కీర్తన 78
మగవాళ్ళు మగవాళ్ళుగా ఉన్నటువంటి స్థితి గుర్తుందా? చూడగానే మీరు చెప్పగలిగిన స్థితి మీకు గుర్తుందా? పురుషులు తాము ఎవరో తెలుసుకున్నప్పుడు, తాము ఎలా ఉన్నారో దానిని ఇష్టపడినప్పుడు మరియు తాము ఏమైయున్నారో అది కాకుండా మరేవిధంగాను ఉండాలని కోరుకోలేదని గుర్తుంచుకోండి?
బాక్సింగ్ మరియు కుస్తీలు తమ ఆటలేనని మరియు బెంచ్ ప్రెస్ ఎంత బాగా చేయగలమోనని గొప్పగా చెప్పుకునే పురుషులు ఉన్న కాలం గుర్తుందా?
మేకప్, చెవిపోగులు మరియు బికినీలను మహిళలు ధరించిన కాలం గుర్తుందా?
పరిచయాన్ని ప్రారంభించి, సంబంధానికి నాయకత్వం వహించి, జీవితకాల కట్టుబాట్లను చేసి, భద్రత మరియు స్థిరత్వంతో కూడిన పురుషత్వాన్ని మాదిరిగా చూపిన పురుషుల కాలం గుర్తుందా?
నేను వివేచనగల, నిర్ణయాత్మకమైన, దృఢమైన హృదయం గల పురుషుల గురించి మాట్లాడుతున్నాను, వారు ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలుసు మరియు వారిని అక్కడికి చేర్చడానికి తమ మీద తమకు (అలాగే తమ దేవునిమీద) తగినంత నమ్మకంతో ఉంటారు. నాయకత్వం వహించడానికి భయపడని, ముందుకు సాగడం కష్టంగా ఉన్నప్పటికీ, వారి నియమాలలో స్థిరంగా నిలబడే పురుషులు.
ఇటువంటి లక్షణాలు మహిళల గౌరవాన్ని ప్రేరేపించడమే కాకుండా, హీరోల కోసం ఆకలితో ఉన్న యువకులు మరియు అబ్బాయిలలో ఆరోగ్యకరమైన అభిమానాన్ని కూడా కలిగిస్తాయి. మనకు స్పష్టంగా ఆలోచించే, కష్టపడి పనిచేసే, సూటిగా మాట్లాడే పురుషులు కావాలి, వారు మృదువుగా, ఆలోచనాత్మకంగా మరియు ప్రేమగా ఉన్నప్పటికీ, బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి అడగవలసిన అవసరం ఉందని అనుకోరు.
గత మూడు దశాబ్దాలుగా మనం పురుషాధిక్యతపై పెద్ద దాడిని చూశాం. కళలు, మీడియా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ, అలాగే మన యువకుల యొక్క హీరోలుగా మారిన వారిలోనూ ఫలితాలు బాగా కనబడుతున్నాయి.
హింసాత్మక U.S. అంతర్యుద్ధం నేపథ్యంలో, జోసియా హాలండ్ అమెరికా తరపున ఉద్వేగభరితమైన ప్రార్థనను రాశారు. అది ఇలా ప్రారంభమవుతుంది, “దేవా, మాకు మగవారిని ఇవ్వండి. . . .” కానీ నిజం ఏమిటంటే, దేవుడు ఒక దేశానికి మగవారిని ఇవ్వడు; ఆయన మనకు అబ్బాయిలను ఇస్తాడు. మగవారిగా మారడం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన మగపిల్లలను, కౌమారదశలో ఉన్న అబ్బాయిలను, ఆకట్టుకునే అబ్బాయిలను ఇస్తాడు. దేవుని ప్రణాళిక ఇప్పటికీ సృష్టి ఆరంభంలో ఆయన రూపొందించినట్లుగానే ఉంది. అది ఇంట్లోనే ఆరంభమవుతుంది.
పురుషులారా, మీరు దేవుని వాక్యం ప్రకారం పురుషత్వాన్ని మాదిరిగా కలిగియున్నారా? అమ్మలు మరియు నాన్నలు, మీరు మీ కుమారులను ప్రామాణికమైన మగవారిగా పెంచుతున్నారా? లేనట్లైతే, ఎందుకు పెంచడంలేదు? ఒక్కసారి ఆలోచించండి!
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000). Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.