మే 24, 1965 న, పదమూడున్నర అడుగుల పడవ మసాచుసెట్స్‌లోని ఫాల్‌మౌత్ వద్ద మెరీనా నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది. దాని గమ్యం? ఇంగ్లాండ్. సముద్రయానం చేయడానికి ఇది అతి చిన్న పడవ. దీని పేరు? టింకర్‌బెల్. దాని పైలట్? క్లీవ్‌ల్యాండ్ ప్లెయిన్ డీలర్ కోసం కాపీ ఎడిటర్ అయిన రాబర్ట్ మన్రీ, పది సంవత్సరాలు ఒకే బల్ల దగ్గర పనిచేయటం వలన కొంచెముకాలం విసుగు చెందటం సబబేనని భావించాడు. కాబట్టి అతను తన రహస్య కలను నెరవేర్చుకోవడానికి సెలవు తీసుకున్నాడు.
మన్రీ భయపడ్డాడు . . . మహాసముద్రం గురించి కాదు, కానీ తనను ప్రయాణం చేయనివ్వకుండా ఆపడానికి ప్రయత్నించే వ్యక్తులందరి గురించి భయపడ్డాడు. కాబట్టి అతను ఆ విషయాన్ని చాలా మందితో పంచుకోలేదు, కొంతమంది బంధువులు మరియు అతనికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచిన తన భార్య వర్జీనియాతో పంచుకున్నాడు.
యాత్ర ఎలా సాగింది? చాలా ఘోరంగా సాగింది. షిప్పింగ్ దారుల గుండా వెళుతూ పడద్రోయబడకుండా మరియు మునిగిపోకుండా వాటిని దాటడానికి ప్రయత్నిస్తూ నిద్రలేని రాత్రులు గడిపాడు. సముద్రంలో కొన్ని వారాలు ఉండటం వల్ల అతని ఆహారం రుచి కోల్పోయింది. ఒంటరితనం భయంకరమైన భ్రాంతులకు దారితీసింది. అతని చుక్కాని మూడుసార్లు విరిగింది. తుఫానులు అతడిని నీళ్ళలోకి పడవేశాయి, అయితే అతను తన నడుము చుట్టూ ముడి వేసుకున్న తాడు లేకపోతే, అతను పడవ మీదకు ఎక్కగలిగేవాడేకాదు. మొత్తానికి, డెభ్బై-ఎనిమిది రోజులు సముద్రంలో ఒంటరిగా ఉన్న తరువాత, అతను ఇంగ్లాండ్‌లోని ఫాల్‌మౌత్‌కి చేరుకున్నాడు.
చుక్కాని వద్ద ఆ రాత్రులలో, తాను ఒడ్డునకు చేరిన తర్వాత ఏమి చేస్తాడో ఊహించుకున్నాడు. అతను కేవలం ఒక హోటల్‌లోకి వెళ్లి, ఒంటరిగా డిన్నర్ తినాలని అనుకున్నాడు, మరుసటి రోజు ఉదయం అసోసియేటెడ్ ప్రెస్ తన కథపై ఆసక్తి కలిగి ఉందో లేదో చూడాలనుకున్నాడు. అతన్ని ఆశ్చర్యపరచేది ఏమైనా ఉన్నదా! అతను ఒడ్డుకు చేరుకుంటున్నాడన్న వార్త చాలా దూరం వ్యాపించింది. అతన్ని ఆశ్చర్యపరుస్తూ, మూడు వందల నౌకలు, బూరలు ఊదుతూ, టింకర్‌బెల్‌ని పోర్టులోకి సాగనంపాయి. మరియు నలభై వేల మంది ప్రజలు కేకలు వేస్తూ మరియు హర్షధ్వానాలు చేస్తూ ఒడ్డున నిలుచున్నారు.
రాబర్ట్ మన్రీ, కాపీ ఎడిటర్ నుండి కలలు కనేవాడుగా మారిపోయి, రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. అతని కథ ప్రపంచవ్యాప్తంగా చెప్పబడింది. విసుగును విచ్ఛిన్నం చేయడానికి మరియు అసామాన్యమైనవాటిని ప్రయత్నించడానికి సృజనాత్మకత మరియు దృఢత్వం కలిగిన మరిన్ని రాబర్ట్‌లు మనకు అవసరం.
Taken from Charles R. Swindoll, The Strength of Character: 7 Essential Traits of a Remarkable Life (Nashville: J. Countryman, 2007), 88-89. Copyright © 2007 by Charles R. Swindoll, Inc.