియు వీడియోలు, మరియు వందలకొద్దీ సెమినార్‌లు ఆలోచనలను, ప్రేరణను, పద్ధతులను, మరియు సమృద్ధి యొక్క వాగ్దానాలను అందిస్తాయి.
అయితే, ఆసక్తికరంగా, చాలా మంది వ్యక్తులు తమ విజయాన్ని సాధించడంలో ఏమి కోరుకుంటున్నారో (కానీ చాలా అరుదుగా కనుగొంటారు) కొద్దిమంది మాత్రమే సంబోధించారు: సంతుష్టి, నెరవేర్పు, సంతృప్తి మరియు ఉపశమనం. దీనికి విరుద్ధంగా, విజయానికి నడిపించే దారులు రాళ్ళమయమే కాదు, అవి పిచ్చెక్కించేవిగా ఉంటాయి.
అయితే అది ఏమిటి? ఎక్కువ గంటలు పని చేయండి, ముందుకు సాగండి, మీ వివాహంగాని లేదా కుటుంబంగాని, మీ నమ్మకాలుగాని లేదా మనస్సాక్షిగాని, మీ ఆరోగ్యంగాని లేదా స్నేహితులుగాని–ఏదీ కూడా మీ అన్వేషణకు ఆటంకం కలిగించకూడదు. మీరు పైకి ఎక్కేటప్పుడు, అవసరమైతే దూకుడుగా ఉండండి. విజయమే మీ ప్రధానమైన ఎజెండా అయితే మీరు తెలివైనవానిగా, నేర్పుగలవానిగా మరియు చమత్కారిగా ఉండాలి. అదేమిటంటే, దశాబ్దాలుగా మనం పెంచబడిన అదే పాత అదృష్టం-కీర్తి-శక్తి-ఆనందం అనే సూత్రం.
మరీ సరళంగా అనిపించే ప్రమాదమున్నప్పటికీ, నేను పైన పేర్కొన్న అన్నింటికీ 180 డిగ్రీలు విరుద్ధంగా ఉండే కొన్ని సలహాలను అందించాలనుకుంటున్నాను. నా సూచనలు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో లేదా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పాఠ్యాంశాల్లో భాగంగా ఎప్పటికీ కనిపించవు, కానీ అవి లేఖనములో మద్దతు లభించే తత్వశాస్త్రాన్ని సూచిస్తాయి:
చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారు లను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిప్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. (1 పేతురు 5:5-7)
ఈ వచనాలు నిజమైన విజయానికి సంబంధించిన మూడు కీలకమైన రంగాలను సూచిస్తాయి: అధికారం, దృక్పథం, మరియు ఆందోళన. మరియు అన్నిటికంటే ఉత్తమమైన భాగమేమిటంటే: దేవుని నిర్దేశాలను అనుసరించడం అనేది లోకంలోని నిరర్థక వాగ్దానాలలో లేని ఒక ప్రయోజనాన్ని తెస్తుంది: శాశ్వతమైన సంతృప్తి యొక్క లోతైన భావన. దీనిని మనం విజయం యొక్క మరచిపోయిన కోణం అని పిలుస్తాము.
మొదటిది, జ్ఞానులకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. వారి సలహాలను వినండి, జవాబుదారీగా ఉండండి మరియు వారి ఖండనలకు నిష్కపటంగా ఉండండి, వారి సూచనలను అంగీకరించండి, వారి జీవిత అనుభవాలను గౌరవించండి, వారి మాదిరిని అనుసరించండి.
రెండవది, దేవుని శక్తివంతమైన చేయి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. పాత నిబంధనలో, దేవుని చేయి రెండు విషయాలను సూచిస్తుంది: ఆయన క్రమశిక్షణ మరియు ఆయన విమోచన. మనం ఆయన చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఆయన తన స్వంత సమయంలో మరియు మార్గంలో మనకు తనలాంటి విజయాన్ని అందించాలని కోరుకున్నప్పుడు, మనము ఆయన క్రమశిక్షణను మన మంచి కోసం మరియు ఆయన కీర్తి కోసం ఇష్టపూర్వకంగా అంగీకరిస్తాము మరియు ఆయన ఎంచుకున్న మార్గంలో ఆయన విమోచనను కృతజ్ఞతతో అంగీకరిస్తాము. మరో మాటలో చెప్పాలంటే, మనము పరిస్థితులను మార్చడానికి లేదా ప్రజలను మోసగించడానికి లేదా ఏదైనా ప్రచార పథకం ద్వారా మన స్వంత రూపాన్ని రుద్దడానికి నిరాకరిస్తాము. మనము దేవుణ్ణి దేవుడుగా ఉండటానికి అనుమతిస్తాము.
మూడవది, దేవుని దయ మరియు సంరక్షణ పొందటానికి ఆయన దృష్టిని ఆకర్షించడానికి కష్టపడండి. తప్పకుండా ఆందోళనలు వస్తాయి. ఇబ్బందులు మరియు నిరుత్సాహాలు, భయాలు మరియు చింతలు, మిమ్మల్ని అలసిపోజేసి నిరాశకు గురిచేస్తాయి. కాబట్టి, వాటిని తిరిగి ప్రభువుపైనే వేయండి! మీ భారాలను-మీ చింతలను-దేవునిపై వేయండి.
ఈ లేఖనాన్ని గూర్చిన ఆట యొక్క ఉపాయం ఈనాటి మీకు-మీరే ప్రచారం చేసుకోండి అనే ప్రచారంతో విరుద్ధంగా ఉంటుంది. కానీ దేవుడు బాధ్యత వహిస్తున్నప్పుడు, ఆయన మీ కోసం ఏ విజయాన్ని కలిగి ఉన్నాడో దాని సమయం మరియు పరిధి రెండూ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రణాళిక లేదా లక్ష్యాన్ని నిర్దేశించడం లేదా శ్రద్ధ వహించడం కోసం చోటు లేదని దీని అర్థం కాదు; మనము విజయాన్ని మన అంతరంగిక పుణ్యక్షేత్రంగా మార్చుకోవడానికి నిరాకరిస్తున్నామని దీని అర్థం. దేవుడు అందులో ఉన్నప్పుడు, మనం దాని గురించి గర్వపడకుండా ఆశ్చర్యపోతాము.
ఆ గంటలన్నీ ప్రయాసపడటం మరియు ప్రచారం చేసుకోవడం కంటే, మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయాన్ని అంతిమంగా వెచ్చిస్తారు. అలాగే ప్రభువు మీ కోసం కొంత సమయాన్ని కూడా మంజూరు చేస్తాడు, అదనంగా చేపలు పట్టడానికి కొన్ని అదనపు గంటలు! నమ్మశక్యంగా లేదు, కదూ? కానే కాదు.
Adapted from Charles R. Swindoll, “Forgotten Side of Success,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 60-61. Copyright © 1994, Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.