చిత్తశుద్ధి కోసం యుద్ధం

మన దేశంలో మరియు దేవుని కుటుంబంలో జరుగుచున్న విషయాలను చూస్తే నేను బాధపడుతున్నానని నేను మీకు చెప్పాలి. నా ప్రధాన యుద్ధం ఒక మాట, ఒక భావనతో సంబంధం కలిగి ఉంది. నా యుద్ధం చిత్తశుద్ధితో సంబంధం కలిగి ఉంది.

మన దేశంలో-మరియు చర్చిలో-చిత్తశుద్ధి విషయంలో తగ్గుదల, తప్పిపోవడం మరియు రాజీపడటం జరుగుతోంది. 1990 ల అభివృద్ధి అనేది చిత్తశుద్ధి లేని పునాదిపై నిర్మించబడిందని ఇటీవలి ముఖ్యాంశాలు మనకు నేర్పించాయి. కానీ రాజీ అనేది తమ ఉద్యోగులకు ద్రోహం చేసే CEO లకు లేదా ప్రజల డబ్బును దోచుకునే రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాదు. చాలా తరచుగా మన సంఘములోని బల్లల వెనుక మరియు అంతకంటే ఘోరంగా పుల్పిట్ వెనుక నైతిక దిగజారుడుతనం కనిపిస్తుంది.

చిత్తశుద్ది అంటే ఏమిటో నన్ను నిర్వచించనివ్వండి. వెబ్‌స్టర్స్ మనకు చిత్తశుద్ధి అంటే “లోపం లేని పరిస్థితి”1 అని చెబుతుంది. దీని అర్థం మంచి స్థితిలో ఉండటం. చిత్తశుద్ధికి హీబ్రూ పదం, తోమ్, కూడా పూర్ణముగా లేదా దృఢంగా ఉండటమనే అర్థాలను కలిగియున్నది.

అతడు యథార్థహృదయుడై [తోమ్] వారిని పాలించెను
కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను. (కీర్తన 78:72)

చిత్తుద్ధి అంటే సంపూర్ణత లేదా మంచితనం. ఎవరూ చూడనప్పుడు కూడా మీరు పని పూర్తి చేస్తే మీకు చిత్తుద్ధి ఉన్నట్లు. మిమ్మల్ని ఎవరూ తనిఖీ చేయనప్పుడు కూడా మీరు మీ మాటను నిలబెట్టుకుంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లు. మీరు మీ వాగ్దానాలకు కట్టుబడి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లు. చిత్తశుద్ధి అంటే మాయ చేయకపోడం మరియు కపటత్వానికి వ్యతిరేకంగా ఉండటం. మీరు చిత్తశుద్ధి గల వ్యక్తి అయితే, మీరు చెప్పింది చేస్తారు. మీరు ఏమి ప్రకటిస్తున్నారో, ఆలాగుండుటకు మీరు మీ వంతు కృషి చేస్తారు. ఆర్థిక జవాబుదారీతనం, వ్యక్తిగత విశ్వసనీయత మరియు వ్యక్తిగత స్వచ్ఛత కూడా చిత్తశుద్ధి క్రిందికే వస్తాయి. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఇతరులను మోసం చేయడు. అతడు లేదా ఆమె అహంకారం లేదా సొంత ఘనత వైపు మొగ్గుచూపరు. చిత్తశుద్ధి నిర్మాణాత్మక మరియు అవసరమైన విమర్శలను కూడా ఆహ్వానిస్తుంది ఎందుకంటే ఇది జవాబుదారీతనంను మెచ్చుకుంటుంది. ఇది మంచిది. ఇది దృఢమైనది. ఇది పూర్ణమైనది.

చిత్తశుద్ధి దృఢంగా ఉంటుంది. ఒంటరిగా నిలబడవలసి వచ్చినప్పుడు అది పగులదు మరియు ఒత్తిడి పెరిగినప్పటికీ అది విరిగిపోదు. చిత్తశుద్ధి ఒకరి నిజాయితీ పరీక్షింపబడటానికి భయపడకుండా లేదా సూక్ష్మ పరిశీలన యొక్క ఖచ్చితమైన డిమాండ్లను నిరోధించకుండా చేస్తుంది. ఇది నిజాయితీగా ఉండటానికి ఏమి చేయటానికైనా వెనుకాడదు.

లూయిస్ ఆడమిక్ మాటలు సముచితంగా అనిపిస్తాయి, “ధైర్యం, చిత్తశుద్ధి, స్వభావం మరియు సూత్రం యొక్క ఒక నిర్దిష్ట సమ్మేళనం ఉంది. దీనికి సంతృప్తికరమైన పేరు నిఘంటువులో లేదు, కానీ వివిధ దేశాలలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు విధాలుగా యిది పిలువబడింది. దీనికి మన అమెరికన్ పేరు ‘ధైర్యం.’”2

నాకు అది ఇష్టం. అలా చేయటం వలన బాధ కలిగించినప్పటికీ, నిజం చెప్పడానికి ధైర్యం కలిగి ఉండటమే చిత్తశుద్ధి. మోసం మెరుగైన శ్రేణిని తీసుకువచ్చినప్పటికీ, నిజాయితీగా ఉండటానికి ధైర్యం కలిగియుండటమే చిత్తశుద్ధి. ఇతరుల పనిని మనం ఉపయోగిస్తున్నప్పుడు దానిని మన పనిగా చూపించుకోకుండా, వారి మూలక్రియలను గుర్తించి వారి పేరును ధైర్యంగా మన పనిలో ప్రస్తావించడమే చిత్తశుద్ధి కలిగియుండటం.

కానీ చిత్తశుద్ధి కానివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది పాపములేని పరిపూర్ణత కాదు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి పూర్తిగా పాపం లేని జీవితాన్ని జీవించలేడు. ఎవరూ ఉండలేరు. కానీ చిత్తశుద్ధి ఉన్నవాడు తన వైఫల్యాలను త్వరగా అంగీకరిస్తాడు మరియు తప్పును దాచడు.

ఇప్పుడు, ఈ గుణం యొక్క కీలకమైన గుర్తును గూర్చి మాటలాడుచున్నప్పుడు, నేను “విఫలమైనవారికి సహాయం” చేసేవానిలాగా తారసపడవచ్చు, కానీ అంతకంటే బాగా నా గురించి మీకు తెలుసు. నేను అందరిలాగే విఫలమవుతాను. ఎంత త్వరగా మీరు దాన్ని గుర్తుకు తెచ్చుకుంటారో, అంత త్వరగా మనం నిలుచుంటాము. కానీ చిత్తశుద్ధిని గురించిన విషయమైతే, నేను మాట ఇస్తున్నాను. నేను విఫలమైనా లేదా ఇన్సైట్ ఫర్ లివింగ్ ఏదో ఒక విధంగా విఫలమైనా మీకు తెలుస్తుంది. నేను మీకు చెప్తాను. ఏదో అబద్ధమును నిజమని నమ్మించేందుకు నేను మిమ్మల్ని నడిపించను. సువార్త పరిచారకునిగా నేను చేయగలిగినది అదే.

సంఘములో, మార్కెట్‌ ప్రదేశంలో, మరి ముఖ్యంగా గృహంలో చిత్తశుద్ధి అవసరం. మీరు చిత్తశుద్ధితో నడుస్తున్నప్పుడు, మీ పిల్లలు అనుసరించుటకు వారసత్వంగా మీరు దానిని విడిచిపెడతారు (సామెతలు 20:7). ఇది తండ్రి యొక్క వ్రేలి గురుతని నేనంటాను. మీకు చిత్తశుద్ధి ఉన్న తండ్రి, ధైర్యం ఉన్న తల్లి ఉంటే మీరు ధన్యులు.

మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు, మీరు ప్రభువును ఘనపరచుచున్నారు. మీ వృత్తితో సంబంధం లేకుండా, మీ స్వభావం మరియు ప్రవర్తన పరిచర్య యొక్క విధానములు. 50 సంవత్సరాల క్రితం, ఎల్టన్ ట్రూబ్లడ్ ఇలా వ్రాశాడు,

నైతిక అంశం లేని ఏ ఉద్యోగం గురించైనా ఆలోచించడం కష్టం. అతను నియమానుసారం లేకుండా మరియు బాధ్యతారహితంగా ఉంటే దంతవైద్యుడి నైపుణ్యం పూర్తిగా అసంబద్ధమైనది. రోగి సాధారణంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందున, అనవసరంగా అతని పళ్ళు పీకకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అనాలోచిత న్యాయవాది చేయగల హానిని చూడటం కూడా చాలా తేలికే. నిజమే, అలాంటి వ్యక్తి నైపుణ్యం లేకపోవటం కంటే నైపుణ్యం ఉంటేనే చాలా ప్రమాదకరం.3

మీరు కరెంటు పని చేస్తారా? మీరు కార్లను బాగుచేస్తారా? మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు బట్టలు అమ్ముతున్నారా? బహుశా మీరు న్యాయశాస్త్రాన్ని లేదా వైద్యశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. మీరు ఏ పని చేస్తున్నారో అది ముఖ్యం కాదు, కానీ మీరు మీ పనిని చిత్తశుద్ధితో చేస్తున్నారా అనేదే ముఖ్యం. బహుశా మీరు తెరవెనుక శ్రమించి ఉండవచ్చు, మరియు మీరు సరిగ్గా పనిచేసినందుకు కలిగే అంతర్గత సంతృప్తే మీకు లభించే కృతజ్ఞతలు. మీరు మీ పరీక్షల్లో మోసం చేస్తున్నారా? మీరు మీ భాగస్వామిని మోసం చేస్తున్నారా? కొందరు అలాంటి పనులు చేయటానికి ధైర్యం కలిగి ఉంటారు మరియు తమను తాము క్రైస్తవులు అని పిలుచుకుంటారు. ప్రపంచం గందరగోళంగా ఉందనడంలో ఆశ్చర్యం లేదు!

మీరు ప్రపంచాన్ని కుదిపేయాలనుకుంటున్నారా? ఎవరూ చూడనప్పుడు సరైనదేదో అది చేయుటకు కావలసిన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ . . . మొదలుపెట్టండి. కపటత్వంతో బలహీనపడిన సంస్కృతిలో చిత్తశుద్ధితో బలంగా నిలబడటానికి నిజమైన ధైర్యం అవసరం. ఈ రోజే ప్రారంభించండి.

  1. Merriam-Webster’s Collegiate Dictionary, 10th ed. See “integrity.”
  2. Louis Adamic, A Study in Courage, 1944, as quoted by John Bartlett in Familiar Quotations, 13th ed. (Boston: Little, Brown & Co., n.d.), 981.
  3. Elton Trueblood, as quoted by Charles R. Swindoll in Leadership: Influence That Inspires (Waco, Tex.: Word Books, 1985), 35.

Taken from Charles R. Swindoll, “A Battle for Integrity,” Insights (March 2003): 1-2. Copyright © 2003, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Christian Living-Telugu, Men-Telugu, Sin-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.