మీరు తీవ్రమైన శ్రమ గుండా వెళుతున్నారా? మీరు మీ ఆకలిని కోల్పోయి ఉండవచ్చు లేదా మీరు కొన్ని వారాలుగా లేదా నెలలుగా సరిగ్గా నిద్ర లేకుండా ఉండియుండవచ్చు. భయము మరియు విస్మయము నెమ్మదిని మరియు శాంతిని భర్తీ చేశాయి. మీరు ఒంటరితనం, నిరుత్సాహం మరియు ఏకాంతవాసం అనుభవిస్తున్నారు, వీటిని అంతులేని శారీరక లేదా మానసిక బాధతో జటిలం చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేసారు మరియు ఇతరులను కూడా ప్రార్థించమని కోరారు. అయిననూ, ఉపశమనం లేదు.
నేను చాలా సంవత్సరాల క్రితం ఈ రకమైన ఎడతెరపిలేకుండా దుఃఖిస్తూ నెమ్మదిలేమిని అనుభవించాను. నేను ఒకటి కాదు అనేక విశేషమైన శ్రమలను భరించాను, ఇవి వారములు గడిచేకొద్దీ తీవ్రతరమవుతూ వచ్చాయి. నా జీవితంలో అతి హీనమైన దినములలో, నా నివసమునకు దగ్గర్లోని ఒక కొండపైకి వెళ్లాను. కర్రలు మరియు కొమ్మలపై పడి, ఏడవటం ప్రారంభించాను. నా చేతులు మరియు ముఖం తడిసిపోయే వరకు . . . కొండలవైపు తేరిచూస్తూ నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. ఎటువంటి పదాలను వర్ణించలేని నిట్టూర్పులుగా మరియు మూలుగులుగా దుఃఖం మారింది.
ఆ కొన్ని గంటలలో, ఆత్మ నా పక్షమున విజ్ఞాపన చేస్తూ నాకు నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియను జరిగించుచున్నాడు. నేను నా ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు, శ్రమల పరిస్థితి ఏమీ మారలేదు, కానీ నేను మార్పుచెందాను. నేను పరిశుద్ధాత్మ యొక్క సన్నిహిత పరిచర్యను అనుభవించాను. మన ప్రార్థనలు మరియు మాటలు మన బాధ యొక్క పూర్తి పరిమాణమును వ్యక్తపరచడం ఆపివేసినప్పుడు, ఆత్మ మన తరపున మధ్యవర్తిత్వం చేయడం ద్వారా భరోసా, ఓదార్పు మరియు ఉపశమనాన్ని అందిస్తాడు.
రోమీయులకు 8:26–27 మనకు ఇలా వాగ్దానం చేస్తుంది:
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు.
అవును, ముఖ్యంగా అంధకార సంబంధమైన శ్రమల్లో ఉన్నప్పుడు, ఈ గొప్ప వాగ్దానం నిజమని నేను గుర్తించాను. మీ ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఇచ్చిన శక్తివంతమైన సంరక్షణను మీరు అనుభవించారా?
ఇన్సైట్ ఫర్ లివింగ్ యొక్క వెబ్‌సైట్‌లో పవిత్రాత్మ గురించి కథనాలు ఉన్నాయి (“భూతము కాని ఆత్మ” చూడండి). వాటిని చదవమని మరియు మన దేవుని శక్తివంతమైన, ఆదరించు సన్నిధి గురించి తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
Copyright © 2011 by Insight for Living Ministries. All rights are reserved worldwide.