ఆశలేని నాయకత్వము

సహజ మరియు ఆత్మీయ నాయకత్వం మధ్య ముఖ్యమైన సమతుల్యతను మనం పరిశీలిద్దాం. ఒక నాయకుడు, స్పష్టంగా, దేవుడు ఇచ్చిన కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉండాలి. అవి ఇతరులు అతని లేదా ఆమె యొక్క ప్రభావానికి ప్రతిస్పందించడానికి కారణమవుతాయి. అదే సమయంలో, క్రైస్తవ నాయకుడు పరిశుద్ధాత్మచేత నడిపించబడి, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వినయపూర్వకమైన భక్తిని కలిగి ఉండాలి. . . అప్పుడు అతను స్వయం-నియమితుడైన గాఢవాంఛగల జీవి యొక్క వర్గంలోకి రాకుండా ఉంటాడు. ఈ విషయంపైనే నేను కొన్ని నిమిషాలు బస చేయాలనుకుంటున్నాను.

డాక్టర్ ఎ.డబ్ల్యు. టోజర్ రాశాడు:

నిజమైన మరియు సురక్షితమైన నాయకుడు నాయకత్వం వహించాలనే కోరిక లేని వ్యక్తియై ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క అంతర్గత ఒత్తిడి మరియు బాహ్య పరిస్థితుల ఒత్తిడి ద్వారా నాయకత్వ స్థానానికి బలవంతం చేయబడతాడు. మోషే, దావీదు, మరియు పాత నిబంధన ప్రవక్తలు అలాంటివారే. పౌలు నుండి నేటి వరకు ఉన్న గొప్ప నాయకులందరూ కూడా ఆ పని కోసం పరిశుద్ధాత్మ చేత రూపొందించబడి, తమకు ఆసక్తిలేని స్థానాన్ని పూరించడానికి సంఘము యొక్క ప్రభువుచేత నియమించబడ్డారు. నాయకత్వం వహించటానికి గాఢవాంఛగల వ్యక్తి నాయకుడిగా అనర్హుడని, ఇది చాలా నమ్మదగిన నియమముగా అంగీకరించవచ్చని నేను నమ్ముతున్నాను.1

ఆత్మీయ నాయకులు, మెజారిటీ ఓటు లేదా మతపరమైన నిర్ణయాలు, సమావేశాలు లేదా మతవిషయకసభల ద్వారా తీసుకోబడరు. దేవుడు మాత్రమే వారిని తయారు చేయగలడు!

తూర్పునుండియైనను పడమటినుండియైనను,
అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు;
దేవుడే తీర్పు తీర్చువాడు;
ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును (కీర్తన 75:6-7).

దీని అర్థం, కొంతమంది వ్యక్తులను నాయకత్వ స్థానాలకు సిద్ధం చేయడం, నిర్మించడం, శిక్షణ ఇవ్వడం మరియు ప్రోత్సహించడం దేవుడు తన బాధ్యతగా చేస్తాడు. అది ఆయన పని, మనది కాదు. యిర్మీయా 45:5 వినండి:

నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు . . .

ఆ మాటలు ఎప్పటికీ మరచిపోబడకుండునుగాక. నువ్వే-చేసుకోవాలి అనే యుగంలో మనం జీవిస్తున్నాము. వృద్ధిచేయుట, ప్రకటన, సమాజంలో స్థానము మరియు ఆకర్షణీయంగా ఆలోచించడానికి మనము అమర్చబడ్డాము. ఇటువంటి విషయాలు పరిచర్యను వాణిజ్యపరం చేస్తాయి మరియు అనవసరమైన వ్యూహాలను రుచి చూపిస్తాయి. . . లేదా, పౌలు మాటల్లో చెప్పాలంటే:

. . . కుయుక్తిగా నడుచుకొనుచు . . . దేవుని వాక్యమును వంచనగా బోధించుచు . . . మమ్మునుగూర్చి ప్రకటించుకొనుచు . . .

దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రోత్సహించకపోయినను, ప్రతిభావంతుడైన, సమర్థుడైన, నాయకత్వానికి అర్హత ఉన్న వ్యక్తిని నేను సంబోధించుచున్నానా? స్వార్థపూరిత ఆశయం యొక్క ప్రమాదం గురించి మిమ్మల్ని హెచ్చరించనివ్వండి. నిశ్శబ్దంగా మరియు సూక్ష్మమైన మార్గాల్లో మిమ్మల్ని గమనించడానికి, మీచేత ఆకట్టుకోబడటానికి ఇతరులను మీరు మోసపుచ్చవచ్చు. ఆశయం యొక్క చౌకైన మత్తుమందు మీ అంతర్గత మనస్సాక్షి యొక్క బాధను తగ్గించగలవు. . . కానీ మీరు మీ స్వీయ-నిర్మిత కీర్తి యొక్క కెరటాన్ని అది ఉన్నంతవరకు దానిపై స్వారి చేయవచ్చు. అయ్యో, అది చివరికి పాములాగా కాటువేస్తుంది.

సొలొమోను మాటలు బాగా సరిపోతాయి:

నరుని మార్గములను యెహోవా యెరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాపపాశములవలన బంధింపబడును (సామెతలు 5:21-22).

సానుకూల గమనికతో నన్ను ముగించనివ్వండి. తాను ఏమి చేయనైయున్నాడో దేవునికి తెలుసు. ఆయన మిమ్మల్ని కొంతకాలం పని నుండి పక్కనబెట్టినట్లైతే, ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. మీరు నమ్మకంగా ఉండండి. . . సరళంగా ఉండండి. . . అందుబాటులో ఉండండి. . . దావీదు తన గొర్రెలతో (అతను రాజుగా అభిషిక్తుడైన తరువాత కూడా!) ఉన్నట్లుగా వినయంగా ఉండండి. అస్పష్టత యొక్క పాఠశాల గదిలో మీ పాఠాలను బాగా నేర్చుకోండి. దేవుడు తన ఎంచుకున్న బాణంగా మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇంకా మీ బాణము ఆయన అమ్ముల పొదిలో, నీడలలో దాగి ఉంది . . . కానీ గొప్ప ప్రభావంతో చెప్పే ఖచ్చితమైన క్షణంలో, ఆయన మిమ్మల్ని అందుకుంటాడు మరియు ఆయన నియామక స్థలానికి మిమ్మల్ని యెక్కుపెడతాడు.

  1. Taken from A. W. Tozer in “The Reaper,” February 1962, p. 459, as quoted in J. Oswald Sanders, Spiritual Leadership (Chicago: The Moody Bible Institute, 1980), 35-36. Used by permission.

Taken from Charles R. Swindoll, Growing Strong in the Seasons of Life (Grand Rapids, Mich.: Zondervan Publishing House, 1983) 388-389. Copyright © 1983 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.

Posted in Holy Spirit-Telugu, Leadership-Telugu, Pastors-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.