ఆదికాండము 2 వ అధ్యాయము ఒక చరిత్ర. సంకేతాలను మరియు ప్రేరేపిత రచయిత చరిత్రను ఎలా వ్రాసారో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, వివాహం దేవుని ఆవిష్కరణ అని మనము కనుగొంటాము. ఈ జీవితకాలమంతయు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య ప్రత్యేకమైన ఐక్యత ఒక కుటుంబం నిర్మించబడే పునాదిగా మారాలని ఆయన అనుకున్నాడు. మానవ సంబంధాలలో ఇది మొదటిది, ఈ సంబంధము సృష్టి ఆరంభానికి వెళ్తుంది.
దేవుడు ఒంటరిగా ఉన్న నరుని తోటలో ఉంచాడు, అది అతని ప్రతి భౌతిక అవసరాన్ని తీర్చగలదు, అయితే “అతనికి ఇంకా అవసరం ఉంది,” అని అతని విషయమై సమర్ధవంతముగా నిర్ధారణ చేయవచ్చు. కాబట్టి సృష్టికర్త, “నేను అతనికి సాటియైన సహాయమును చేయుదును” అని అన్నాడు. ముఖ్యంగా రెండు పదాలను గమనించండి: “సహాయము” మరియు “సాటియైన.”
ఆదాముకు ఒక సహాయము అవసరం. ఇప్పుడు నేను దాదాపు అందరిలో ఆశ్చర్యాన్ని వినగలుగుతున్నాను, కానీ మనం ఆంగ్లములోని సహాయము యొక్క అర్థాన్ని చొప్పించి చదవటానికి ముందు మనకు హీబ్రూ వ్యాకరణం నుండి కొద్దిగా సహాయం కావాలి. “సహాయము” అనేది చిన్నగా అనిపిస్తుంది, కొంచెం దయనీయంగా కూడా ఉంది. ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయడానికి జ్ఞానం మరియు నైపుణ్యం కలిగి ఉంటాడని, అయితే “సహాయము” చేసేవాడు కేవలం పనిని సులభతరం చేస్తాడని మనము భావిస్తాము. కానీ హెబ్రీయులు దానిని అలా ఉపయోగించరు. ఎజెర్ అనే పదము కీలకమైనది ఏదైనా లోపించిన దాన్ని అందించాలనే భావము కలిగివున్నది, మరియు అది చాలా తరచుగా దేవుని సూచిస్తుంది (కీర్తన 30:10, 54:4).
హెబ్రీయుని మనస్సులో “సహాయకుడు” అంటే చాకిరివాడు కానేకాదు. దేవుడు ఆదామును చూశాడు మరియు కీలకమైనది ఏదో లేదని గుర్తించాడు. మానవజాతి అసంపూర్ణంగా ఉంది. అతని ఒంటరితనం మంచిది కాదు. నరులు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోవాలని ఆదికాండము 1 నుండి మనకు తెలుసు. అతను ఒంటరిగా నెరవేర్చలేని ఉద్దేశం కొరకు ఆదాము సృజించబడ్డాడు. జీవిత గీతాన్ని యుగళగీతముగా, అన్యోన్యముగా పాడవలసియుండగా, ఆదాము ఒక స్వరం మాత్రమే అయ్యి ఉన్నాడు. అతని ఒంటి గొంతుతో పాడేపాట సరిపోదు.
ఇంకా, సరియైన గొంతు మాత్రమే సరిపోతుంది. సహాయము తప్పనిసరిగా “సాటియైన” సహాయముగా ఉండాలి లేదా, ఖచ్చితంగా చెప్పాలంటే, “అతనికి భిన్నముగానున్న వ్యక్తి” లేదా “అతనికి సంబంధించిన వ్యక్తి” అని గమనించండి. సృష్టించబడిన వాటి కంటే చాలా భిన్నమైన జీవిగా ఈ రెండవ మానవ సృష్టి ఉండాలి.
కాబట్టి దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి స్త్రీని నిర్మించాడు (ఆదికాండము 2:21-23). ఒకసారి ఆదాము “శస్త్రచికిత్స నుండి కోలుకున్నాక” అతను కళ్ళు తెరిచి ఆ స్త్రీని చూశాడు. హెబ్రీ భాషలో ఆ స్త్రీని చూడగానే అతను పలికిన మొదటి మాటలు నొక్కిచెప్పబడ్డాయి, కాబట్టి అవి “ఇప్పుడు, మొత్తానికి, చివరికి!” అని అనువదించబడాలి. ఆమె అతని ప్రతి బలం మరియు బలహీనతను ఏ ఇతర జీవి చేయలేని విధంగా సంపూర్ణంగా పూర్తి చేసింది. ఆదాము యొక్క ప్రకటన, “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసమ” అనేది దగ్గరితనాన్ని, ఏకత్వాన్ని లేదా సాన్నిహిత్యాన్ని వివరించే ఒక హీబ్రూ వ్యక్తీకరణకు ఆధారం. అతను కోరుకున్న ప్రతిదానికి ఆమె నెరవేర్పు అని ఇది తెలియజేస్తుంది. అలాగే దేవుడు చేసిన ప్రతి జీవిని చూసిన తరువాత, అతను ఈ విషయం తెలుసుకోవడానికి మంచి స్థితిలోనే ఉన్నాడు. ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వేయబడిన ఒక ఘనమైన సన్నివేశం, ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథకు నాంది.
పడిపోవుటకు ముందు ఆదాము మరియు హవ్వ మనకు మాదిరిగా ఉన్నారు. స్వచ్ఛమైన, అవరోధం లేని, నిస్వార్థమైన, పరస్పరం సృష్టించబడిన ఇద్దరు వ్యక్తులు ఆనందించే ఆనందకరమైన కలయిక. అడ్డంకులు లేవు. ఇబ్బందులు లేవు. మోటుతనము లేదు. భవోద్వేగ వ్యక్తిగత సమస్యలు లేవు. కేవలం సాన్నిహిత్యం.
Adapted from Charles R. Swindoll, Marriage: From Surviving to Thriving (Nashville: W Publishing Group, 2006), 29–35. Copyright © 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.