“ముందుకు సాగిపో!” అని చాలా తక్కువ మంది చెప్పడం వలన ఎంత మంది వ్యక్తులు ఆగిపోతున్నారు?
తన చక్కటి చిన్న పుస్తకం ఫుల్లీ హ్యూమన్, ఫుల్లీ అలైవ్‌లో, రచయిత జాన్ పావెల్ బహామాస్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడికి జరిగిన అనుభవాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్నప్పుడు, ఒక పలకలవంతెన చివర గుమిగూడిన గుంపును గమనించాడు. అతను గొడవను పరిశోధించడానికి ముందుకు కదిలాడు. పావెల్ ఇలా చెప్పాడు:
. . . ఇంట్లో తయారు చేసిన పడవలో ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించడానికి చివరి నిమిషంలో సన్నాహాలు చేస్తున్న యువకుడు అందరి దృష్టిని ఆకర్షించాడని అతను కనుగొన్నాడు. మినహాయింపు లేకుండా పలకలవంతెన మీద ఉన్న ప్రతి ఒక్కరూ నిరాశావాదులే. గాఢవాంఛగల నావికుడికి తప్పు జరగగల అన్ని విషయాలను చెప్పడానికి అందరూ చురుకుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. “సూర్యుడు నిన్ను కాల్చేస్తాడు!” “నీకు తగినంత ఆహారం ఉండదు.” “ఆ నీ పడవ తుఫానులో అలలను తట్టుకోదు.” [మరియు, వాస్తవానికి, ఆ సుపరిచితమైన పదాలు] “నువ్వు దీన్ని ఎప్పటికీ సాధించలేవు.”
నా స్నేహితుడు సాహసోపేతమైన యువకుడికి ఈ నిరుత్సాహపరిచే హెచ్చరికలన్నింటినీ విన్నప్పుడు, అతను కొంత ఆశావాదం మరియు ప్రోత్సాహాన్ని అందించాలనే కోరికతో ఉన్నాడు. చిన్న పడవ పలకలవంతెన మీద నుండి దూరం వెళ్లడం ప్రారంభించినప్పుడు, నా స్నేహితుడు పలకలవంతెన చివరకి వెళ్లాడు, జెండాలతో సంకేతాలు చేసినట్లు రెండు చేతులను విపరీతంగా ఊపుతూ ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అతను అరుస్తూనే ఉన్నాడు: “మంచిగా ప్రయాణించండి! నువ్వు నిజంగా ఏదో ప్రత్యేకమైనవాడవే! మేము నీతో ఉన్నాము. నిన్నుబట్టి మేము గర్విస్తున్నాము!”
ఇంట్లో తయారుచేయబడిన ఆ పడవ బయలుదేరుతున్నప్పుడు మీరు అక్కడ ఉండి ఉంటే, మీరు ఏ సమూహంలో చేరి ఉండేవారు? నిజాయితీగా ఉండండి. మనలో అత్యధికులు సాహసం కంటే ప్రమాదం గురించి ఎక్కువగా ఆలోచించి ఉంటారనడంలో సందేహం లేదు. మనలో చాలా మంది సరదాలు, ఆవిష్కరణలు, సముద్రంలోకి వెళ్లే వ్యక్తికి ముందు ఉన్న అద్భుతమైన అవకాశాలను గూర్చి కంటే కఠినతలు మరియు ఇబ్బందులు మరియు ప్రమాదాలను గురించే ఊహించి ఉంటాము. ప్రమాదాన్ని దాటి చూసే వారు . . . వారు ఏదైనా తెగించడానికి చేరువైన వారితో, “ఏదైనా సాధించడానికి పూర్ణబలముతో కృషి చేయండి!” అని చెప్పేవారు ఎంత తక్కువ.
తమాషాగా ఉంది, కదా? ఇది ఒకరి అంతర్గత సామర్థ్యానికి సంబంధించి ఊహించడం, దూరదృష్టి కలిగియుండటం, అన్ని ప్రమాదాలు మరియు కష్టాలు ఉన్నప్పటికీ, కనిపించని వాటి ద్వారా పరవశించిపోవడం.
తాడు చివరలో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా పర్వతారోహకులు తమను తాము తాడుతో ఒకరికొకరు కలుపుకోవడానికి ఒక కారణం అని నేను నమ్ముతున్నాను. ముందుగా ఎక్కిన అబ్బాయిలు ఎన్నడూ దానిని ఒక అవకాశంగా పరిగణించరు . . . కానీ వెనుకవైపు ఉన్నవారు, కీర్తి యొక్క సంగ్రహావలోకనం పొందటంలో చివరివారు అని చెప్పవచ్చు.
కొంతమంది దూరదృష్టి గలవారు పలకలవంతెనపై ఉన్న గుంపును వినడానికి నిరాకరించినందుకు నేను ఎంత సంతోషిస్తున్నానో ఇటీవల ఆలోచిస్తున్నాను. నేను సంతోషిస్తున్నాను . . .
– ఎడిసన్ లైట్ బల్బును కనుక్కోవడం వదల్లేదు
– లూథర్ వెనక్కి తగ్గడానికి నిరాకరించాడు
– మైఖేలాంజెలో పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు
– లిండ్‌బర్గ్ ఎగురుతూనే ఉన్నాడు
– భయపడిన యూదులకు పాపా టెన్ బూమ్ “అవును” అని చెప్పాడు
– జులియర్డ్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కట్లు మరియు వీల్‌చైర్‌ను దాటి చూచి పెర్ల్‌మాన్ అనే వయోలిన్ విద్యార్థిని చేర్చుకుంది.
మీరు ఆ జాబితాకు జోడించవచ్చు. మీరు కూడా జాబితాలో ఉండవచ్చు.
దాదాపు ప్రతిరోజు–ఖచ్చితంగా ప్రతి వారం–మనం తన స్వంత ఇంటిలో తయారు చేయబడిన పడవలో బయలుదేరడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వ్యక్తిని ఎదుర్కొంటాము. అది స్నేహితుడు, సహచరుడు, సహోద్యోగి, పొరుగువాడు, కుటుంబ సభ్యుడు కావచ్చు. సాధ్యాసాధ్యాల సముద్రం విపరీతంగా ఆహ్వానించదగినది, అయిననూ అది భయంకరమైనది. ముందుకు కొనసాగమని వారిని ధైర్యపరచండి! “మీరు నిజంగా ప్రత్యేకమైనవారే . . . మిమ్మునుబట్టి నేను గర్విస్తున్నాను!” అని ఉత్తేజకరముగా కేకలు వేయండి. వారు ఎక్కువగా వినవలసినది చెప్పడానికి ధైర్యం చేయండి, “ఏదైనా సాధించడానికి పూర్ణబలముతో కృషి చేయండి!” తరువాత పిచ్చివాడిలా ప్రార్థించండి.
పలకలవంతెన చివరన మరింత ధైర్యవంతులు నవ్వుతూ మరియు ధృవీకరిస్తూ ఉంటే ఎంత సాధించవచ్చు.
Taken from Charles R. Swindoll, “Go for It,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 134-35. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide. Used by permission.