ప్రశ్న: నేను క్రొత్త క్రైస్తవుణ్ణి/క్రైస్తవురాలిని, నేను పరిశుద్ధ గ్రంథము నుండి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను. నా అమ్మమ్మకు చెందిన పాత బైబిల్ ఉంది, అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నేను ఎక్కడ ప్రారంభించగలను? నేను పరిశుద్ధ గ్రంథమును చదివి దానినుండి ఎక్కువ ఎలా పొందుకోగలను?
జవాబు: దేవుని వాక్యాన్ని చదవాలనే మీ కోరిక గురించి వినడం చాలా సంతోషకరముగా ఉన్నది. చాలామంది క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథము గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారు, కాని మీలాగే, వింత పదాలు మరియు అసాధారణమైన రచనా శైలుల కారణంగా వారు నిరాశ చెందుతారు. మీరు కింగ్ జేమ్స్ వెర్షన్ (ఆంగ్లంలో) వంటి పాత సంస్కరణను చదువుతుంటే, బైబిల్ మీకు ముఖ్యముగా విదేశీ అనుభూతిని కలిగిస్తుంది. మీరు చదువుతున్నదానిని అర్థం చేసుకోవడం ఎలా ప్రారంభించవచ్చు?
మొదటిగా మీరు ఇంట్లో మరియు సంఘంలో ఉపయోగించగల బైబిల్ కొనడం. మీ పాస్టర్ బోధించేటప్పుడు ఆయన ఏ అనువాదం ఉపయోగిస్తున్నాడని మీరు అడగండి. మీరు ఆయన ప్రసంగమును అనుసరించులాగున అదే అనువాదం యొక్క కాపీని స్వంతం చేసుకోవడం సహాయకరముగా ఉంటుంది.
చక్ స్విన్డాల్ ఏ బైబిల్ వెర్షన్ ఉపయోగిస్తున్నారో చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ (NASB) నుండి బోధిస్తారు. ఎందుకంటే ఈ వెర్షన్ మూల వాక్యం యొక్క అత్యంత ఖచ్చితమైన అనువాదాన్ని సూచిస్తుందని ఆయన నమ్ముతున్నారు. బైబిల్ మొదట ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడింది, కొన్ని విభాగాలు అరమెయిక్ లో ఉన్నాయి. అందువల్ల, ఏ ఇంగ్లీష్ బైబిలు అయినను అనువాదమే గనుక అది అనువాదకుల తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని బైబిల్స్ దాదాపు పదానికి పదం అనువాదాన్ని అందిస్తాయి, ఇతర వెర్షన్లు వదులుగా, సమకాలీన అనువాదాన్ని అందిస్తాయి.
NASB అనువాదకులు సాధ్యమైనంతవరకు మూల వాక్యానికి సంబంధించి వారి అనువాదమును ఉన్నదున్నట్లుగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇది NASB యొక్క ప్రతిభ. కానీ చాలా మందికి ఇది ఒక లోపమని కూడా మనం గుర్తించాలి, ఎందుకంటే యాథార్ధ్యము కఠినమైన ఉత్పత్తి చేస్తుంది. NASB ఇతర అనువాదాల వలె మృదువైనది లేదా భాషీయమైనది కాదు.
చక్ NASB నుండి బోధించినప్పటికీ, ఆయన ఇతర అనువాదములను కలిగి ఉన్నాడు మరియు వాటిని అప్పుడప్పుడు చదువుతారు. ఇటీవలి సంవత్సరాలలో, ఆయన న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ (NIV) ను ఎంతో ఉన్నతమైనదిగా లక్ష్యపెట్టారు.
ప్రతి అనువాదంలో ధర్మాలు మరియు పరిమితులు ఉన్నాయి. మీరు చదువుచున్న వాక్యమును అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికిగాను అధ్యయన గమనికలు లేదా మీరు చదువుచున్నవాటిని వర్తింపజేయడంలో సహాయపడటానికిగాను వ్యాసాలు కొన్ని బైబిళ్ళలో ఉన్నాయి. బైబిల్ అనువాదములను గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు ఫిలిప్ డబ్ల్యూ. కంఫర్ట్ రాసిన ది కంప్లీట్ గైడ్ టు బైబిల్ వెర్షన్లను చదవవచ్చు. ఈ పుస్తకం బైబిల్ యొక్క వివిధ అనువాదాల జాబితాను, అనువాద చరిత్రను మరియు తత్వశాస్త్రం యొక్క వేగమైన సమీక్షను అందిస్తుంది.
పరిశుద్ధ గ్రంథము ఒక సాధారణ పుస్తకం కాదు; బదులుగా ఇది వివిధ సమయాల్లో మరియు వేర్వేరు రచయితలచే వ్రాయబడిన అరవై ఆరు పుస్తకాల సమాహారం. ఒక సాధారణ పుస్తకంతో, మీరు మొదటి పేజీలో ప్రారంభించి చివరి పేజీ వరకు చదువుతారు. పరిశుద్ధ గ్రంథము ఒక పుస్తకాల సమాహారం గనుక, మీరు దానిని భిన్నంగా సమీపించవచ్చు. పరిశుద్ధ గ్రంథము చదవడానికి ఇక్కడ కొన్ని విధానాలు ఉన్నాయి:
బైబిల్ పఠన పట్టీ
ఈ క్రింది వెబ్‌సైట్‌లో సూచించబడిన పట్టీలో బైబిల్-పఠన వివరణ పట్టికను చాలా మంది అనుసరిస్తారు: http://www.bibleplan.org/. బైబిల్ పఠనం ఒక పెద్ద నగరానికి బస్సు యాత్ర చేయడం లాంటిదని గ్రహించుకోండి. బస్సు పర్యటనలో, మీరు ఏ ఒక్క స్థలములోను ఎక్కువ సమయం గడపకుండా చాలా ప్రదేశాన్ని చుట్టుముట్టేస్తారు. పఠన వివరణ పట్టిక కూడా ఇలానే ఉండాలి. లేఖనము యొక్క ప్రధాన ఇతివృత్తాలు, కథలు మరియు కాలక్రమం గురించి తెలుసుకోవాలనేదే దీని ఆలోచన. అప్పుడు, మీరు ఒక నిర్దిష్ట భాగాన్ని అధ్యయనం చేయాలనుకుంటే, మీరు “బస్సు దిగి” ఆ నిర్దిష్ట ప్రదేశంలో సమయాన్ని కేంద్రీకరించవచ్చు.
ఆరాధనా ధ్యానం
రుచికరమైనవాటితో నిండిన సుదీర్ఘ విందు పట్టికగా బైబిల్ గురించి ఆలోచించండి. మీరు ఏ విభాగానికి అయినా అడుగుపెట్టి రవంత సత్యమును ఎంచుకోవచ్చు. క్రైస్తవ భక్తి పుస్తకాలు ఈ విధానాన్ని తీసుకుంటాయి. ప్రతి రోజు పుస్తకంలో మీ పఠనానికి మార్గనిర్దేశం చేయడానికి ఒకటి లేదా రెండు వాక్యాల ధ్యానం ఉంటుంది.
అయితే, బైబిల్‌ను భవిష్యత్తును తెలుసుకునే ఒక సాధనములాగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. కొంతమంది క్రైస్తవులు కళ్ళు మూసుకుని, బైబిళ్ళను తెరిచి, ఒక వాక్యం వైపు వేళ్లు చూపిస్తూ దేవుని నుండి సందేశాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఈ రకమైన పద్ధతి తరచుగా నిరాశకు గురిచేస్తుంది, ఎందుకంటే మీరు తీసిన వాక్యం మీకు పెద్దగా సూచించకపోవచ్చు. లేదా అధ్వాన్నంగా, మీరు వాక్యమును అసందర్భంగా తీసుకొని, రచయిత ఎప్పుడూ ఉద్దేశించని అర్థాన్ని దానికి ఆపాదించి లోపానికి దారితీయవచ్చు.
నిరుత్సాహం, నిరీక్షణ లేదా నిత్యజీవితం వంటి కొన్ని అంశాలపై బైబిలు చెప్పేదాన్ని మీరు చదవాలనుకుంటే, మీరు బాబ్ ఫిలిప్స్ రాసిన A Topical Bible Guide వంటి సమయోచిత సూచికను కొనుగోలు చేయవచ్చు. ఈ చిన్న పుస్తకం బంగారమంత విలువైనది! ఇది ఆసక్తి కలిగిన వంద అంశాలపై వాక్యాలను కలిగి ఉంది, అలాగే మీరు రోజూ ఆరాధనా ధ్యానంగా చదవడానికి కొన్ని వాక్యాలను ఎంచుకోవచ్చు. మీతో తీసుకెళ్లడానికి కార్డులపై వాక్యాలను వ్రాసుకోండి లేదా మీ బైబిల్లోని వాక్యాలను వెదకి వాటి క్రింద గీతలు గీయండి. మీ బైబిల్లో వాక్యం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలిసినప్పుడు మీరు వాక్యములను మరింత స్పష్టంగా గుర్తుంచుకోగలుగుతారు.
పుస్తక అధ్యయనం
మీరు అధ్యయనం చేయడానికి బైబిల్ యొక్క ఒక నిర్దిష్ట పుస్తకాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీరు ఇంతకు మునుపు బైబిల్ చదవకపోతే, మీరు విషయాల పట్టికను చూచి అందులో మార్కు పుస్తకాన్ని కనుగొనవచ్చు. మార్కు అనేది యేసు జీవితాన్ని వేగంగా కదిలించే వివరణ మరియు అర్థం చేసుకోవడానికి నాలుగు సువార్తలలో చాలా సులభమైనది. మీరు ప్రతిరోజూ ఒక వాక్యభాగమును ఎంపిక చేసుకొని చదువుతున్నప్పుడు, “ఈ వాక్యభాగంలో యేసు గురించి రచయిత నాకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు?” అని మీరే ప్రశ్నించుకోండి. బైబిల్ బోధించే కాలాతీత సూత్రాల కోసం త్రవ్వండి, అలాగే ఆ సూత్రాలను మీ జీవితానికి వర్తింపజేయండి. ఉదాహరణకు, మార్కు 1:21-28లో యేసు అపవిత్రాత్మను పారద్రోలుతున్నప్పుడు, ఆయన దయ్యములపై తన అధికారాన్ని చూపించాడు. భౌతిక మరియు ఆత్మీయ రంగాలలో యేసే గొప్ప అధికారం గలవాడనే సత్యాన్ని రచయిత బోధిస్తున్నాడు, మరియు మీరు ఆయన శక్తియందు ధైర్యంగా ఉంటారు.
ఒక పుస్తకంలో లేదా ప్రార్థన పత్రికలో మీరు కనుగొన్న బైబిల్ సూత్రాలను సంగ్రహంగా వ్రాసుకోవచ్చు. మీరు వాక్యాలను పరిశీలిస్తున్నప్పుడు, మీరే కొన్ని అన్వయించుకోదగిన ప్రశ్నలను వేసుకోండి.
- ఈ వాక్యాలలో నేను ఏదైనా వాగ్దానాలను హక్కుగా తీసుకోవచ్చా?
- నేను పాటించాల్సిన ఆజ్ఞ ఉందా?
- నేను నివారించుకోవలసిన పాపాలు ఏమైనా ఉన్నాయా?
- అనుసరించడానికి ఒక ఉదాహరణ ఉన్నదా?
- ఏ ప్రోత్సాహమును లేదా ఆదరణను నేను పొందగలను?
- దేవుడు నాకు ఏ క్రొత్త దృక్పథాన్ని చూపుతున్నాడు?
మన క్రైస్తవ వికాసం యొక్క ప్రతి దశలోనూ మనల్ని పోషించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. నూతన విశ్వాసులకు ఇది “స్వచ్ఛమైన పాలు” (1 పేతురు 2:2) మరియు పరిణతి చెందినవారికి “బలమైన ఆహారం” (హెబ్రీయులు 5:14) వంటిది. మీరు మీ మిగిలిన జీవితమంతా ప్రతిరోజూ లేఖనాన్ని ఆరగించవచ్చు మరియు దాని పోషణ యొక్క నిల్వగృహము ఎప్పుడూ ఖాళీ అవ్వదు. తన వాక్యమును గూర్చిన మీ అధ్యయనాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక.