సువార్తను అందించడం మరియు జీవించడం

నాకు తెలిసిన అత్యంత ప్రభావవంతమైన సువార్తికులలో ఒకడైన సహోదరుడు బోస్టన్‌కు వెలుపల ఆర్లింగ్టన్ అవెన్యూలో సర్వీస్ స్టేషన్ నడుపుతున్నాడు.

అతను సెమినరీలో ఒక్కరోజు కూడా గడపలేదు లేదా బైబిల్ ఇనిస్టిట్యూట్‌లో ఒక కోర్సు తీసుకోలేదు, కానీ అతని బైబిల్ బాగా పాతదైపోయింది మరియు అతని క్యాష్ రిజిస్టర్ దగ్గర అది తెరిచే ఉండేది. అతను తన వ్యాపార స్థలంలోకి వచ్చిన వారితో క్రమం తప్పకుండా మాట్లాడేవాడు. అతను ఇప్పుడు వేరే స్థలమునకు మారాడు కానీ, అతను ఇప్పటికీ నమ్మకమైన సాక్షి అని నాకు నమ్మకం ఉంది.

ఈ వ్యక్తి సువార్తను పంచుకున్నప్పుడు అనవసరమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడు. అతను క్రీస్తు జీవితంపై, దేవునియందు విశ్వాసం ద్వారా నిత్యజీవం యొక్క నిరీక్షణపై దృష్టి పెడతాడు, ఆపై అతను ఫలితాలను రాబట్టడానికి దేవుని మీద భారము వేస్తాడు. అతను నిత్యజీవము యొక్క అత్యంత ఆకర్షణీయమైన మరియు ప్రోత్సాహకరమైన సందేశాన్ని అద్భుతమైన జ్ఞానం మరియు ప్రేమను కలగలిపి అందిస్తాడు. సంవత్సరాలుగా, ఆర్లింగ్టన్ అవెన్యూలో వందలాది మంది ప్రజలు క్రీస్తును తెలుసుకున్నారు, ఫలితాలను దేవునికి వదిలేసిన ఈ స్థిరమైన వ్యక్తికి ధన్యవాదాలు.

సువార్తకు ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారనే దానికి దేవుడు నన్ను బాధ్యుణ్ణి చేయడని దేవుడు నన్ను ఒప్పించిన రోజు ఎంతో ఉపశమనం కలిగింది. సువార్త అందించడం మరియు జీవించడం, కోసం ఆయన మిమ్మల్ని మరియు నన్ను బాధ్యులను చేస్తాడు; దానితో ఎవరు ఏమి చేసారనే దాన్ని ఆయన చూసుకుంటాడు.

యేసు ప్రక్కన సిలువపై వ్రేలాడుతున్న దొంగ గురించి ఆలోచించండి. ఎప్పుడైనా మరణశయ్య మీద మారుమనస్సు జరిగిందంటే, అది ఈ సంఘటనే. దొంగ తన జీవితమంతా పాపాత్ముడిగా, దుర్మార్గంగా జీవించాడు. అతని చేతులు మరియు కాళ్ళ నుండి రక్తం రావడంతో ఆ సిలువపై వ్రేలాడుతుండగా, అతను ఇలా అన్నాడు, “యేసూ, నన్ను జ్ఞాపకము చేసికొనుము.” యేసు యొక్క ప్రతిస్పందన మీకు బాగా తెలుసు-ఆయన ఇలా అన్నాడు,”నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” (లూకా 23:43).

ఈ దొంగ పరలోకానికి వెళ్లే అర్హతను ఇచ్చింది ఏమిటి? పరలోకం సంపాదించడానికి అతను ఎలాంటి మంచి పనులు చేయలేదు. ఏ విధంగానూ అతను నిత్యజీవానికి అర్హుడు అని నిరూపించుకోలేదు. కాబట్టి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి అతను ఏమి చేశాడు? యేసు ఏమి అంగీకరించాడు? విశ్వాసం-సజీవుడైన క్రీస్తుపై సాధారణ, కల్తీ లేని, నిరూపించబడని విశ్వాసం. దేవునికి కావాల్సింది ఇదే, మనం ఇవ్వగలిగేదీ ఇదే.

దొంగ తన ప్రత్యేకమైన దృక్కోణం నుండి చూసిన యేసు జీవితం యొక్క చిత్రం తాను దేవుని కుమారుని ప్రక్కన ఉన్నానని అతను గ్రహించాడు. లూకా 23 లో వారి సాధారణ సంభాషణ మరియు మరణానికి బదులు జీవాన్ని కోరుకోవడం మనం చూస్తాము. వారి సంభాషణ మనకు మారుమనస్సు గురించి మూడు ముఖ్యమైన సత్యాలను బోధిస్తుంది.

1. క్రైస్తవుడిగా మారడానికి అవకాశంలేని దారుణమైన స్థితిలో ఎవ్వరూ లేరు. ఫలానా వ్యక్తి మారడని మీరు ఎవరి గురించైనా ఆలోచించగలరా? “ఓహ్, వారు క్రీస్తును ఎప్పటికీ తెలుసుకోలేరు. నేను అతనిని గెలవడానికి నాకు తెలిసినవన్నీ ప్రయత్నించాను మరియు అతను ఎప్పటికీ స్పందించడు.” ఎవరైనా కృపను పొందుకోవటానికి అవకాశం లేదని మీరు భావించినప్పుడు, సిలువపై ఉన్న నేరస్థుడిని గుర్తుంచుకోండి.

2. మీ దైవిక జీవితం సువార్త ప్రకటనకు అత్యంత ప్రభావవంతమైన సాధనం. పదాలను “తెలివితక్కువ విషయాలు” అని సోక్రటీస్ ఒకసారి అన్నాడు. ప్రజలు సాక్ష్యాన్ని మాటలతో బలవంతంగా చెప్పినప్పుడు కంటే ఎక్కువ స్పష్టంగా నేను మరెన్నడూ దాన్ని చూడలేదు. నిజమైన సందేశం మీ జీవితంలో ఉంది. మీ జీవితం నశించిపోయిన మనుష్యుల దృష్టిని ఆకర్షించినప్పుడు, మీరు ఉపయోగించే పదాలను బలపరచడానికి మీ దగ్గర తగిన రుజువు ఉంటుంది. దేవుడు వారి జీవితాలలో మరియు మీ జీవితంలో పనిని చేయనివ్వండి. ఆయన అలా చేసినప్పుడు, ఆయన మీకు సముచితమైన పదాలను ఎలా తెస్తాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

3. దేవునికి కావాల్సింది మరియు అంగీకరించేది సాధారణ విశ్వాసం మాత్రమే. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి మీరు కష్టపడి పనిచేస్తుంటే, ఆగండి-మీరు తప్పు మార్గంలో ఉన్నారు. దాని గురించి ఆలోచించండి-అందులోకి వెళ్లడానికి ఎన్ని పనులు సరిపోతాయి? విశ్వాసము ద్వారా రక్షణ అయితే, క్రియ మరియు మహిమ అంతా దేవునిదే. దేవుడు మీ నుండి కోరుకునేది మీ విశ్వాసం మాత్రమే-క్రీస్తుపై మాత్రమే విశ్వాసం.

మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి చివరిగా ఒక్క విషయం, నా స్నేహితుడా-మీరు ఆయన దారిలోకి వచ్చినప్పుడు దేవుని కుటుంబంలోకి మీ తక్షణ ఆమోదాన్ని ఎన్నడూ అనుమానించవద్దు. దొంగ దేవుడిని అనుమానించలేదు. అతను ఆయనకి ఎలాంటి వాగ్దానాలు చేయాల్సిన అవసరం రాలేదు. అతను తన పూర్ణహృదయముతో విశ్వసించాడు మరియు అప్పుడే అక్కడే రక్షించబడ్డాడు.

బోస్టన్ సర్వీస్ స్టేషన్‌లోని నా స్నేహితుడిలాగే, దేవుడు అందించే ప్రతి అవకాశం ద్వారా దేవుడు మీ కోసం చేసిన వాటిని గూర్చిన అద్భుతమైన సత్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇతరులతో పంచుకోవడానికి దేవుడు మీకు జీవపు మాటలను అప్పుడే అక్కడే ఇస్తాడు.

Adapted from Charles R. Swindoll, “Giving and Living the Gospel,” Insights (April 2002): 1-2. Copyright © 2002 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in How to Know God-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.