తన బిడ్డను కారులో మరచిపోయిన తల్లిదండ్రులను గురించిన ప్రారంభ కథనంతో సాయంత్రం వార్తలు మొదలయ్యాయి. కారు వెలుపల ఆ రోజు ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలు. అనేక మంది ప్రజలు తుపాకీతో కాల్చివేయబడటం తరువాతి కథనం, అలాగే తదుపరిది తీవ్ర గాయాలపాలు చేసిన కారు ప్రమాదం గురించి వివరించింది. అప్పటికే నేను ఛానల్ మార్చేశాను.
సంక్షోభాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. కొన్నిసార్లు మనము అప్పుడే జరిగిన మరణాలు లేదా వ్యాధులు, ప్రమాదాలు, ఊహించని నష్టాలు, విడాకులు, ఆర్థిక కష్టాలు మరియు కొనసాగుతున్న జాతీయ విపత్తుల గురించి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి నివేదికలను అందుకుంటాము. ఇతర సమయాల్లో, టెలివిజన్ వార్తలు లేదా ఇంటర్నెట్ సైట్‌లు ఆర్థిక వ్యవస్థ, వాతావరణం లేదా మన పరిసరాల్లో రాబోయే సంక్షోభాన్ని నివేదిస్తాయి. సాధారణంగా సంక్షోభాల గురించి మనం ఎంత తరచుగా వింటున్నామో, అవి సొంతవారికి–ప్రియమైన వ్యక్తికి, స్నేహితుడికి, కుటుంబ సభ్యునికి లేదా వ్యక్తిగతంగా మనకు సంభవించినప్పుడు-చాలా మంది ప్రజలు ఇలా అంటారు: “నాకు, మాకు, వారికి లేదా ఇక్కడ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు.” సంక్షోభం వ్యక్తిగతమని అరుదుగా ఒక వ్యక్తి భావిస్తాడు; అందువల్ల, చాలా మంది ప్రజలు దానినుండి కోలుకునే ప్రక్రియ కోసం చాలా అరుదుగా సిద్ధపడి ఉంటారు.
ఎ న్యూ గైడ్ టు క్రైసిస్ అండ్ ట్రామా కౌన్సెలింగ్: ఎ ప్రాక్టికల్ గైడ్ ఫర్ మినిస్టర్స్, కౌన్సెలర్స్ మరియు లే కౌన్సెలర్స్ అనే పుస్తకంలో, డాక్టర్ హెచ్. నార్మన్ రైట్ ఇలా వ్రాశాడు:
జీవితం గుండా ప్రయాణం అనేది నష్టాలు, సంక్షోభాలు మరియు కొన్ని సందర్భాల్లో గాయాలు-కొన్ని ఊహించదగినవి మరియు ఆశించినవి, కానీ మరికొన్ని ఆశ్చర్యకరమైనవి. కొన్ని సంక్షోభాలు అభివృద్ధి చెందుతాయి; కొన్ని సందర్భానుసారంగా ఉంటాయి. . . . సజీవంగా ఉన్నామంటే మనం నిరంతరం సమస్యలను పరిష్కరించుకోవాలి. మనము ఎదుర్కొనే ప్రతి క్రొత్త పరిస్థితి మన వనరులను ఉపయోగించుకునే క్రొత్త మార్గాలను అభివృద్ధి చేసే అవకాశాన్ని అందిస్తుంది. . . [అలాగే] పట్టుదలతో ఉండటం ద్వారా, మనము ఈ సమస్యలను అధిగమించడానికి మార్గాలను కనుగొంటాము. . . .
అయితే, ఏదో ఒక రోజు, మన సామర్థ్యానికి మించిన మార్పు లేదా సమస్య ఎదుర్కొంటాము. సమస్య అధికంగా ఉన్నప్పుడు, లేదా మనకు ఆధారమైన వ్యవస్థ-మనలో లేదా ఇతరుల నుండి-పనిచేయనప్పుడు, మనం ఆశ్చర్యపడతాము. 1H. Norman Wright, A New Guide to Crisis and Trauma Counseling: A Practical Guide for Ministers, Counselors, and Lay Counselors (Ventura, Calif.: Regal, 2003), 9.
మనలో చాలా మంది ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మనము చింత, భయాందోళనలు, నొప్పి మరియు ఒంటరితనంతో నిండిపోయాము. పెద్దవారముగా, సంక్షోభం మరియు గందరగోళం ఇతరులను–ప్రత్యేకంగా పిల్లలు మరియు యుక్తవయస్కులను కూడా ప్రభావితం చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. నొప్పిని అధిగమించడానికి చాలా తక్కువ వనరులతో వారు తరచుగా భయంకరమైన విషాదాలను ఎదుర్కొంటారు. పెద్దవారముగా, వారి యోగక్షేమాలు, అలాగే మన యోగక్షేమాలు చూసుకోవడం మన బాధ్యత.
అవును, సంక్షోభం మన జీవిత గమనాన్ని మారుస్తుంది. కానీ మనం తరచుగా మరచిపోయే విషయం ఏమిటంటే, సంక్షోభం జరగకపోతే జరిగే దానికంటే సంక్షోభం వలన జరిగే మార్పులు మెరుగైన జీవితానికి తలుపులు తెరవగలవు. మనం మన శక్తిమంతుడైన మరియు సార్వభౌమాధికారం కలిగిన దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన నూతనమైన మరియు విభిన్నమైన అవకాశాల వైపు మన కళ్ళను తెరుస్తాడు, ఇది క్రొత్త నిరీక్షణను కలిగిస్తుంది. స్వస్థత ప్రక్రియలో మన జీవితాలను అర్థవంతమైన ఉద్దేశ్యంతో నడిపించడం ద్వారా దేవుడు ఆ నిరీక్షణను దయచేస్తాడు. కొన్నిసార్లు ఆ ప్రక్రియను అధిగమించడంలో, ముందుకు సాగడంలో మనకు మార్గదర్శకత్వం అవసరం.
ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి:
- ఉద్దేశపూర్వకమైన స్వీయ ప్రతిబింబం కోసం సమయాన్ని ప్లాన్ చేయండి:
మీ భావాలను గుర్తించండి; జ్ఞానం మరియు దిశను కోరుతూ, వాటి గురించి ప్రభువుతో మాట్లాడండి. రోజులో అనేకసార్లు క్రీస్తుతో ఒంటరిగా సహవాసం చేయండి. మీ కష్టాల్లో మీకు సహాయం చేయడానికి వృద్ధుడైన, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిని వెతకండి. - మీ నష్టాల నుండి స్వస్థతను అనుసరించండి:
మీరు అనుభవించే నష్టాలు మరియు బాధలను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండండి. దినచర్య పుస్తకమును ప్రారంభించడం, కౌన్సెలర్ లేదా మెంటర్‌ను క్రమం తప్పకుండా కలవడం మరియు కాలక్రమంలో గణనీయమైన నష్టాలను నమోదు చేయడం వంటివి సహాయపడతాయి. దుఃఖించుటకు మిమ్మల్ని మీరు అనుమతించుకోండి, తర్వాత ఆయన చేత స్వస్థత పొందటానికి ప్రభువును అడగండి. మీరు గ్రూప్ రికవరీ ప్రోగ్రామ్ లేదా దానికి సంబంధించిన క్లాసులో కూడా చురుకుగా ఉండవచ్చు. - ఆత్మీయ క్రమశిక్షణలను అభ్యసించండి:
క్రమశిక్షణ అంటే సరైన మార్గం లేదా దిశలో వెళ్లడం. మరో మాటలో చెప్పాలంటే, ఏది సరైనదో, మంచిదో, సత్యమైనదో మరియు స్వచ్ఛమైనదో అటువంటి దానిపై మీ మనస్సును నిలపడం. ఈ ఆలోచనలలో కొన్నింటితో ప్రారంభించండి: సరైనది మరియు స్వచ్ఛమైనది, జ్ఞానంతో నడవడం లేదా దేవుని సార్వభౌమాధికారం, విశ్వాసం, మంచితనం, నీతి, శక్తి, న్యాయం మరియు పరిశుద్ధత వంటి వాటి గురించి మాట్లాడే లేఖనాల భాగాన్ని ధ్యానించడం, పఠించడం లేదా కంఠస్థం చేయడం. మత్తయి 6:9–13లో ఉన్న ప్రభువు ప్రార్థనను అనుసరించి మీరు ప్రతిరోజూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించవచ్చు.
ఈ క్రియలు రాబోయే రోజుల్లో మీకు పునరుద్ధరణ యొక్క గొప్ప రిజర్వాయర్‌లుగా మారునుగాక.
↟1 | H. Norman Wright, A New Guide to Crisis and Trauma Counseling: A Practical Guide for Ministers, Counselors, and Lay Counselors (Ventura, Calif.: Regal, 2003), 9. |
---|