రచయిత యూజీన్ పీటర్సన్ రాసిన ఎ లాంగ్ ఒబీడియెన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకం తమ శ్రమలు ముగియనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉంటున్న అనేకమంది అనుభవాలను మాటల్లో వ్యక్తపరచింది. అటువంటి కాలాల్లో నేను ఈ క్రింది ప్రార్థనను చేసుకున్నాను మరియు ఈ రోజు, మీ కోసం ఇదే నా ప్రార్థన. మీరు దేవునికి కనిపించరని అనిపించవచ్చు, కాని ఆయన మీ ఆత్మకు దగ్గరగా ఉన్నాడు మరియు మీ మాట వింటున్నాడు.
ప్రభువా, నా గుండె శూన్యంగా అనిపిస్తుంది. ఈ రోజు నాతో సాత్వికంగా ఉండండి ఎందుకంటే నా బలం పోయినది. నేను శూన్యంగా ఉన్నాను. యెహోవా, ఎఫెసీయులకు 3:20 లో మీరు నాకు వాగ్దానం చేసిన మీ బలముతో నా ఆత్మను నింపుమని నేను నిన్ను వేడుకుంటున్నాను. నాలో మీరు జరిగించుచున్న క్రియను చూచునట్లుగా నా కళ్ళు తెరవండి. నా పరిస్థితులేమీ మారనప్పటికీ, మీరు అనుమతించిన శోధనలు నా ఆత్మను మార్చడానికి ఉపయోగపడుతున్నాయి. నేటి కార్యకలాపాలను నెరవేర్చడానికి మీరు బలాన్ని ఇస్తారా?
బాధ మన భావోద్వేగాలను క్షణానికొక రకంగా ఊహించని విధంగా మారుస్తుంది; వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అసాధ్యం. ఆ కారణంగా, నేను ఈ సంపూర్ణ సత్యాన్ని అందిస్తున్నాను: మీ శోధనల నడుమ దేవుడు నమ్మదగినవాడు. వీటిని ఓర్చుకొనే శక్తిని ఆయన మీకు అందిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా, “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక” (ఎఫెసీయులకు 3:20-21).