డాక్టర్ స్యూస్ హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్ రాసినప్పుడు నా గురించి ఆలోచించలేదు. చార్లెస్ డికెన్స్ తన కథలో స్క్రూజ్ పాత్ర పోషించమని నన్ను అడగలేదు. మీరు తరువాత ఏమి చదివినప్పటికీ. . . అది గుర్తుంచుకోండి! నేను క్రిస్మస్ వ్యతిరేకిని కాను, లేదా “క్రీస్తును తిరిగి క్రిస్మస్‌లో పెట్టండి” అని అతిగా ఉపయోగించిన బంపర్ స్టిక్కర్‌ని అతికించను. మా కుటుంబము ప్రతి సంవత్సరం ఒక చెట్టును పెడతాము. మేము బహుమతులు మార్చుకుంటాము, క్రిస్మస్ సంగీతం ప్లే చేస్తాము, ఆనందగీతములు పాడతాము, ఉత్సవాలను ఆస్వాదిస్తాము మరియు కొంతమందికి “మెర్రీ క్రిస్మస్” అని శుభాకాంక్షలు తెలియజేస్తాము. నన్ను నమ్మండి-టర్కీ విషయంలో తప్ప, క్రిస్టమస్ సమయం గురించి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ మీరు అంగీకరించాల్సినదేమంటే, ఈ సమయంలో ప్రత్యేకమైన సమస్యలు మరియు శోధనలు లేకుండా మానవు. మన సుందరమైన సమృద్ధిగల దేశము ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు వారాలపాటు పిచ్చికు దగ్గరగా ప్రమాదకరంగా కదులుతుంది, మరియు నేను ఆ సమస్యను గూర్చి మాట్లాడాలనుకుంటున్నాను. యునైటెడ్ స్టేట్స్ జనగణన కార్యాలయం ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా:
- క్రిస్మస్ సమయంలో అమెరికన్లు రిటైల్ స్టోర్లలో 30.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
- ఇంటర్నెట్ ద్వారా క్రిస్మస్ బహుమతుల కోసం అమెరికన్లు 39 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
- క్రిస్మస్ చెట్ల కోసం 493 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు.
- యునైటెడ్ స్టేట్స్ చైనా నుండి దాదాపు 594 మిలియన్ డాలర్ల విలువైన క్రిస్మస్ ట్రీ ఆభరణాలను దిగుమతి చేసుకుంది.
- మొత్తం 3.4 బిలియన్ డాలర్ల విలువైన బొమ్మలు, ఆటవస్తువులు మరియు వినోద పరికరాలను తయారీదారుల నుండి చిల్లర వ్యాపారులకు పంపబడ్డాయి.
- థాంక్స్ గివింగ్ మరియు క్రిస్మస్ మధ్య యుఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఇరవై బిలియన్ల ఉత్తరాలు పంపబడ్డాయి.
- కొందరు తమ నగరాలు మరియు పట్టణాలను క్రిస్మస్‌తో శాశ్వతంగా అనుబంధించేంత దూరం వెళ్లారు, నార్త్ పోల్, అలాస్కా; శాంతా క్లాజ్, ఇండియానా; మరియు మీకు ధ్రువప్రాంతపు జింక ఇష్టమైతే, విస్కాన్సిన్‌లోని రుడాల్ఫ్ గ్రామం మరియు జార్జియాలోని డాషర్ పట్టణం వంటి పేర్లు పెట్టారు.1
అవే వాస్తవాలు. అవి డాక్యుమెంట్ చేయబడ్డాయి.
ఈ క్రిస్మస్ సందడితో, చాలా మందిని ఒక అయస్కాంతం లాగా ఆకర్షించే “కాస్మిక్ ఎర” ఉంది. నియంత్రణలేని, అనూహ్యమైన మరియు క్రమశిక్షణ లేని, భావోద్వేగాలు కదులుతాయి. పదకొండు నెలల అపరాధభావంతో కలిసిన వ్యామోహం అశాస్త్రీయమైన మరియు విపరీతమైన కొనుగోళ్లను ప్రేరేపిస్తుంది. ఇరుగుపొరుగువారి ఒత్తిడి వల్ల వేలాది లైట్లతో ఇళ్లను అలంకరించవలసివస్తుంది. టెలివిజన్ ప్రకటనలు, క్రిస్మస్ బ్యాంక్ ఖాతాలు మరియు ప్రత్యేక “శుభాకాంక్షల పుస్తకాలు” వీటన్నిటి ద్వారా డబ్బులు బాగా దండుకుంటారు.
నేను మీకు గుర్తు చేస్తున్నాను. . . నేను క్రిస్మస్ యొక్క ప్రాథమిక ఆలోచనకు లేదా అందమైన ఆ దృశ్యానికి వ్యతిరేకం కాదు. ఇంగితజ్ఞానం మరియు సమతుల్యత ఉండాలనేది నా విన్నపం; అంతే. క్రైస్తవులమైన మనం ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. . . ప్రతిదానితో పోరాడటానికి అనుమతించే వ్యూహమును గూర్చి ఆలోచించాలి. నేను నాలుగు మాత్రమే ప్రస్తావిస్తాను.
1. సిద్ధాంతపరమైన ప్రమాదం . . . శాశ్వతమైన వాటికి బదులుగా తాత్కాలికమైన వాటిని ఉంచడం.
రెండు లేఖనాలు ఇక్కడ అవసరమైన సలహాను ఇస్తున్నాయి: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక . . . రూపాంతరము పొందుడి” (రోమా 12:2)! “. . . పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి” (కొలొస్సయులకు 3:1-2).
మనం ఏమి జరుపుకుంటామో సరిగ్గా మన బుర్రలోకి గట్టిగా ఎక్కడం ముఖ్యం. ఇది మన రక్షకుని రాక, శాంటా రాక కాదు. బహుమతులు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను, దేవుడు తన కుమారుని బహుమానముగా మనకు అందజేయడంతో నేరుగా సంబంధమును కలపాలి–మరియు మన చిన్నపిల్లలకు ఏడాది పొడవునా ఆ విషయాన్ని గుర్తుచేయడం చాలా అవసరం.
2. వ్యక్తిగత ప్రమాదం . . . ఆకట్టుకుంటున్నాము గానీ తెలియజేయడం లేదు.
మవము రాజుకు ప్రాతినిధ్యం వహించుచున్నాము. మనం ఆయనచేత ఏర్పరచబడిన రాయబారులము, “సమయమందును అసమయమందును” ఆయన పని చేయుచున్నాము (2 తిమోతికి 4:2). మరి ఈ సమయంలో ఆయనను తెలియపరచుదాం! ఇటువంటి దినాల్లో ప్రజలు సువార్త కోసం తమ హృదయములను తెరచుకొని ఉంటారు. మీరు కొన్న వాటి ద్వారా ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం మరచిపోండి. మీరు ఇప్పటికే కలిగి ఉన్నదానిని తెలియజేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించండి.
3. ఆర్థిక ప్రమాదం . . . మీకు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు చేయడం.
ప్రతి కొనుగోలుకు ముందు, ఆలోచించండి. కొన్ని సూటిగా, చొచ్చుకుపోయే ప్రశ్నలను మీరే ప్రశ్నించుకోండి: “ఇది నా బడ్జెట్‌లో ఉందా?” “ఇది సముచితమేనా?” “నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో అది నిజంగా చెబుతోందా?” మీరు తయారుచేసే బహుమతులు తరచుగా మీరు కొనుగోలు చేసే వాటి కంటే చాలా ఎక్కువ ప్రశంసించబడతాయి మరియు చాలా తక్కువ ధరతో ఉంటాయి. ఉన్నదానికంటే ఎక్కువ పెట్టాలంటే సాధారణంగా ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. అనుసరించాల్సిన సురక్షితమైన నియమం ఇది: మీ వద్ద డబ్బు లేకపోతే-కొనవద్దు. ఉదాహరణకు, నా భార్య మరియు నేను క్రిస్మస్ కార్డులు పంపడం ఆపివేయాలని కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము. తప్పు లేదు, సరేనా. దేవుడు మాతో మాట్లాడిన దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. క్రిస్మస్ కార్డులను ఎత్తివేయడం వలన మాకు చాలా డాలర్లు మరియు సమయం ఆదా అయ్యిందని మేము తెలుసుకున్నాము.
4. మానసిక ప్రమాదం . . . క్రుంగిపోవడటానికి తయారవ్వడం.
ప్రపంచ వ్యవస్థ యొక్క అత్యంత ప్రభావవంతమైన విన్యాసాలలో ఒకటి ఏమిటంటే తప్పుడు ఉత్సాహాన్ని సృష్టించడం. క్రైస్తవుడు క్రిస్‌మస్ పర్వదినాన చాలా సులభంగా “గాలిలో విహరిస్తూ” ఉండవచ్చు. పండుగ అయిపోయిన తర్వాత ప్రమాదకరమైన, నిరుత్సాహపరిచే అనుభవం ఎదురవ్వవచ్చు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ మనస్సు మరియు భావోద్వేగాలపై నియంత్రణ పెట్టండి. మోసపోవద్దు. 25 వ తేదీని ఆస్వాదించండి . . . అయితే 26 వ తేదీన మూల్యం చెల్లించుకుని కాదు. మీరు ఆ వ్యక్తితో నిమగ్నమై ఉంటే, మీరు అరుదుగా తెగులుతో పోరాడవలసి ఉంటుంది. హెబ్రీయులకు 12:3 ని మీ లక్ష్యంగా చేసుకోండి–“ఆయనను తలంచుకొనుడి”; ఆయన గురించే ఆలోచించండి.
ఇప్పుడు సెలవులను ఆస్వాదించండి. క్రిస్మస్ . . . మరియు నూతన సంవత్సరం రోజున అద్భుతమైన సమయం గడపండి. ఒక్కసారి ఆలోచించండి, ఇది మన చివరిది కావచ్చు, కనుక దీనిని మనం ఉత్తమమైనదిగా చేద్దాం.
- “Facts for Features: The 2008 Holiday Season,” U. S. Census Bureau, http://www.census.gov/Press-Release/www/releases/archives/facts_for_features_special_editions/012876.html, accessed September 30, 2009.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc