నాకు కావాలని నాకు కూడా తెలియని బహుమతి

మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు మరియు తూర్పు హ్యూస్టన్‌లో పెరుగుతున్నప్పుడు ముగ్గురు స్విండాల్ పిల్లలకు జీవితం చాలా సులభంగా ఉండేది. నా సోదరుడు ఓర్విల్, సోదరి లూసీ లేదా నేను క్రిస్మస్ సందర్భంగా కూడా గొప్పతనం గురించి కలలు కనలేదు. కానీ ఒక నిర్దిష్ట క్రిస్మస్ సీజన్‌లో, నేను కొత్త రబ్బరు బాస్కెట్‌బాల్‌ను పొందడం ఎంత గొప్పగా ఉంటుందో సూచనలను ఇవ్వడం ప్రారంభించాను. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను, అథ్లెటిక్స్ ప్రపంచం నా కళ్ల ముందు తెరుచుకున్నది.

మా నాన్న నాకు ఒక ఇనుప వలయాన్ని తయారు చేసాడు, దానిని మేము గ్యారేజీలో బిగించాము. వాస్తవానికి, వ్యాయామశాలలో సాధారణ బాస్కెట్‌బాల్ వలయాల కంటే దీని వ్యాసం చిన్నది, కానీ నాది మంచిదని ఆయన నన్ను ఒప్పించాడు: “కుమారుడా, నువ్వు బంతిని ఈ వలయంలో వేయగలిగితే, పాఠశాలలో ఉన్న వాటి ద్వారా దాన్ని వేయడంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.” తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలివైన విక్రయ సామర్థ్యాన్ని చూపించాడు, నేను దానిని నమ్మేశాను.

అకస్మాత్తుగా, ఒక నవంబర్ సాయంత్రమున, నా పాత చిరిగిన బాస్కెట్‌బాల్ పేలింది. నేను అప్పటికే దానికి రెండుసార్లు కుట్లు వేశాను, అది వింతగా ఎగిరిపడేది, దానితో మరోసారి కుట్టు అస్సలు పడదని అనుకున్నాను. అప్పుడే సూచనలు కనిపిస్తున్నాయి.

నా తల్లికి క్రీడల గురించి ఏమీ తెలియదని మీరు అర్థం చేసుకోవాలి. ఆమె కళల పట్ల ప్రశంసలు మరియు సామాజిక నైపుణ్యాలపై మంచి పట్టు ఉండటమే పరిపూర్ణమైన విద్య అని తలంచే ఒక ఉన్నతమైన, సంస్కారవంతమైన మహిళ, కానీ 15-అడుగుల ఎత్తు ఎగిరి షాట్ వేయడం? పరాచికమాడవద్దు. మా క్రిస్మస్ చెట్టు క్రింద నేను ఎప్పుడైనా కొత్త రౌండ్ బాల్‌ను చూడగలిగితే, నేను పొగడవలసి వస్తుందని నాకు తెలుసు.

బాత్రూమ్ మరియు వంటగది రోజూ తుడువబడుచున్నది. మా లాన్ అగస్టాలోని పచ్చికను పోలి ఉండటం ప్రారంభించింది. ఇంట్లోని ప్రతి చెత్త పేపర్ బుట్ట గురించి నేను ఉద్రేకముతో ఉన్నాను . . . మరియు చెత్త డబ్బాలను ఒక రోజు ముందుగానే బయట ఉంచాము. వంటకాలు? మేము వైట్ హౌస్ చేత తనిఖీ చేయబడటానికి సిద్ధంగా ఉన్నామని మీరు అనుకుని ఉండవచ్చు. నేను కూడా ప్రతి సాయంత్రం టేబుల్‌ని శుభ్రపరచి సిద్ధం చేసేవాడిని. అంటే, పాచిపోయిన చేతులు కలిగి ఉన్న ఎంత మంది హైస్కూల్ పిల్లలు మీకు తెలుసు?

అప్పుడు అది జరిగింది! పరిభ్రమించు వా కన్ను వెయ్యి ఐసికిల్స్ (మంచుగా మారిన నీటి బిందువులు) క్రింద ఉన్న ఒక పెట్టెను గమనించింది. ప్రకాశవంతంగా చుట్టబడిన, సరియైన ఆకారంలో ఉన్న పెట్టె . . . దానిమీద ఎవరి పేరు ఉందో ఊహించండి? మీరు చెప్పింది నిజమే–బాబ్ కౌసీగా, అలాగే తన కలల్లో జార్జ్ మికాన్‌గా పిలువబడే చిన్నవాడైన చక్.

క్రిస్మస్ రోజు అంత నెమ్మదిగా ఎన్నడూ రాలేదు. ఎవరూ చూడనప్పుడు, నేను చాలా అమితంగా కోరుకుంటున్నది అందులో ఉండాలని-సరైన పరిమాణం, సరైన బరువు, అంతా సరిగ్గా ఉన్న బాక్స్‌ను నేను కదిలించాను. నేను చుట్టబడిన కాగితాన్ని మరియు రిబ్బన్‌ను చింపి, పైభాగాన్ని తెరిచాను మరియు నా కళ్ళకు నమ్మశక్యంకానిదియైన గుండ్రని భూగోళాన్ని చూశాను. నేను గుర్తుచేసుకున్నట్లైతే నా వైపు ఇటలీ చూస్తూ ఉంది. బాస్కెట్‌బాల్ యొక్క ఖచ్చితమైన పరిమాణం, ఆకారం మరియు బరువు కలిగియున్నది, కానీ అది భూగోళం! ఏమి పులకరింత; క్రిస్మస్ మధ్యాహ్నమంతా మా అమ్మ పిలిచే భౌగోళిక ప్రదేశాలను గుర్తించడంలో నాకు ఆనందం కలిగింది . . . సింగపూర్, లాట్వియా, మాంట్రియల్, న్యూజిలాండ్, అమెజాన్, మాస్కో, ఢిల్లీ.

ఈ సీజన్‌లో, చాలా చెట్ల క్రింద చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి-వీటిలో కొన్ని చిన్నపిల్లలకి కొంచెం నిరాశ కలిగించేలా కనిపిస్తాయి, కానీ కాలమే దానిని సరైన రీతిలో చూపుతుంది . . . మరియు ఏదోయొక రోజు చాలా మంది తల్లుల దృష్టి తమ బిడ్డల కోసం ఆయన ఊహానుభూతితో భర్తీ చేస్తుంది. నాకు తెలుసు. అది నాకు జరిగింది.

ఇప్పుడు నన్ను నిజంగా ఉత్తేజపరిచేది వలయం మరియు బాల్ కాదు కానీ సింగపూర్ మరియు మాస్కో, ఢిల్లీ మరియు మాంట్రియల్ వంటి ప్రదేశాలు ప్రతి భాష మరియు తెగ మరియు దేశం యొక్క ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి బేత్లెహేము‌లో జన్మించిన శిశువు యొక్క కథను వింటాయి . . . అని భూగోళముపై ఆశ. మేము ప్రపంచమంతటా సువార్తను తీసుకువెళుతున్నప్పుడు మరియు క్రీస్తు యొక్క విమోచన ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు ఇన్సైట్ ఫర్ లివింగ్‌తో జతకట్టాలని నేను ఈ సీజన్‌లో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను-అన్నిటికంటే గొప్ప బహుమతి!

Taken from Charles R. Swindoll, “The Gift I Didn’t Know I Wanted,” Insights (December 2001): 1. Copyright © 2001 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.
Posted in Christmas-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.