యాన్ మారో బిడియముగలది మరియు సున్నితమైనది. సీతాకోకచిలుక లాంటిది.
అలాగని మొద్దుగా లేదా తెలివితక్కువగా లేదా అసమర్థంగా కాదు, కానీ పిరికితనము యొక్క నిశ్చలమైన నమూనా. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కోసం దక్షిణ సరిహద్దును సందర్శించిన సాహసోపేతమైన యువకుడిని కలిసినప్పుడు ఆమె తండ్రి మెక్సికోకి రాయబారిగా ఉన్నారు. ఆ వ్యక్తి విమానయానాన్ని ప్రోత్సహిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దూసికొనిపోవుచున్నాడు. అతను వెళ్లిన ప్రతిచోటా అతను విస్తారమైన సమూహాలను ఆకర్షించాడు. చూడండి, అట్లాంటిక్‌ను విమానంలో దాటిన మొదటి వ్యక్తిగా అతను $40,000 గెలుచుకున్నాడు. బలమైన పైలట్ మరియు బిడియముగల యువరాణి గాఢ ప్రేమలో పడ్డారు.
ఆమె శ్రీమతి చార్లెస్ లిండ్‌బర్గ్‌గా మారినప్పుడు, యాన్ తన భర్త చాటున ఉండిపోయి ఉండవచ్చు. అయితే, ఆమె అలా ఉండలేదు. తరువాతి నలభై ఏడు సంవత్సరాలు ఇద్దరినీ కలిపిన ప్రేమ బాధ్యతాయుతమైన ప్రేమ, పరిపక్వమైన ప్రేమ, యిది విజయం మరియు విషాదంతో సమానంగా పరీక్షించబడింది. గుంపులో అనామక జంటగా ఉండే ప్రశాంత సౌలభ్యం వారికి ఎప్పటికీ తెలియదు. లిండ్‌బర్గ్ అనే పేరు ఆ సుఖాన్ని అనుమతించలేదు. ఆమె భర్త, అతను ఎక్కడికి వెళ్లినా, వార్తల్లో ఉండేవాడు, ఎప్పటికీ ప్రజాకర్షణ కలిగే ఉన్నాడు . . . నిజంగా జాతీయ వీరుడు. కానీ ఆరాధకుల సమూహంలో ఆగ్రహంతో ఏకాంతవాసిగా లేదా పేరులేని మరొక ముఖంగా మారడానికి బదులుగా, యాన్ మారో లిండ్‌బర్గ్ అమెరికా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన రచయితలలో ఒకరిగా ఎదిగారు, ఒక మహిళ తన సొంత విజయాల వలన ఎంతో ప్రశంసించబడింది.
ఎలా? ఆమె వృత్తిలో విజయానికి గల సూత్రం ఏమిటో ఆమెనే చెప్పనిద్దాం.
గాఢ ప్రేమలో ఉండడం అనేది గొప్ప విడుదలనిచ్చే శక్తి మరియు స్వేచ్ఛనిచ్చే అత్యంత సాధారణ అనుభవం . . . . ఆదర్శవంతంగా, ప్రేమలో ఉన్న జంట క్రొత్త మరియు విభిన్న లోకాలకు ఒకరినొకరు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. నేను యిటువంటి సాధారణ నియమానికి మినహాయింపేమీ కాదు. నేను ప్రేమించబడ్డాను అనే వాస్తవం నమ్మశక్యం కాదు మరియు నా ప్రపంచాన్ని, జీవితం గురించి మరియు నా గురించి నా భావాలను మార్చివేసింది. నాకు ధైర్యం, బలం మరియు దాదాపు క్రొత్త స్వభావం ఇవ్వబడ్డాయి. నేను వివాహం చేసుకోబోతున్న వ్యక్తి నన్ను నమ్మాడు మరియు నేను ఏమి చేయగలనో నమ్మాడు, తత్ఫలితంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలనని నేను తెలుసుకున్నాను.
చార్లెస్ యాన్‌ని అసాధారణ స్థాయిలో విశ్వసించాడు. పైకి కనబడే ఆమె యొక్క బిడియాన్ని కాక అతడు ఆమెను లోతుగా గమనించాడు. ఆమెలో దాగియున్న ఊటలో వివేకం యొక్క సంపద, లోతైన, గంభీరమైన, ఉపయోగించబడని సామర్థ్యంగల నిల్వ ఉందని అతను గ్రహించాడు. అతని ప్రేమ భద్రతలో ఆమె విముక్తి పొందింది-విడుదలైంది-తన సొంత సామర్థ్యాన్ని కనుగొనడం మరియు అభివృద్ధి చేసుకోవడం, తాను సహానుభూతి కలిగి ఉండడం, తన సొంత నైపుణ్యాలను పెంపొందించుకోవడం మరియు ఆ బిడియముగల గూడు నుండి బయటపడిన అందమైన, ఎల్లప్పుడూ సున్నితమైన సీతాకోకచిలుక తన ఉనికి తన భర్త నీడ యొక్క సరిహద్దును మించి చాలా జీవితాలను మెరుగుపరుస్తుంది. అతను తన స్వంతముగా ముందుకు వెళ్లమని ఆమెను ప్రోత్సహించాడు మరియు దాని వలన అతను ఆమెను మెచ్చుకున్నాడు.
ఆమె విశృంఖలమైన, దృఢమైన, స్వేచ్ఛగల భార్య అని, ఏది ఏమైనా సరే “తనకిష్టమొచ్చింది తాను చేయటానికి” సుముఖత చూపుతుందనే అర్థం వస్తుందా? నేను ఆ ముద్రను వేస్తున్నానా? అలా అయితే, నేను స్పష్టంగా వ్యక్తపరచడం లేదు. అప్పుడు యాన్ మారో లిండ్‌బర్గ్ యొక్క చిత్రము ఖచ్చితమైనది కాదు. ఆమె సీతాకోకచిలుక, గుర్తుంచుకోండి . . . డేగ కాదు.
దీని గురించి తప్పుగా ఆలోచించవద్దు, ఈ స్త్రీ తన పురుషునితో విడదీయరాని ప్రేమలో బంధీ అయ్యింది. నిజానికి, అతని యొక్క ఆదరించే ప్రేమలో తన పరిమితమైన, సిగ్గుపడే ప్రపంచం యొక్క పరిమితులు దాటి, ఇతరులకు సహాయపడాలనే ధైర్యాన్ని ఆమె పొందుకున్నది.
మనము మూలాలు మరియు ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాము. భరోసా ఇవ్వగలిగేంత బలంగా ఉన్న భర్త ప్రేమ, అయితే విడుదల చేయడానికి బెదరనిది. ఆలింగనం చేసుకునేంత గట్టిగా, ఆనందించేంత వదులుగా ఉంది. అయస్కాంతంలాగా పట్టుకుంటుంది, అయితే ఎగిరిపోవటానికి అనుమతించేంత గొప్పది . . . ఇతరులు ఆమె విజయాలను ప్రశంసిస్తూ మరియు ఆమె సామర్థ్యాన్ని మెచ్చుకోవడంతో అసూయ పడకపోవడం. యాన్, అనే బిడియముగలది, రెక్కలాడిస్తూ ఎగురునట్లుగా, చార్లెస్, అనే భద్రపరచువాడు, వలను ప్రక్కన పడేశాడు.
ప్రేమపై వ్రాసిన అత్యుత్తమ వ్యాసం యొక్క సారాంశం ఇది కాదా. . . నిజమైన అగాపేకు ఖచ్చితంగా అవసరమైనది?
ప్రేమ . . . దయ చూపించును, ఎప్పుడూ మత్సరపడదు . . . డంబముగా ప్రవర్తింపదు లేదా అది ఉప్పొంగదు . . . ఏది ఏమైనా సరా . . . మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు నమ్మకంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ అతనిని నమ్ముతారు, ఎల్లప్పుడూ మంచిని ఆశిస్తారు. . . ఎల్లప్పుడూ అతనిని (లేదా ఆమెను) సమర్థిస్తూ నిలబడతారు. (1 కొరింథీయులకు 13 టియల్‌బి)
ఇది రాయ్ క్రాఫ్ట్ మాటల వలె ఉంటుంది:
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, / నువ్వు ఏమైయున్నావో దాని కోసం మాత్రమే కాదు
నేను ఏమైయున్నానో అందుకోసం / నేను నీతో ఉన్న క్షణాల కోసం.నేను నిన్ను ప్రేమిస్తున్నాను, / నువ్వు సాధించిన విజయాలనుబట్టి
వాటి కోసం మాత్రమే కాదు
నువ్వు నన్ను మలచుచున్నావు / అందుకోసం.నేను నిన్ను ప్రేమిస్తున్నాను, / నాలో నాకు తెలియని దాన్ని / నువ్వు బయటకు తెచ్చినందుకు;
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, / నీ చేయి వేసినందుకు
కుప్పకూలిన నా హృదయంలోకి
మరియు అన్ని మూర్ఖమైన / బలహీనమైన విషయాల గుండా నేను దాటుచున్నప్పుడు
నువ్వు నిస్సహాయ స్థితిలో / దిగులుగా చూస్తూ,
మరియు వెలుగులోనికి / తీసుకొస్తున్నావు
అందమైన వస్తువులన్నీ
మరెవరూ చూడని / కనుగొనలేనంత దూరం.నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వు
నా జీవితం యొక్క కలపలోనుండి తయారు చేయడానికి / నాకు సహాయం చేస్తున్నావు
చావడిని కాదు / దేవాలయాన్ని తయారు చేయడానికి;
నా అనుదిన / పనుల్లోనుండి
నిందను కాదు / ఒక పాటను తయారు చేస్తున్నవు.1
భయం మరియు పిరికితనం యొక్క గూడు వెలుపల ఆమె రెక్కలు విస్తరించడానికి స్థలం, భరోసా, క్రొత్తగా ఆవిష్కరించుకోవడానికి అవసరమైన ఒక సున్నితమైన సీతాకోకచిలుక మీకు ఉందా? ఆమెకు తన స్వంత స్వరూపము ఉందని మరియు మీ నాలుగు గోడలను దాటి ఆమె యొక్క అందం మరియు దయ మరియు శైలి ప్రశంసించబడటం గుర్తించాల్సిన అవసరం ఉందా? మీరు వలను ప్రక్కన పెట్టి, ఇతరులు కూడా ఆమెను ఆస్వాదించడానికి ఉదారంగా ఉన్నారా? ఆమె దేవునిది, మీకు తెలుసుగా . . . మీ సొత్తు కాదు. మరియు అది నిజం కనుక, ఆయన మహిమ కోసం ఆమె మనోహరమైన రెక్కలను విస్తరించడానికి మీరు ఆమెను విడుదల చేస్తే, ఆమె తన మూలాలను మరచిపోకుండా విడిచిపెట్టకుండా ఎగురుతుంది. మీకు మరేవిధంగానూ ఎప్పటికీ తెలియని ఆనందం యొక్క పరిమాణాలను జోడిస్తూ, ఆమె రెక్కలు కొట్టుకొనుచు వృద్ధి చెందుతుంది.
కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే, తోటి భర్తా, దేవుడు మీకిచ్చిన బిడియంగల, సున్నితమైన సౌందర్యాన్ని మీరు మెచ్చుకోకుండా మీరు ఒకచోటు నుండి మరొకచోటికి ఎగురుతూ చాలా బిజీగా ఉంటారు. ఆమె మీ జీవితపు నీడ క్రింద దాగియున్న గూడులో నివసిస్తున్నదని మీరు మరచిపోతారు . . . చలనములేని, నిశ్శబ్దంగా, ఎగురుచున్న సీతాకోకచిలుక లాగా కనిపిస్తోంది, కానీ గాజు కింద ఒక నమూనా లాగా అనిపిస్తుంది.
- Roy Croft, “Love,” quoted in Jack Mayhall, Marriage Takes More Than Love (Colorado Springs: Navpress, 1978), 47.
Adapted from Charles R. Swindoll, “Love without a Net,” in Growing Strong in the Seasons of Life (Portland, Ore.: Multnomah, 1983), 66–68. Copyright © 1983 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.