నిర్గమకాండము 18:1-27 చదవండి.
క్రైస్తవ పనివాడు ఒక వింత జాతియై ఉన్నాడు. పని అత్యంత కష్టంగా ఉన్నట్లు కనిపించాలని వారు కోరుకుంటారు. నిజానికి, ఎంత కష్టంగా మరియు ఎంత యెక్కువ ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తే అంత మంచిది. క్రైస్తవ పనివాళ్ళు “అలసట” చెందినవారిగా కనిపించడంలో పేరుపొందారు, వీళ్లని అధిక భారం మరియు కాలం చెల్లిన “మిషనరీ ఇమేజ్” అని పిలుస్తారు, లేదా, ఇంకా బాగా చెప్పాలంటే, అలసిపోయిన “అత్యధిక-భారం కలిగిన మత స్వరూపం” అని కూడా పిలుస్తారు. వారు సాధారణంగా పాతదైన, బాగా వాడేసిన బైబిల్‌ని తీసుకువెళుతూ, పడిపోతున్నట్లుగా నడుస్తారు. “దయచేసి నా మీద జాలి చూపండి” అనే ముఖంతో-వారు అరుదుగా నవ్వుతారు. నాకు వాంతి చేసుకోవాలనుపిస్తుంది.
తీవ్రమైన విమర్శ చేయాలనేది నా ఉద్దేశం కాదు. విషాదకరమైన వాస్తవం ఏమిటంటే, ఈ వ్యక్తులలో కొందరు అధిక పని చేస్తారు మరియు అతికష్టం మీద అవసరమైనవాటి కొరకు ఖర్చు చేయగలరు. అయితే మీరు అయ్యో పాపం అనే మూసను పోలి ఉండకుండా మీరు పూర్తికాల పరిచర్యలో ఉండగలరని నేను నమ్ముతున్నాను.
దేవుని సేవలో ఉన్న మనమే భూమిపై అత్యంత సంతోషకరమైన వ్యక్తులమై ఉండాలి. మనం అలా కనిపించాలి. అందరికంటే ఎక్కువగా నవ్వడానికి మనకు ఆధారం ఉంది. మన పని చాలా గంభీరంగా ఉన్నప్పటికీ, మరే ఇతర కెరీర్ లేదా పిలుపు ఉన్న వారందరి కంటే మరింత సరదాగా మరియు మంచి సమయం మనం గడపాలి. క్రాస్-కల్చరల్ మినిస్ట్రీలో (cross-cultural ministry) ఉన్న ఒక వ్యక్తి లేదా స్థానిక పాస్టర్ సంగీతంలో తమ అభిరుచిని ఆస్వాదించగలగాలి మరియు ఇతరుల మాదిరిగానే జీవితాన్ని సంతోషంగా గడపాలని నేను అనుకుంటున్నాను.
స్పష్టముగా, ఎవరైతే తమ చివరి రొట్టె ముక్క అయిపోయిందనే బాధతో చూస్తుంటారో వారు చాలా ప్రభావవంతంగా సేవ చేయరు, ఖచ్చితంగా నాకు చేయలేరు. నాకు పరిచర్య చేసే వారు, మరియు నేను ఎవరికైతే పరిచర్య చేస్తున్నానో వారు జీవితాన్ని నిజంగా ఆస్వాదించే స్త్రీపురుషులై ఉంటారు. మనము నిజంగా మన సమయాన్ని జీవితం యొక్క ప్రతికూలత మీద గడపాల్సిన అవసరం లేదు; ఎందుకంటే మనందరికీ తగినంత హృదయ విదారక అనుభవాలు ఉన్నాయి.