జీవితంలో మీ తుది అధికారం ఏమిటి? మీరు అతి త్వరగా సమాధానం చెప్పే ముందు, దాని గురించి కొన్ని క్షణాలు ఆలోచించండి. మీరు తప్పించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, భయపడే అడ్డంకిని మీరు ఎదుర్కొంటున్నప్పుడు, మీరు వాస్తవికతతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు, మీరు ఎవరిపై లేదా దేనిపై ఆనుకొనుచున్నారు?
దేవుని వాక్యమైన బైబిల్ కంటే భూమిపై నమ్మదగిన అధికారం మరొకటి ఉండదు. ఈ కాలాతీతమైన, నమ్మదగిన సత్యం యొక్క మూలం జీవిత రహస్యాలను తెరిచే ముఖ్యమైన సాధనమును కలిగి ఉంది. ఇదొక్కటి మాత్రమే కష్ట సమయాల్లో మనకు అవసరమైన ఆశ్రయం మరియు రక్షణను అందిస్తుంది.
కానీ ఇది మనం ఎందుకు కావాలో అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం మన తుది అధికారమవటానికి ఎందుకు అర్హత పొందుతుంది?
దేవుని పుస్తకం దేవుని స్వరమైయున్నది
లేఖనము దేవుని వాక్యము (1 థెస్సలొనీకయులు 2:13). ఈ విధంగా ఆలోచించండి: మన ప్రభువు తనను తాను కనిపించుకునేలా చేసి, భూమికి తిరిగి వచ్చి తన సందేశాన్ని ఇస్తుంటే, అది బైబిలుకు అనుగుణంగా ఉంటుంది. ఆయన సత్య సందేశం మీరు లేఖనములో చూసేదానితో సరిగ్గా సరిపోతుంది. మీరు దేవుని స్వరంపై, అనగా ఆయన సందేశంపై ఆధారపడినప్పుడు, మీరు ఖచ్చితమైన పునాదిపై నిలబడి ఉన్నారు; మీరు నమ్మదగిన సత్యం కలిగియున్నారు.
దేవుని వాక్యం నిలుస్తుంది
ఈ రోజు భూమిపై కేవలం రెండు శాశ్వతమైన విషయాలు మాత్రమే ఉన్నాయని మీరు గ్రహించారా? రెండు మాత్రమే: ప్రజలు మరియు దేవుని వాక్యం. మిగతావన్నీ చివరికి కాలిపోతాయి. ఒక రకంగా మీ ప్రాధాన్యతలను సూటిగా సరి చేస్తుంది కదా, చేయదా? మనము షెల్ఫ్‌లో ఉంచే వస్తువులు, చుట్టూ ఫ్రేములతో ఉండే వస్తువులు, ట్రోఫీలు మరియు అవార్డులను మనం మెరిపించి ప్రదర్శిస్తాము – ఇవన్నీ తుది పెద్దమంటకు దారితీస్తాయి (2 పేతురు 3:7, 10–12).
కానీ దేవుని సత్యం అలా కాదు! ఇది “ఎల్లప్పుడును నిలుచును” (1 పేతురు 1:25). గడ్డి పెరుగుతుంది మరియు అది వాడిపోతుంది; పువ్వులు వికసిస్తాయి మరియు తరువాత అవి చనిపోతాయి. కానీ దేవుని వ్రాతపూర్వక సందేశం, సత్యం నిత్యము నిలుస్తుంది (యెషయా 40:7–8). ఆయన వాక్యము నిలుచును!
దేవుని వాక్యము ప్రేరేపించబడింది
అయితే వేచి ఉండండి. మనుష్యులు వ్రాసిన దాని గురించి మనం ఇంతలా ఎలా ఉత్తేజితులమవుతాము? సత్యాన్ని ఇచ్చినవానితో మనకు ఎటువంటి సమస్య లేదు. ఆయన ఇచ్చాడు. . . పాపాత్మకమైన మనుష్యుల చేతులు మరియు మనస్సుల ద్వారా ఆయన దానిని భూమికి ఏర్పాటు చేసినప్పుడు సత్యం కలుషితమైనదా?
బయలుపరచడం, ప్రేరేపణ మరియు ప్రకాశము అనే మూడు సిద్ధాంత పదాలతో మీరు పరిచయం కావడానికి ఇదే సరైన క్షణం. దేవుడు తన సత్యాన్ని ఇచ్చినప్పుడు బయలుపరచబడటం సంభవించింది. లేఖన రచయితలు ఆయన సత్యాన్ని స్వీకరించినప్పుడు మరియు రికార్డ్ చేసినప్పుడు ప్రేరేపణ సంభవించింది. ఈ రోజు, ఆయన సత్యాన్ని మనం అర్థం చేసుకుని, అన్వయించినప్పుడు ప్రకాశము ఏర్పడుతుంది.
క్లిష్టమైన సమస్య ఏమిటంటే, బైబిల్‌పై మీ విశ్వాసం-దాని ప్రేరణపై మీ విశ్వాసంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. అప్పుడు దేవుని వాక్యం అపరాధరహితమైనదని, ఖచ్చితంగా సత్యమని, అందువల్ల మన పూర్తి నమ్మకానికి అర్హత కలదని మనం ఎలా ఖచ్చితంగా చెప్పగలం? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడంలో పౌలు గొప్ప సహాయం చేస్తాడు:
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2 తిమోతి 3: 16-17)
మానవ రచయితలకు రికార్డ్ చేయడానికి దేవుడు తన సత్యాన్ని వెల్లడించినప్పుడు, ఆయన తన వాక్యాన్ని “ఊదాడు.” కానీ లేఖన రచయితలు కేవలం ఆయన చెప్పగా వీరు వ్రాశారా?
మనము బైబిల్ చదివినప్పుడు, పేతురు యోహాను లాగా లేడని స్పష్టమవుతుంది; యోహాను దావీదు లాగా లేడు. మానవ బలహీనత మరియు లోపంతో వాక్యాన్ని పాడుచేయకుండా ప్రతి రచయిత యొక్క వ్యక్తిత్వం సంరక్షించబడింది. ఇది చెప్పివ్రాయించడమనే పద్ధతిని త్రోసిపుచ్చింది.
కాబట్టి దేవుడు దీనిని ఎలా జరిగించాడు? రెండవ పేతురు 1:21 మనకు ఇంకొక సంకేతాన్ని ఇస్తుంది: “ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”
ప్రేరేపింపబడినవారై అనే పదం సముద్రంలో ఓడలను వివరించే గ్రీకు నాటికల్ పదం నుండి అనువదించబడింది. ఒక ఓడ దాని నౌకలను కోల్పోయినప్పుడు మరియు గాలులు, తరంగాలు మరియు సముద్రపు ప్రవాహాల అధీనంలో ఉన్నప్పుడు, అది దాని స్వంత శక్తితో కాకుండా “ప్రేరేపింపబడినదై” కదులుతుంది. ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. లేఖన రచయితలు దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ వారి రచనా పరికరాలను అతీంద్రియంగా మార్గనిర్దేశం చేయగా, వారు ఆయన సత్యాన్ని వ్రాయడానికి ప్రేరేపించబడి నడిపించబడ్డారు.
దేవుని పదం మిమ్మల్ని ఎత్తిపట్టుకుంటుంది
మన తీర్మానం ఇది: బైబిల్లో మనకు పూర్తిగా నమ్మదగిన, అధికారిక, ప్రేరేపిత వాక్యము సంరక్షించబడి ఉన్నది. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి: ముఖ్యంగా నేను జీవితంలో అస్తవ్యస్తమైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నేను దీనిపై ఆధారపడగలనా?
నా సమాధానం-అలాగే ఇది మీ సమాధానం అని నేను ప్రార్థిస్తున్నాను-ఖచ్చితంగా మరియు నిస్సందేహంగా, అవును ఆధారపడతాను!
దేవుని వాక్యంపై ఆధారపడటం గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది మీకు లోతైన భావం కలిగిన ఉద్దేశమును మరియు అర్థమును ఇస్తుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇతర సలహాలు మీకు లభించవు. సందేహం మరియు అనిశ్చితి యొక్క కష్టాలలో గట్టిగా నిలబడటానికి ఏ ఇతర సత్యం మీకు సహాయం చేయదు. మరే ఇతర యథార్థ్యము మీకు ప్రతి రోజుకు తగిన బలాన్ని మరియు రేపటి కోసం ఖచ్చితమైన నిరీక్షణను ఇవ్వదు. మీ జీవితానికి క్రొత్త అర్థాన్ని ఇచ్చే శక్తి వేరే సూచనలకు లేదు.